Go to full page →

అవిశ్వాసికి క్రైస్తవుని సమాధానము CChTel 266

మత నియమముల సార్థకత విషయము పరీక్షించబడు స్థితి యందున్నపుడు ప్రతి క్రైస్తవుడును చేయవలసినదేమి? ఆదర్శ ప్రాయమైన స్థైర్యము కలిగి యిట్లు చెప్పవలెను. నేను మనస్సాక్షి గల క్రైస్తవుడను, వార మందలి యేడవ దినము బైబిలు సబ్బాతు దినమని నాకు తెలియును. మానమ్మకము నియమములు వ్యత్యస్త మార్గమునందు నడుపు నవి. మన మిరుపురము కలిసియున్నచో సంతోషముగా నుండజాలము. కారణమేమనగా దైవచిత్తమును గూర్చిన సమగ్ర జ్ఞానము పొందుటకు నేను ప్రయాసపడుకొలది నేను లోకస్థులవలే నుండక క్రీస్తు స్వరూపమునకు మార్చబడెదను. క్రీస్తులో పేర్మిని నీవు కాంచలేకున్నచో నేను ప్రేమించలేని లోకమును నీవు ప్రేమింతువు. నేను దేవుని గూర్చిన సంగతులను ప్రేమింతును. నీవు వీనిని ప్రేమించలేవు. ఆధ్యాత్మిక వివేచన లేకున్నచో నాపై దేవునికి గల హక్కులను గుర్తింపజాలవు. మరియు నేను సేవ జేయు దేవునిపట్ల నా విధులను నీవు గుర్తింపజాలవు. ఆ హేతువుచేత మతాసక్తి కలిగి నిన్ను నేను అలక్ష్యము చేయుచున్నానని నీవు తలంచెదవు. నీవు సంతోషముగా ఉండలేవు. దేవుని యెడల నేను చూపు ప్రేమను గూర్చి నీకు ఈర్ష్య కలుగును. మత విశ్వాసము నందు నేను ఒంటరిగా నుందును. నీ దృక్పధములు మారి దైవవిధులకు నీ హృదయము లొంగి నా రక్షకుని ప్రేమించ నేర్పినచో అప్పుడు మన సంబంధము నూతనము కావచ్చును. CChTel 266.3

ఇట్లు విశ్వాసి క్రీస్తు నిమ్తితము త్యాగము చేయును. దీనిని తన మనస్సాక్షి సమర్థించును. నిత్య జీవమునితడు ఎక్కువగా ఎంచి దానిని కోల్పోవనిచ్చగించుట లేదని యిది చూపించుచున్నది. క్రీస్తుకు ప్రతిగా ప్రపంచము నెన్నుకొని క్రీస్తు సిలువ నుండి యాతనిని దూరముగ నడిపించు వ్యక్తిని వివాహమాడుటకన్న పెండ్లి చేసికొన కుండుట శ్రేయస్కరమని యాతడెంచును. CChTel 267.1