Go to full page →

ఆత్మనిగ్రహశక్తిని బలహీనమొనర్చుటకు సాతానుని యత్నము CChTel 283

పవిత్రతాప్రమాణమును అధోగతికి తెచ్చి దంపతుల ఆత్మనిగ్రహమును బలహీనము చేయుటకు సాతానుడు యత్నించును. కారణమేమనగా తుచ్ఛభోగాసక్తులు అధికరించు కొలది నైతికశక్తులు క్షీణించునని వానికి తెలియును. వారి అత్మియాభివృద్ధిని గూర్చిన భయమేమియు వానికుండదు. వారి సంతతిపై తన అసహ్యస్వరూపమును మరియొక విధముగా ముద్రించుట సాధ్యముకాదనియు ఆ పిల్లల నడతను తల్లిదండ్రలు నడతకన్న సులభముగా తన చిత్తానుసారము రూపొందించగలనని కూడ అతనకి ఎరుకయే. CChTel 283.3

స్త్రీ పురుషులారా ,మోహమును గూర్చియు దానిని తృప్తిపరచుట వలన కలుగు పర్యవసానమును గూర్చియు మీరు ఒక నాడు తెలిసికోనేదారు. అవివాహితులలో కనబడుతుచ్చకామమే వివాహమైన వారి యందును ఉండుట సాధ్యము. CChTel 284.1

తుచ్ఛకామాసక్తులను అదుపుచేయకుండుట వలన కలుగు ఫలితమేమి ?దేవదూతల ఆధీనము నందుండవలసిన శయనమందిరము దుష్కార్యములచే అపవిత్రమొనర్చబడుచున్నది. జంతు స్వభావము ఆధిపత్యముచేయును గనుక శరీరములు పొడగుచున్నవి ;ఆసహ్యములగు అభ్యాసములకు ,అసహ్యములగు వ్యాధులకు దారితీయును. ఆశీర్వాదముగా దేవుడను గ్రహించినది శాపముగా చేయబడును. CChTel 284.2

అధిక దాంపత్య క్రియ దైవ చింతనాశక్తిని నిర్మూలించును. శరీర పోషణకు అవసరమగు పదార్ధమునుండి తీసివేయును;ప్రాణపోషక శక్తిని హరించి వేయును. ఈ స్వనాశన క్రియ యందు ఏ స్త్రీయును తన భర్తకు తోడ్పడరాదు. ఆమెకు విజ్ఞానము ,పతియందు వాస్తవప్రేమ ఉన్నచో ఇట్లు చేయదు. CChTel 284.3

మృగేచ్చలను తీర్చుకొను కొలది అభివృద్ధి చెంది అధిక సంభోగ క్రియాశక్తిని రెచ్చగోట్టును. దైవ భీతిగల స్త్రీ పురుషులు తమ కర్తవ్యమును గుర్తింతురుగాక !క్రైస్తవులమని చెప్పుకొనుచున్న అనేకులు ఈ విషయమందు మితిమీరి నందున మెదడుకు నరములకు సంభందించిన పక్షవాయువుతో బాధపడుచున్నారు. CChTel 284.4