Go to full page →

అధ్యాయము 17 - సర్వలోకము నందలి క్రైస్తవులు క్రీస్తునందు ఏకమై యున్నారు. CChTel 186

(వివిధ భాషలు, సంప్రదాయములు గల అనేక భూభాగముల నుండి వచ్చిన సువార్తికుల సభయందు శ్రీమతి వైటమ్మగారు చేసిన హితోపదేశములో ఎక్కువ భాగము ఈ అధ్యాయములో పొందుపర్చబడినది. శ్రీమతి వైటమ్మ గారి ద్వారా దేవుడు తన ప్రజలకు పంపిన హితోపదేశము వైటమ్మగారి దేశస్థులకే యన్వయించునని యీ సువార్తికులలో కొందరు అపోహపడిరి. జ ` వైట్ ధర్మకర్తలు. ) CChTel 186.1

పసికూన తన తల్లిదండ్రులకడకు నిష్కపటముగా నెట్లు వెళ్లునో యట్లే మనము కూడ క్రీస్తు చెంతకు వెళ్లి పొందెదమన్న నమ్మికతో ఆయన వాగ్దానము చేసిన వానిని అడిగినచో అది మనకు తప్పక అనుగ్రహింప బడును. మనకెల్లరకు నుండవలసినంత విశ్వాసమున్నచో మనకూటములలో మన మెన్నడును పొంది యుండనంత విస్తారముగా దైవాత్మను పొందియుందుము. ఇప్పుడు ప్రశ్న యేమనగా: మనము ఊట వద్దకు వచ్చి నీళ్లు త్రాగుదుమా? సత్యోపదేశములు ఆదర్శము చూపెదమా? మనము ఆయన వాక్యమును విశ్వాసముతో గైకొన్నచో దేవుడు మనకొరకు గొప్ప కార్యములు చేయును. దేవుని ముందు మనమెల్లరము దీన హృదయముతో కాన్పింతముగాక! CChTel 186.2

కూటములు ప్రారంభమైనప్పటి నుండియు ప్రేమ, విశ్వాసమును గూర్చి మాటలాడవలెనని నేను ప్రేరేపించ బడితిని. కారణమేమనగా ఈ సాక్ష్యము మీకవసరము. సువార్త క్షేత్రములయందడుగిడిన వారిలో కొందరు ఇ ట్లనిరి: “ఫ్రెంచి ప్రజలకు మీరెరుగరు. జర్మను ప్రజలను మీరెరుగరు. వారిని సంధించవలసిన రీతి యిది.” కాని నేనిట్లడిగెదను: దేవుడు వారినెరుగడా? ఆ ప్రజలకు సందేశము పంపువాడా యన కాడా? వారికేమి యవసరమో ఆయనకు అవగతమే. ప్రత్యక్షముగా ఆయన యొద్దనుండి తన సేవకులద్వారా ఆ వర్తమానము ప్రజలకు వచ్చినచో దాని కర్తవ్యమునది సాధించి తీరును. క్రీస్తునందు అందరిని అది ఒకటిగా చేయును. కొందరు ఫ్రెంచివారు, కొందరు జర్మనులు, కొందరు అమెరికనులు అయినట్లు వారందరును క్రీస్తును పోలిన వారగుదరు. CChTel 186.3

యూదులు దేవాలయము పర్వతమునుండి త్రవ్వి తీసి మలచిన రాళ్లతో నిర్మింపబడెను. ఎరూషలేముకు తేబడక పూర్వము ప్రతి రాయి పరీక్షింపబడి, చెక్కబడి, మెరుగు పెట్టబడి దాని దాని స్థానమునకు సరిపడునట్లు తయారు చేయబడెను. అవన్నియు దేవాలయము కట్టు స్థలమునకు చేర్చబడగా సుత్తెదెబ్బగాని గొడ్డలి పెట్టుగాని లేకుండ ఆలయము కట్టబడెను. ఈ ఆలయము దేవుని ఆధ్యాత్మికాలయమును చూపించుచున్నది. ప్రతి రాజ్యము భాష, ప్రజ, సర్వ వర్గములకుచెందువారు, అల్పులు, అధికులు, ధనికులు, దరిద్రులు, విదాయవంతులు, నిరక్షరాస్యులు ` వీరితో ఈ అలయము నిర్మించబడినది. సుత్తెతోను, ఉలితోను చెక్కి అమర్చుటకు వీరు అచేతనులు కారు. వీరు సత్యముచేత ప్రపంచము నుండి వేరుపర్చబడిన జీవము గల రాళ్లు. మహాశిల్పి వారిని చెక్కి వారికి మెరుగు పూతపూసి ఆ ఆధ్యాత్మికాలమయులో తమ తమ స్థానముల నాక్రమించు కొనుటకు వారిని సిద్దము చేయుచున్నాడు. పూర్తియై న పిదప ఈ ఆలయము సర్వ సంపూర్ణముగా నుండి దేవదూతలను మానవులను ముగ్ధులు చేయును. ఏలయనగా దాని శిల్పియు, నిర్మాణకుడును దేవుడే. తన మీద ఏ దెబ్బయు పడరాదని ఎవరును తలంచరాదు. పత్రి తలంపు నందును అభ్యాసమునందును సంపూర్ణతకల వ్యక్తులు లేరు, రాజ్యము కూడ లేదు. ఒకరి యొద్ద నుండి మరి యొకరు నేర్చుకొనవలెను. అందేచేత తలంపునందును, ఆశయము నందును సమైక్యత గలిగి యుండుటకు గాను వివిధ జాతులు ఒకటిగా లీనము కావలెనని దేవుడు వాంఛించుచున్నాడు. అప్పుడు క్రీస్తు నందలి సంయోగము ప్రదర్శింపబడును. CChTel 187.1

