Go to full page →

మాతృభాషను అశ్రద్ధ చేయరాదు CChTel 394

కేవలం సాంకేతిక పరిజ్ఞానము వలన సాధించు లక్ష్యములకన్న ముఖ్యమైనది విద్యా శాఖలన్నింటియందును గలవు. దీనికుదాహరణగా భాషను తీసికొనుడు. విదేశ భాషలను అవి వాడుకలో నున్నవేమి మృతభాషలేమి నేర్చుకొనుటకన్న మాతృభాషను తప్పులు లేకుం ధారాళముగా మాటలాడి వ్రాయగలుగుట ప్రాముఖ్యము. వ్యాకరణజ్ఞానము ద్వారా పొందిన శిక్షణ ఉన్నత దృక్పథముతో భాషాజ్ఞానము సంపాదించుటతో సాటికాదు. ఈ పఠనముపై ఎక్కువ భాగమునందు క్షేమమో లేక దుఃఖమో ఆధారపడి యుండును. 39Ed. 23; CChTel 394.2