Go to full page →

వివాహమైన పిదప క్రైస్తవమతము స్వీకరించిన వ్యక్తికి సలహా CChTel 268

వివాహమునకు ముందు క్రైస్తవుడు కాని పురుషుడు క్రైస్తవమతము స్వీకరించిన హేతువు చేత తన భార్యకు నమ్మకముగా నుండ బద్ధుడై యున్నాడు. మత విషయములలో వారికెన్ని భేధాభిప్రాయములున్నను అతడామెకు నమ్మకముగా నుండవలెను. శ్రమలు హింసలు కలిగినను, ఏ లౌకిక సంబంధము కన్న దైవ విధులకు ఎక్కువ ప్రాధాన్యము నీయవలెను. ప్రేమ పాత్వికములు ప్రాతిపదికాగల ఈ యధార్ధత అవిశ్వాసిని క్రీస్తు చెంతకు చేర్చును. 1AH 48,49,61-69. CChTel 268.4