Go to full page →

అధ్యాయము 37 - శలవు దినములలోను ,వార్షికోత్సవముల లోను కుటుంబ కార్యకలాపములు CChTel 316

మన శలవు దినములను ప్రపంచము ననుకరించి గడపరాదని నేను చూచితిని. అయినను శలవు రోజులను అలక్ష్యము చేయరాదు. ఏలయనగా ఇది మన బిడ్డలకు అసంతృప్తి కలిగించును. లోకానందములు ఉద్రేకముల వలన దుస్ప్రభావమునకు లోనై మన పిల్లలకు చెడిపోవు అపాయముగల యీ దినములలో అపాయకరమైన వినోదములకు ప్రతిగా మంచి రకపు వినోదములను కల్పించుటకు తల్లిదండ్రులు ప్రయత్నించ వలెను. తమ శ్రేయస్సును ఆనందము మీరు లక్షించుచున్నారని మీ బిడ్డలకు ఎరుకపరచుడి. CChTel 316.1

లోక ప్రజలు,సంఘస్థులు సోమరి తనముగా గడుపు ఈ సెలవు దినములు ఆరోగ్యమునకు ఆనందమునకు ఆవశ్యకములని నమ్మునట్లు తర్బీతు చేయబడిరి. కాని అని హానికరములని వాని ఫలితములు వ్యక్తము చేయుచున్నవి. CChTel 316.2

ఈ క్రమమును మార్చి యువజనులకు ,పిల్లలకు ఈ శలవు దినములు సాధ్యమయినంత ఆశాజనకములగా నుండునట్లు చేయుటకు మేము మన్హ్ పూర్తిగా యత్నించితిమి. అవిశ్వాసుల వినొదముల నుండి వారిని ఎడముగా నుంచుటయే నూ లక్ష్యము. CChTel 316.3

వినొదములతొ నిండిన ఒక దినము ముగిసిన పిమ్మట వినోదార్ధికి సంతృప్తి ఎక్కడిది ?క్రైస్తవ సేవకులైన వారు ఉత్తమమైన ,ఉన్నతమైన,పరిశుద్దమైన జీవితమును జీవించుటకు వారెవరికి సహాయము చేసిరి ?దూత వ్రాసిన దాఖలా చూచిన వారేమి కనుగొందురు ?వ్యర్ధ పుచ్చిన ఒక దినము ! మెలెమియు సాధించబడలేదు. గనుక క్రీస్తు సేవయందొక దినము వ్యర్ధ పుచ్చ బడినది. వారి స్వకీయాత్మలకు ఒక దినము నష్టమయినది. వారికి ఇతర దినములుండ వచ్చును. కాని బాలికలు బాలురతోను బాలురు బాలికలతోను అనాలోచానమైన, బుద్దిహినమైన మాటలు మాటలాడు కొనుట ద్వారా వ్యర్ద పుచ్చ బడిన అ దినము తిరిగి రాదు. CChTel 316.4

ఈ తరుణము మరల వారికి రావు. ఆ శెలవు దినమున వారు కష్ట పడి పని చేయుట మంచిది. తమ శెలవు రోజులను వారు సరిగా ఉపయోగించకున్నచో ఆ దినమును వారు దుర్వినియోగపరచినట్లు తీర్పు దినమున బహిర్గతము చేయ బడును. CChTel 317.1