Go to full page →

క్రైస్తవ విద్యయందు బైబిలు స్థానము CChTel 390

బుద్ధి శిక్షణకు ఎ యితర గ్రంథములకన్నా లేక నానా గ్రంథ సముదాయముకన్నా బైఅబిలు యొగ్యమైనది. ఆ గ్రంధంశములు వైశిష్టము, అందలి భాష సౌలభ్యము, భావరమ్యత చురుకైన తలంపులు కలిగించి వానిని సమున్నత పరచును. దీని నే యితర గ్రంధమును చేయజాలదు. బయలు పరచబడిన మహత్తర సత్యములను గ్రహించుటకు చేయబడు కృషి వలన నిత్యదేవుని తలంపులను ధ్యానించు మనస్సు వృద్ధి చెంది బలపడక తప్పదు. CChTel 390.2

ఆధ్యాత్మిక స్వభావము వృద్ది పరచుటలో బైబిలు యొక్క శక్తి సమాధికమయినది. దేవునితో సాంగత్యము చేయుటకు సృజింపబడిన మానవుడు అట్టి సాంగత్యము నందే యదార్ధ జీవనమును అభ్యుదయమును కనుకోన గలడు. తన అత్యున్నతానందమును దేవునియందు కనుగొనుటకు సృజింపబడిన మానవుడు తన హృదయాభిలాషలను ,ఆకలి దప్పులను తీర్చగల దానిని మరెచ్చటకు. యదార్ధమైన ,భోధకు లొంగు ,స్వభావము కలిగి సత్యమును గ్రహించ వలెను దైవవాక్యమును పటించువాడు ఆ గ్రంధకర్తతో సాంగత్యము కలిగి యుండును. అతడే వేరే విధముగ కోరితే తప్ప అభివృద్ధి చెందుటకు గల అవకాశములకు హద్దు లేదు. 26Ed. 124, 125; CChTel 390.3

పాఠమునకు సంబంధించిన ప్రముఖ లేఖన భావములను కంఠస్థము చేయుడి. ఇది యొక పనిగా భావించక ఒక అధిక్యతగా భావించుడి. ఆదిలో జ్ఞాపక శక్తి బలహీనముగా నున్నను అభ్యాసము వలన నది బలపడును. తత్ఫలితముగా కొంతకాలమునకు సత్యవాక్కులను భద్రపరచు కొనుటలో మీరానందింతురు. ఈ యలవాటు ఆధ్యాత్మికభ్యున్నతికి లాభదాయకముగ నుండును. 27CT 137, 138; CChTel 390.4