Go to full page →

మాతృకర్తవ్య పవిత్రత CChTel 295

ఆదిలో దేవుడు సంకల్పించునట్లు స్త్రీ తన భర్తతో సమాన ప్రతిపత్తి కలిగి యుండవలెనను. ప్రపంచమునకు పేరుకు మాత్రమే తల్లులై యుండువారు గాక యదార్థమగు తల్లులు అనవసరము. స్త్రీ యొక్క విశిష్ట కార్యకలాపములు పురుషుని కార్యకలాపములకన్న ఎక్కువ పవిత్రమైనవి, ఎక్కువ పరిశుద్ధమైనవి అని ఘంటాపధముగా చెప్పవచ్చును. స్త్రీ తన కర్తవ్య పావిత్య్రమును గుర్తించి దైవబలమునందును భీతియందును కార్యసాధనకు పూనుకొనవలెను. ఈ లోకమందు నిస్వార్థ బుద్ది కలిగి దీనికన్న మేలైన ప్రపంచములో ఒక నివాసము కొరకు కృషి చేయునట్లు తల్లి తన పిల్లలకు శిక్షణ నీయవలెను. CChTel 295.2

భార్య పూర్తిగ తన భర్తపై ఆధారపడి తన బలమును పోగొట్టుకొని తన శక్తులను దాచిపెట్టరాదు. అతని వ్యక్తిత్వములో ఆమె తలంచవలెను. అతడే బాధ్యత నిర్వహించినను తుదకతడు రాష్ట్ర ముఖ్య న్యాయమూర్తియైనను తన పిల్లలకు శిక్షణ నిచ్చు ఆమె పనికూడా అన్ని విషయములలోను తన భర్త పని యంత ఉన్నతమైనదే. CChTel 295.3

సింహాసనాసీనుడైన రాజు పని తల్లి పనికన్న ఉన్నతమైనది కాదు. తల్లి తన గృహ మునకు రాణి, తన బిడ్డలు ఉన్నతమైన నిత్యజీవమునకు అర్హులగుటకుగాను వారి శీలములను తీర్చిదిద్దు కార్యము ఆమె కవగతమై యున్నది. అంతకన్న ఉత్కృష్ట సేవ కొరకు దేవదూతలు కూడా అర్రులు చాపరు. కారణమేమనగా ఈ పనిచేయుట ద్వారా ఆమె దేవునికి సేవ చేయుచున్నది. తన కర్తవ్య వైశిష్ట్యము నామె గుర్తించవలెను. అప్పుడిది ఆమెకు ధైర్యమును కలుగజేయును. తన కర్తవ్యము యొక్క విలువనామె గుర్తించి ప్రపంచప్రమాణమును లక్షించవలెను తనకు కలుగు భోధనలు ప్రతిఘటించుటకుగాను దేవుని సర్వాంగ కవచమును ధరించకొనవలెను. ఆమె చేయు పని శాశ్వతకాలము కొరకైనది. CChTel 295.4

పెండ్లియైన పురుషులు పిల్లలను చూచు నిమిత్తము భార్యలను ఇండ్లకడ విడిచి సువార్త సేవకు వెళ్ళినచో తల్లి చేయు ఇంటిపని తండ్రి చేయు సువార్త సేవతో సమనమైనది. భర్త సువార్త సేవరంగమందున్నాను భార్య గృహ సేవ రంగమందుండును. ఆమెకు గల విచారములు ఆందోళనలు భారములు భర్తకు గల వానికన్న సమధికములు. ఆమె చేయు పని గంభీరమైనది ,ప్రాముఖ్యమైనది. ప్రత్యక్ష సువార్త సేవ రంగమందున్న భర్త మానవుల లోకపు మెప్పును పొందక పోవచ్చును. అయితే ఆమె తన కుటుంబ శ్రేయస్సుకు పాటుపడి దైవాదర్శము ప్రాకరము వారి శీలమును తిర్చిదిద్దుటకు ప్రయత్నించినచో లిఖించుదూత ప్రపంచ మందలి దైవసేవకులలో ఆమె ఉత్తమురాలని వ్రాయును. పరిమిత జ్ఞానముగల మానవులు పరిగణించునట్లు దేవుడు పరిగణించడు. దుర్ణీతితో లోకము తొణికిస లాడుచున్నది. CChTel 296.1

ఫేషను ఆచారము యౌవనస్థులను ఆకర్షించుచున్నవి. ఉపదేశించుట, నడుపుట, అదుపుచేయుట ` తన యింటి బాధ్యతలను తల్లి నిర్వహించకున్నచో పిల్లలు స్వాభావికముగా నీతిని వీడి అవినీతి హత్తుకొనెదరు. ఆ బిడ్డకు మేము ఏమి చేయవలెనో దాని మాకు నేర్పు’ మని ప్రతి జనని తరుచు రక్షకునికి ప్రార్థించవలెను. దేవుడు తన వాక్యమందిచ్చిన ఉపదేశమును ఆమె మనస్కరించవలెను. అవసరమును బట్టి ఆమెకు జ్ఞానము అనుగ్రహించబడును. CChTel 296.2

ప్రతి జనని తన సమయము ప్రశస్తమైనదని గ్రహించవలెను. ఆ గంభీర న్యాయ విమర్శా సమయములో ఆమె చేసిన పని పరీక్షించబడును. అప్పుడు తమ బిడ్డల చిలిపి కళ్ళను సన్మార్గమున పెట్టు బాధ్యతను నిర్వహించవలసిన వారు చూపిన అలక్ష్యము అవివే కమునకు ఫలితముగా అనేక హత్యలు అపజయములు సంభవించినవని తేలును. తన ప్రజ్ఞానిధి వలన, సత్యము వలన, పవిత్రత వలన లోకమునకు ఆశీర్వాదకరముగా నున్న వారు తమ కీర్తికి జయమునకు ఆయువుపట్టు అనదగిన సూత్రములు భక్తి ప్రార్థనలు చేయు తన క్రైస్తవ మాత యొద్ద నుండి నేర్చుకొన్నవేయని అప్పుడు తేలును. CChTel 296.3