అనేక సంవత్సరముల క్రిందట, క్రీస్తు త్వరితాగమన విశ్వాసుల సమూహము చాల చిన్నదిగానున్న రోజులలో మెయిన్ వదిలి టాష్షేములోని సబ్బాతీయులు సహోదరుడు స్సాక్ బ్రిడ్జి హౌలెండుగారి గృహమందలి పెద్ద వంటగదిలో ఆరాధనకు కూడుకొనెడివారు. ఒక సబ్బాతు ఉదయమున సహోదరుడు హౌలేండు కూటమునకు రాలేదు. మాకు చాల ఆశ్చర్యము కలిగినది. ఆయన ఎల్లప్పుడును హాజరగు వ్యక్తి. కాసేపటికి ఆయన వచ్చెను. ఆయన ముఖమందు దైవ మహిమ ప్రకాశించు చుండెను. ఆయన ఇట్లనెను. “సహోదరులారా, నేను దానిని కనుగొంటిని. ఆ విషయమును గూర్చి దైవ వాక్యమిట్లు హామీ ఇచ్చుచున్నది; ‘నీ వెన్నడును పడిపోవు; దానిని గూర్చి మీకు చెప్పెదను.” CChTel 189.6
పేద జాలరివాడు ఒక సహోదరుడు తాను గౌరవించబడవలసినంతగా గౌరవించబడుట లేదనియు సహోదరుడుహౌలెండు గారు తదితరులు ఈతనికన్న అధికులమని తలంచుచున్నారనియు ఇతడనుకొనుచున్నట్లు తాను గ్రహించితినని హౌలెండుగారు చెప్పిరి. ఇది వాస్తవము కాదు. కాని యాతడట్లు తలంచెను. అందుచేత అతడు అనేక వారములు కూటములకు హాజరు కాలేదు. కనుక హౌలెండుగారతని ఇంటికి వెళ్లి అతని ముందు మోకరించి ఇట్లనెను. “నా సహోదరుడా నన్ను క్షమించుము. నేను నీ యెడల చేసిన యపరాధమేమి?” అతడీయనను చేయినట్టుకొని పైకి లేపుటకు యత్నించెను. CChTel 190.1
“కాదు, నాపై మీకెందుకు కోపము?” అని హౌలెండుగారు అడిగిరి. “మీమీద నాకేమియు లేదు.” యని యాతడు పల్కగా, ఏదో నా మీద మీకు ఉండి తీరవలెను; కారణమేమనగా ఒకప్పుడు మన మిరువురము ఒకరితో నొకరు మాట్లాడుకొనెడి వారము. అయితే యిప్పుడు మీరు నాతో మాట్లాడుట లేదు. అందుకు కారణము తెలిసికొన గోరుచున్నాను” అని హౌటెండు గారు అనిరి. CChTel 190.2
“హౌలెండు సహోదరా, పైకి లెమ్ము” యని యాతడు పలికెను. “నేను లేవను” అని హౌలెండుగారు ఉత్తర మిచ్చిరి. “అట్లయినచో నేను కూడ మోకరించవలెను” అనుచు నతడు మోకరించి పిల్ల చేష్టలు చేసినందుకును, అపోహలకు లోనై నందులకును తనను క్షమించమని ఆయనను వేడెను. “ఇప్పుడు వాటన్నింటిని విసర్జించెదరు” అని యాతడు చెప్పెను. CChTel 190.3
ఈ అనుభవమును వివరించు చుండగా సహోదరుడు హౌలెండు ముఖము ప్రభుని కృపతో ప్రజ్వలించెను. ఆ కథనము నాయన ముగించు సరికి ఈ జాలరి సహోదరుడు కుటుంబ సమేతముగా కూటమునకు వచ్చెను. మేము ఆహ్లాదకరముగా కూటము జరుపుకొంటిమి. CChTel 190.4
మనలో కొందరు సహోదరులు హౌలెండు గారి విధానము నవలంబింతు మను కొందము. మన సహోదరులు అపోహలు కలిగి యున్నప్పుడు వారివద్ద కేగి “మీకు హాని కలిగించునదేదైన నేను చేసినచో నన్ను క్షమించుడి.” అని యడుగుట ద్వారా సాతాను ప్రాబల్యమును తొలగించి మన సహోదరులను శోధనలకు లోనుగాకుండ చేతుము. మీకును మీ సహోదరులకును మధ్య యేకష్టమును రానీయకుండ చూచుకొనుడి. అనుమానమును నివారించుటకు ఏదయిన త్యాగము అవసరమైనచో అది చేయుడి. సహోదరులవలె మనమొకరి నొకరు ప్రేమించుకొనవలెనని దేవుని కోరిక. మనము దయా కనికరములతో మెలగవలెనని దేవుడు కోరుచున్నాడు. మన సహోదరులు మనలను ప్రేమించు చున్నారనియు క్రీస్తు కూడా ప్రేమించు చున్నాడనియు మనము నేర్చుకొన ఆయన కోరుచున్నాడు. ప్రేమవలన ప్రేమ జనించును. CChTel 190.5
మనము మన సహోదరులను పరమందు కలిసికొన నిరీక్షించు చున్నామా; వారితో నిక్కడ సమైక్యత కలిగి సమాధానముగా జీవించ గలిగినచో అక్కడ వారితో కలిసి మనము జీవించగలము. అయితే ఇక్కడ వారితో వివాదము సంఘర్షణలు లేకుండ జీవించ జాలనప్పుడు వారితో పరలోకమందెట్లు జీవించగలము? సహోదరుల నుండి తమ్మును వేరుపర్చి అసమ్మతి, అనైక్యత కలుగజేయు కార్యములు చేయువారికి సమగ్రమైన మారు మనసు అవసరము. క్రీస్తు ప్రేమ వలన హృదయ పరివర్తన పొంది వినయ మనస్కులము కావలెను. కల్వరి సిలువపై మన కొరకు మరణించుట ద్వారా ఆయన కనపరచిన ప్రేమను పెంపొందించు కొనవలెను. రక్షకుని మనము యెక్కువగా సమీపించవలెను. మనము యెక్కువగా ప్రార్థించి విశ్వాసమును ప్రదర్శించుట నేర్చుకొనవలెను. మనము దయ, కనికరము, వినయములతో కూడిన మనసు కలిగి యుండవలెను. ఈ ప్రపంచమందు మనము ఒకసారి మాత్రమే ప్రయాణింతుము. మన స్నేహితులకు క్రీస్తు శీలమును ప్రదర్శించుటకు మనము ప్రయాస పడవద్దా? CChTel 191.1
మన కఠిన హృదయములు నలుగగొట్టబడవలెను. మనము సంపూర్ణ ఐక్యత కలిగి యుండవలెను. నజరేయుడైన యేసు క్రీస్తు రక్తముతో కొనబడిన వారమని మనము గుర్తించవలెను. నాకొరకాయన తన ప్రాణము పెట్టెను. నా కొరకు తన ప్రాణము నర్పించుటద్వారా ఆయన చూపిన ప్రేమను ఈ లోక సంచారమందు నేను కనపర్చవలెనని ఆయన కోరుచున్నాడు అని అందరకు చెప్పవలెను. దేవుడు న్యాయవంతుడును తనయందు విశ్వాసముంచువారిని నీతిమంతులని తీర్చువాడును అని తెలుపుటకుగాను తన స్వకీయ శరీరమందు సిలువపై క్రీస్తు మన పాపమును మోసెను. క్రీస్తు నాశ్రయించువారికి నిత్య జీవము కలదు. 49T 191—193; CChTel 191.2