దక్షిణాసియా డివిజనునందలి సేవెంతుడే ఎడ్వంటిస్టు సంఘము వృద్ధి చెందిన కొలది వివిధ భాషలు మాటలాడి చదువగల సభికులు లోకమందెల్ల డలగల సంఘమునకు ఉపదెశమును ఆశీర్వాదమును ఇచ్చుచున్న “టెస్టి మొనీస్, అనేక ఇతర ప్రవచనసార గ్రంధములను సాకల్యముగా ప్రచురించుట సాధ్యముకాదు. ఈ మూలమునుండి గ్రహించి కొన్ని హితోప దేశములను ఈ సంపుటమునందు క్రోడికరించితిమి. ఈ ఉపదేశములు సంఘమునకు లాభదాయకములుగాను,సహయకరములుగను ఉండగలవు. CChTel 9.1
అరువదియారు అధ్యాయములలో ఈ గ్రంధమందలి విషయములు చక్కగా కూర్చబడినవి. ఈ కూర్పు పనిని డివిజను కమిటీ వారును ఎలెన్ జి. వైటమ్మ గారి ప్రచురణల ధర్మకర్త్రత్వ సంఘమువారును నిర్వహించిరి. సెవెంతుడే ఎడ్వంటిస్టు సంఘముయొక్క ప్రధాన కార్యాలయమునగల శ్రీమతి వైటమ్మగారి రచనలను భద్రముగా నుంచుటకు ఈ ధర్మకర్త్పత్వ సంఘమువారు బాధ్యులు. CChTel 9.2
ఇ. జి. వైటమ్మ గారి అనేక గ్రంధములనుండి విషయమును ఏరి సమకూర్చి ,అనువదించి ఒక సంపుటములో సాకల్యముగా ప్రచురించుట చాలా కష్ట మైన పని. స్థలాభావముచే నతి ప్రాముఖ్య మైన అంశములపై అతి ముఖ్యమైన ఉపదేశములను మాత్రమే పొందుపర్చగలిగితిమి. ఇందుగూడ అంశవైవిధ్యము కలదు. కొన్ని సందర్భములలో ఆయా మూలములనుండి గ్రహించ బడిన విషయములు కొన్ని పేరాలలోనే పొందు పరచితిమి. అధ్యాయము చివర విషయములు ఏ గ్రంథముల నుండి గ్రహించబడినవో ఆ గ్రంథ వివరములు సంకేతములలో కాననగును. విడువబడిన పేరాలు , వాక్యములను వ్యక్తపరుచుటకు యత్నించలేదు. CChTel 9.3
పూనాలో 1955 వ సంవత్సరమున జరిగిన సెమినరీ ఎక్స్టెన్షన్ పాఠశాలకు డివిజను నఖముఖాలనుండి వచ్చిన పెక్కుమంది పనివారి విజ్ఞప్తి పై ఈ గ్రంథమందు ఎలెన్ జి. వైటమ్మ గారిని గూర్చియు సంఘారంభనుండి 1915 లో ఆమె మరణించువరకు ఆమెకున్న ప్రవచనవరమునుగూర్చియు పాఠకునికి విశదముచేయుటకు ఒక ఉపోద్ఘాతమును వ్రాసినాము. ఈ భాగము ఆమె దివ్యలేఖిని నుండి జాలువారు ఉపదేశమని అపోహపడరాదు. ఆయమ ఉపదేశము అధ్యాయలముతో ప్రారంభమయినది. CChTel 9.4
దీర్ఘకాలము దీనికొరకు ఆత్రముగా వేచియున్నవారికీ ఈ గ్రంధమును అందజేయ గలుగుట ముదావహము. ఈ గ్రంధమందలి ప్రశస్త హితోపదేసములు ఎడ్వంటిస్టు సత్యములందు పాటకుని విశ్వాసమును బలపర్చి ,యాటని క్రైస్తవానుభవమును విస్తృతముచేసి మన ప్రభువు తిరిగివచ్చు అంతిమ దినమునందు అతని విజయ విరీక్షణను సమున్నత పరచ గలందులకు మా హృదయపూర్వక ప్రార్ధనయై యున్నది. CChTel 10.1
—దక్షిణాసియా డివిజను నాయకులూ,
ఎలెన్ జి. వైట్ ప్రచురణలు ధర్మకర్త్రత్వ సంఘము