Go to full page →

వివాహము సామాన్యముగను ఆనందకరమగు సమయముగను ఉండవలెను. CChTel 270

క్రీస్తు నొద్దనుండి బయల్వెడలు దైవప్రేమ మానవ ప్రేమ నెన్నడును నాశనము చేయదు. కాని దాని నది తన యంది ముడ్చుకొనును. ఆ ప్రేమ వలన మానవ ప్రేమ సంస్కారమును, పరిశుద్ధతను, ఔన్నత్యమును, ఔదార్యమును పొందును. దైవస్వభావ ముతో సంయోగమయి పరమువైపుకు పెరుగుటకు శిక్షణ పొందువరకు మానవ ప్రేమ తన ప్రశస్త ఫలములను ఫలింప జాలదు. యేసు ఆనందదాయకములగు వివాహములను కుటుంబములను చూడగోరు చున్నాడు. CChTel 270.4

కానాలో జరిగిన యీ వివాహ విందుకు యేసు ఆయన శిష్యులు ఆహ్వానింపబడినపుడు అట్టి ఆనందయమమైన సమయమునందు మేము పాల్గొనరాదని చెప్పవలెనని క్రీస్తెక్కడును ఆదేమీయలేదు. ఆయన కట్టడలను గైకొనుట ద్వారా క్రీస్తు మనకు ఉపదేశించెను. పరలోకపు చట్టముల కనుగుణముగా మానవాళి జరిపిన యిట్టి ఉత్సవముల నాయన నిరుత్సాహపరచలేదు. క్రీస్తు తాను హాజరగుట ద్వారా గౌరవించిన యిట్టి కూటములకు ఆయన శిష్యులు కూడా హాజరగుట సమంజసమే. ఈ విందుకు వెళ్ళిన తరువాత ఆయన చాలా విందులకు హాజరయ్యెను. తన సముఖముతోను ఉపదేశముతోను వాని నాయన పావన పరచెను. CChTel 271.1

ఉభయపక్షముల వారికి స్తోమత ఉన్నప్పటికిని వివాహములో పెద్ద ఆడంబరము చేయవలసిన అగత్యము లేదు. వివాహ కార్యము కేకలతోను ఉత్సాహధ్వనులతోను డంబాచారముతోను జరిగించుట అసమంజసమని నాకు తోచినది. అది ఒక నటనగా నుండును. ఇది కూడదు. ఈ యాచారమును దేవుడు స్థాపించెను. పవిత్రముగా ఆచరించుటకిది యియ్యబడినది. ఇక్కడ ఏర్పడిన కుటుంబ బాంధవ్యము పరలోక కుటుంబముతో తామెట్లు మెలగబోదురో ప్రదర్శించవలసి యున్నది. దైవమహిమకు నిత్య ప్రాధాన్యత నీయవలెను. 1AH 99-101; CChTel 271.2