Go to full page →

ఆధ్యాయము 42 - విమర్శ దాని ఫలితములు CChTel 339

క్రైస్తవులు తమ మాటలను గూర్చి జాగ్రత్తగా నుండవలెను. వారు ఒకరి యొద్దనుండి మరియొకరి యొద్దకు చెడ్డ వార్తలను కొనిపోరాదు. ముఖ్యముగా వారి మధ్య సమాధానము మన పాపములను ఒప్పుకొని ఆయన యెదుట వినయ హృదయులపై యండవెలరనని దేవుడు మనలను కోరుచున్నాడు. అయితే ఆయన తనయందు విశ్వాసముందువారిని విడనాడని దయగల తండ్రియని మనము నమ్మిక యుంచవలెను. మనలో చాలమంది దృష్టిద్వారా నడుతురుగాని విశ్వాసముద్వారా కాదు. కనబడు వానిని మనము నమ్ముదుము కాని దైవగ్రంధమందున్న ప్రశస్త వాగ్దత్తములను అభినందిపము. ఆయన సెలవిచ్చు దానిని నమ్ముటలేదని చూపించుచు నిజముగా మనతో నున్నాడా లేక మనలను మోసగించి చున్నాడాయని శంకించుట కన్న ఘెరమైన అగౌరవము మరియొకటిలేదు. అయినను పొరబడిన వారు కీడుచేయ వలెనని యుద్దేశించలేదు. సంభాషించవలసిన విషయమును ఎన్నుకొనుటలో ప్రదర్శించబడిన అవివేకము చాల హానికి కారణమయినది. CChTel 339.1

మనము ఆధ్యాతిమిక విషయములపై సంభాషించవలెను కాని వీనికి విరుద్దమే జరుగుచున్నది. క్రైస్తవ అభ్యంతరములు కొన్ని కలవు. వానిని తొలగింప వలెను. మనయందు దురుద్ధేశ్యములున్నవి మనయందు గర్వము, ఆహంకారము, అసహనము, నణుగుడు ఉన్నవి. ఇవన్నియు మనలను దేవుని నుండి వేరుచేయుచున్నవి. మనము మన పాపములను ఒప్పుకొనవలెను. మన హృదయములలో కృపయొక్క గంభీర కృషి జరుగవలెను. బలహీనులమని తలంచి అధైర్యపడిన వారు బలముగల దైవజను లుగా మారి ఆయనకు గొప్ప సేవ ఖండనము చేయుటలో గడిపినచో ఆ స్నేహ గోష్టి కీడుకు ఆటపట్టుగును. అప్పుడు మీ పలుకుబడి మరణార్ధమైన మరణపు వాసనగ మండును. 12T 186, 187; CChTel 339.2