Go to full page →

పిల్లలను అజ్ఞానమందు వెరుగనియుట పాపము CChTel 368

కొందరు తల్లిదండ్రులకు తమ బిడ్డలకు మాట విద్య నీయలెదు సరిగదా పాఠశాల విద్యనూ కూడ అలక్ష్యము చేసిరి. ఈ రెంటిలో దేనిని అలక్ష్యము చేయరాదు. పిల్లల మనస్సులు చురుకైనవి. శరీరసంభందమగు హెచ్చించు విధానము నవలభించి పని చేయునను నిశ్చయుత కలదు. పరిశుద్ద పరచు కార్యము ఒక నిముసములోగాని, గంటలోగాని ఒక దినములలోగాని పూర్తియగునదికాదు. కృపయుందు నిత్యమును పెరగుటయే దాని పని. మరునాటి పోరాటమెంత బలముగానుండునో ఈ దినమున మనము గ్రహింపలేము. సాతానుడు జీవించియే యున్నాడు. అతడు చుకుకుగా పనిచేయువాడు. తల్లిదండ్రులు తమ బిడ్డలకు మనస్సులను సమున్నతము లొనర్చి వారి మేధాశక్తులను వృద్ధిచేయుటకు ప్రయత్నించవలెను. CChTel 368.2

అభివృద్ధికి సాధన చేయని మనస్సు సాధారణముగా తక్కువ స్థాయి కలిగి ఇంద్రియానందకాంక్ష,అవినీతితో నిండియుండును. సాతనుడు సోమరి మనసులను చేపట్టి వానికి తన విద్యను కరవును. 12IT 393. 399: CChTel 368.3

తల్లి పని పసి పాపతో ప్రారంభమగును. ఆమె తన బిడ్డ యొక్క చిత్తమును మనస్తత్వమును స్వాధీనపరచుకొని విధేయతను నేర్పించవలెను. శిశువు పెరుగు కొలది క్రమశిక్షణ యందు అజాగ్రత్తగా నుండకుడి. ప్రతి తల్లి తన బిడ్డలు చెప్పు విషయమును విని వారి దోషములను సవరించి వారిని ఓరిమితో గుణపరచవలెను. క్రైస్తవ తల్లిదండ్రులు తమ బిడ్డలను దేవుని పిల్లలుగా చేయుటకు శిక్షణ నిచ్చుచున్నారని గురుతించవలెను. బాల్యము నందీయబడిన శిక్షణ వలన నేర్పబడిన శీలముపై పిల్లల మమతానుభవము ఆధారపడి యుండును. అప్పుడు వారి చిత్తము తల్లిదండ్రుల చిత్తమునకు లొంగియుండకున్నచో తరువాత వత్సరములలో పాఠములు నేర్చుకొనుట కష్టమయిన పనియగును. ఎన్నడును లొంగుబాటుకు తేబడని యా చిత్తమును దైవ విధులకు లొంగియుండునట్లు చేయుట యెంత దుష్కరము! ప్రాముఖ్యమయిన యీ పనిని అలక్ష్యము చేయు తల్లిదండ్రులు పెద్ద పొరపాటు చేయుచున్నారు. వారు తమ బిడ్డలకు విరోధముగాను దేవునికి విరోధముగాను పాపము చేయుచున్నారు. 13IT 390 391; CChTel 368.4

తల్లిదండ్రులారా, మీ బిడ్డల పట్ల మీరు నెరవేర్చవలసిన విధిగా దేవుడు నిర్దేశించిన విద్యను వారికీయకయున్నచో ఫలితములను గూర్చి మీరాయనకు సంజాయిషి యియ్యవలెను. ఈ ఫలితములు కేవలం మీ పిల్లలకే పరిమితమయినవి కావు. పొలములో పెరగనిచ్చిన ఒక ముండ్ల పొద చాల ముండ్ల పొదల పెరుగుదలకు ఎట్లు కారణమగునో అట్లే మీ అలక్ష్యము వలన ఏర్పడు పాపము చుట్టుపట్ల ఉన్నవారినందరిని పాడుచేయును. 14CG 115; CChTel 369.1

అపనమ్మకము చూపు తల్లిదండ్రుల పైకి దేవుని శాపము తప్పని సరిగా వచ్చును. వారు ముండ్ల పొదలను నాటుచున్నారు. అవి వారినిక్కడ గాయపరచును. అంతియేకాక తీర్పు గడియ యందు వారు తమ అపనమ్మకముయొక్క ఫలమును అనుభవించెదరు. పెక్కు మంది పిల్లలు తీర్పు గడియ యందు లేచి తమను అదుపు చేయనందుకు తమ తల్లిదండ్రులను విమర్శించి తమ నాశనమునకు తమ తల్లిదండ్రులే కారకులని వాగ్రుచ్చెదరు. తల్లిదండ్రుల కృత్రిమ సానుభూతి గుడ్డి ప్రేమ తమ బిడ్డల దోషములను ఉపేక్షించి వానిని సవరించకుండ ఉండునట్లు చేయును. తత్పర్యవసానముగా వారి పిల్లలు నాశనమగుదురు. వారి రక్తము అపసమ్మకము చూపిన తల్లిదండ్రులపై నుండును. 15IT 219; CChTel 369.2