Go to full page →

మిరు విలువవెట్టి కొనబడినవారు CChTel 287

నీచాకామాసక్తులకు శరీరమే కేంద్రము. అవి దాని ద్వారనే పనిచేయును. “శరీరము ,“శరీర సంబంధమైన ”,“శరీరాశులు “లను మాటలు తుచ్చమైన పాపస్వభావమునకు సంభందించినవి. శరీరము తనకై తానూ దైవచిత్తమునకు విరోధముగా ప్రవర్తింప జాలదు. శరీరమును దాని యిచ్చలను సిలువవేయవలెను మనము ఆదేశించ బడితిమి ,ఇది చేయుట యెట్లు :శరీరమును బాధకలుగజేయుదమా ?అట్లు చేయరాదు. కాని పాపమునకు నడుపు శోధనను సిలువవేయవలెను. దురాలోచనలను బహిష్కరించవలెను. ప్రతి ఆలోచన యేసు క్రీస్తు వశములోనికి తెబడవలెను. అన్నిటికన్న ఎక్కువగా దేవుని ప్రేమించవలెను. క్రీస్తు విభజింపబడని సింహాసనము నధిష్టించవలెను. మన శరీరములు ఆయన కొనిన ఆస్థిగా పరిగణించబడవలెను. శరీరావయవములు నీతి సాధనములై యుండవలెను. 1AH 121-128. CChTel 287.1