Go to full page →

సంఘమునకు ఉపదేశములు CChTel 237

రెండవ భాగము CChTel 237

అధ్యాయము 25 - బాప్తిస్మము CChTel 239

బాప్తిస్మము, ప్రభురాత్రి భోజనము అను నీ రెండు సంస్కారములును రెండు స్మారక చిహ్నస్తంభములై సంఘము లోపల నొకటి సంఘము వెలపల నొకటిగా నున్నవి. ఈ సంస్కారములపై నిజదైన నామమును క్రీస్తు లిఖించెను. CChTel 239.1

క్రీస్తు తన ఆధ్యాత్మిక రాజ్యప్రవేశమునకు బాప్తిస్మము నొక గురుతుగా జేసెను. తండ్రి కుమార పరిశుద్ధాత్మల యధికారమును, గుర్తింపగోరు వారందరికి నొక కచ్ఛితమైన భేషరతుగా దీనినాయన రూపొందించెను. మానవుడు సంఘమందు స్థానమును సంపాదించకముందు; దేవుని ఆధ్యాత్మిక ద్వారము దాటకముందు “మనకు నీతియగు యెహోవా” అను దైవ నామ ముద్రికను అతడు పొందవలెను. (ఇర్మియా 23:6) CChTel 239.2

బాప్తిస్మము గంభీర భావము కలది. అది ప్రపంచ పరిత్యాగమును సూచించుచున్నది. తండ్రి కుమార పరిశుద్ధాత్మల నామమందు బాప్తిస్మము పొందువారు తమ క్రైస్తవ జీవితారంభమందే సాతాను సేవకు స్వస్థి చెప్పి పరలోక రాజ కుటుబ సభికులమైతిమని ప్రపంచము నెదుట పలికెదరు. “కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైనదాని ముట్టకుడి” అను నాజ్ఞను వారు శిరసావహించిరి. వారి యెడల “నేను మిమ్మును నేర్చుకొందును. మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునైయుందురని సర్వశక్తిగల ప్రభువు సెలవిచ్చుచున్నాడు” అనువాగ్దత్తము నెరవేర్చబడును. (2 కొరింథి 6:17,18) CChTel 239.3

బాప్తిస్మపు క్రియయందు మనము చేయు ప్రమాణములు గంభీరమైనవి. తండ్రికుమార పరిశుద్ధాత్మల నామమున క్రీస్తు మరణము ననుకరించి మనము భూస్థాపన చేయబడి నూతన జీవితము జీవించవలసి యున్నాము. క్రీస్తు జీవితముతో మన జీవితము ఏకస్థము కావలెను. అందునుబట్టి దేవునికిని, క్రీస్తుకును, పరిశుద్ధాత్మకును తన జీవితము సమర్పించబడినదని విశ్వాసి గుర్తించవలెను. లోక వ్యవహారములన్నియు ఈ నూతనానుభవమునందు రెండవ స్థాయిని నాక్రమించునట్లు అతడు చేయును. గర్వమును, స్వప్రయో జనరాయణతన వర్జింతునని యాతడు బహిరంగముగా ఒప్పుకొనెను. నిర్లక్ష్యముగా నతడు జీవించరాదు. అతడు దేవునితో నొక నిబంధన చేసికొనెను. లొకముపట్ల అతడు మృతుడయ్యెను. అతడు ప్రభునివాడై జీవించవలెను. తాను దైవ ముద్రికను పొందినవాడననియు, క్రీస్తు రాజ్య పౌరుడును దేవ స్వభామునందు పాలివాడుననియు గుర్తించి తనకనుగ్రహించబడిన సర్వ సామర్థ్యములను దేవుని కొరకు వినియోగించవలెను. దైవ నామమహిమార్ధమై తనకున్నవరములన్నింటిని ఉపయోగించుచు తన యావచ్ఛరీరమును, సర్వస్వమును అతడు దేవునిఇ సమర్పించవలెను. CChTel 239.4