Go to full page →

ఫలములను బట్టి సాక్ష్యములను విమర్శించుట CChTel 207

సాక్ష్యములు వాని ఫలములను బట్టి విమర్శించబడవలెను. వాని బోధల స్వభావమెట్టిది? వాని ప్రభావ ఫలితమే మి? అట్లు చేయ కాంక్షించు వారెల్లరు ఈ దర్శన ఫలములను తెలిసికొనవచ్చును. సాతాను శక్తులకును,సాతానుకు తన పనియందు సాయము చేసిన మానవుల పలుకు బడికిని వ్యతిరేకముగా ఇవి కోలుకొని బలపడుట సమంజసమని దేవుడెంచెను. CChTel 207.1

ఈ సాక్ష్యముల ద్వారా దేవుడు సంఘమునకుపదేశమిచ్చును సంఘస్తులను తమ తప్పిదముల విషయము మందలించి వారి విశ్వాసమును బలపర్చుచున్నాడని గాని లేదని గాని తీర్మానించు కొనవలసియున్నాము. ఈ పని దేవునిది. లేదా అది అసలు ఆయనదే కాదు. దేవడేపని యందైనను సాతానును బాగస్వామిగా అంగీకరింపబడు. నా పని.. .. . దేవుని సంబంధమైనదై యుండవలెను. లేదా అది అపవాది సబంధమైనది. ఈ ఉపదేశము మంచి చెడ్డల సమ్మేళనము కాదు. సాక్ష్యములు దైవాత్మ ప్రతి వాదితములు. అట్లు కానిచో నవి అపవాది ప్రతివాదితములు. CChTel 207.2

ప్రవచనసారముద్వారా ప్రభువు తన ప్రత్యక్షతను నాకు కనపర్చినప్పుడు గతము, ప్రస్తుతము, భవితవ్యములు నేను చూచితిని. అనేక సంవత్సరములు కడచిన తర్వాత నేను వారిని చూచినపుడు గుర్తించితిని. కితము నాకు అనుగ్రహింపబడిన అంశములను గూర్చి విస్పష్ఠమైన ఎరుకతో నిద్రనుండి లేపబడితిని. అర్ధరాత్రి వేళ ఉత్తరములు వ్రాసితిని. ఆ ఉత్తరములు ఖండాంతరములకు ప్రయాణించి క్లిష్ట సమయమున చేరి దైవసేవను ఆపద నుడి రక్షించినవి. అనేక సంవత్సరములుగా నేను చేయుచున్న పనియిదే. నేను ఊహించినట్టి తప్పిదములు విషయము కూడా మందలించుమన, గద్దించుమని నన్ను ఒక శక్తి ఆవేశముతో నింపినది. ఈ పని పరసంబంధమైనదా?55T 671; CChTel 207.3