ఈ దేశము వచ్చుటకు నేను కొంచెము భయపడితిని. ఏలయనగా ఐరోపాయందు వేర్వేరు జాతులవారిని ఆయా రీతులలో సంధించవలసి యుండునని చెప్పబడినప్పుడు, ఈ దేశమునకు వచ్చుటకు భయపడితిని. తమ అవసరమును గుర్తించి ఆయన అభ్యర్థించువారికి దేవుడు వివేకమును గ్రహించును. ప్రజలు సత్యము నంగీకరించునట్లు దేవుడు చేయును. కుమ్మరివాడు మట్టిని పోతపోయునట్లు మీ మనసును పోత పోయుటకుగాను దానిని దేవుని కీయుడి. అప్పుడే వ్యత్యాసభావములుండనే యుండవు. సహోదరులారా క్రీస్తు వైపుకు చూడుడి. ఆయన స్వభావమును విధానములను అనుకరించుడి, అప్పుడే వర్గములకు చెందు ప్రజలనైనను సంధించుటలో మీకు కష్టములు కలుగవు. CChTel 187.2

మన మవలంభించుటకు ఐదారు మాదుర్లు లేవు. మనకు ఒకే ఒక మాదిరి కలదు. ఆ మాదిరి యేసు క్రీస్తే. ఇటలీ సహోదరులు, ఫ్రెంచి సహోదరులు, జర్మనీ సహోదరులు ఆయనవలె నుండుటకు ప్రయత్నించుచో వారు తమ పాదములను సతయమును ఒకే పునాదిపై మోపిన వారగుదురు. ఒకరి యందున్న ` క్రీస్తే శుభప్రదమైన నిరీక్షణయను స్వభావము అందరియందును ఉండును ` సహోదరులారా, సహోదరీలారా, వివిధ జాతుల మధ్య అడ్డుగోడలు నిర్మించవలదని మిమ్మును హెచ్చరించుచున్నాను. అట్లుగాక ఇట్టి బేధము లెక్కడున్నను వానిని సడలించుటకు చర్య పుచ్చుకొనుడి. మన సహమానవుల రక్షణయును ఏకైక లక్ష్య సాధనకు కృషి చేయుచు అందరిని క్రీస్తు నందు ఐక్యము చేయుటకు మనము ప్రయత్నించవలెను. CChTel 188.1

సువార్త సేవ చేయుచున్న సహోదరులారా, దేవుని మహత్తర వాగ్ధాత్తములను చేపట్టెదరా? స్వార్థమును విసర్జించి యేసును కనపరతురా? మీ ద్వారా దేవుడు పనిచేయకముందు స్వార్థము చావవలెను. అక్కడక్కడ కొందరిలో స్వార్థము ఉధృతమగుట చూడగా నాకు ఆందోళన కలుగుచున్నది. మీ చిత్తములు నశించి పోవలెనని నజరేయుడైన యేసు పేర మీకు చెప్పుచున్నాను. అవి దేవుని చిత్తమువలె మారవలెను. మిమ్మును కరిగించి మాలిన్యము నుండి మమ్మును శుద్ధిపరచవలెనని ఆయన వాంఛ. దేవుని శక్తితో మీరు నింపబడక పూర్వము మీలో గొప్ప మార్పు జరుగవలెను. ఈ కూటము సమాప్తి కాక ముందు ఆయన మహదాశీర్వాదములను గ్రహించుటకు గాను ఆయనను సమీపించుడని మిమ్మును బ్రతిమాలు చున్నాను. 19T 179-182; CChTel 188.2