Go to full page →

నస్సుపైని ఆత్మపైని దాని ఫలితములు. CChTel 421

మాంసాహారము వలన కలుగు శారీరక రోగుములకన్న నైతికమైన కీడులు తీసిపోయి నవికావు. మాంసాహారము ఆరోగ్యమునకు హాని కరము. శరీరమునకు చేటు కలిగించునదెల్ల మనస్సుకు ఆత్మకు కూడ చేటు కలిగించును. 11MH 315; CChTel 421.4

మాంసాహారము మనస్తత్వమును మార్చి పశుత్వమును బలపరచును. మనము తిను ఆహారమునుబట్టి మనము నిర్మించబడు చున్నాము. ఎక్కువ మాంసమును తినుటద్వారా మన మానసిక శక్తి క్షిణించును. విద్యార్థులు అసలు మాంసమును ముట్టకున్నచో విద్యా వ్యాసంగమందు వారు ఇతోధిక వృద్ధి గాంచెదరు. మానవ శరీరమందలి కామగుణము మాంపభక్షణముద్వారా బలపర్చ బడినచో దానికి తగినట్లుగా మానసిక శక్తులు తగ్గును. 12CD 389; CChTel 421.5

ఆహారము అతి సామాన్యముగ ఉండవలసిన కాలము ఏదైన ఉన్నచో అది ఇప్పుడే. పిల్లల ముందు మాంసము పెట్టరాదు. తుచ్ఛసక్తులను బలపరచి భావోద్రేకము పుట్టించుట దాని స్వభావము. నైతిక శక్తులను పరిమార్పు గుణము దానికి గలదు. 132T 352; CChTel 422.1

క్రీస్తు త్వరితాగమనము కొరకు ఎదురుచూచున్నామని చెప్పుకొన్నువారిలో గొప్ప సంస్కరణములు జరుగవలెను. ఆరోగ్య సంస్కరణ మన ప్రజల మధ్య ఇంకను చేయబడిన ఒక మహత్తరమైన పనిని చేయవలెను. ఇంకను మాంసపు తినుచు తద్వారా తమ శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యమును అపాయ స్థితికి తెచ్చుకోనుచున్నన్నారు మాంసభక్షణ మందలి యపాయము గుర్తించవలెను. మాంసాహార సమస్య విషయము అర్ధంగీకారము కలవారు దైవప్రజలను విడిచి పొయెదరు. వారు దైవజనులతో ఇక నడవరు. 14CH 575; CChTel 422.2

తమ మాటలు ,క్రియల వలన సేవలు అపకీర్తి ఘటించకుండునట్లు సత్యమును నమ్ముచున్నామని చెప్పుకోనువారు తమ శారీరక మానసిక శక్తులను జాగ్రత్తగా కాపాడుకొనవలెను. మన మరణము వ్యర్థము కాలేదని భూలోక ఆవరణమందు పరిశుధ్ధులు చేయు స్తుతి వందనార్పణలు పరలోకపు లోపలి ఆవరణములోని స్తుఇ గానములతో మిళితమై వినబడుచుండెను. దేవదూతలు జీవపు ఊటలోని నీళ్లు త్రాగుచుండగా, భూలోకమందలి భక్తులు సింహాసనము నుండి ప్రవహించుచు దైవ పట్టణమును సంతోషపరచు. మాంసాహారమును విసర్జించుదాని ముప్పధి సంవత్సరములుగా తన ప్రజలకు దేవుడి నిచ్చునా ? మాంసాహారము వలన పశు స్వభావము బలపడి ఆధ్యాత్మిక స్వభావము క్షిణించును. 15CD 383; CChTel 422.3