Go to full page →

అధ్యాయము 51 - ఆరోగ్య సంస్కరణపట్ల నమ్మకముగా నుండుట CChTel 425

[గమనిక :ఆరోగ్య సంస్కరణ మందలి ముఖ్య విషయములను సింహన లోకనము చేయు ఈ వర్తమానము శ్రీమతి వైటమ్మ గారు 1909 లో జరిగిన జనరల్ కాన్ఫరెంసులో నిచ్చిరి. ఇదియే ఆమె హాజరైన చివరి కూటము. -కూర్పరులు ] CChTel 425.1

ఆరోగ్య సంస్కరణ విషయము మన ప్రజలందరునొక వర్తమానము నే నుప దేశించబడితిని. ఏలయనగా ఆరోగ్య సంస్కరణ సూత్రములు ఆచరణ సందర్భముగా ననేకులు వెనుకంజ వేసిరి. CChTel 425.2

తమ బిడ్డలు క్రిస్తునండు సంపూర్ణముగా పెరిగిన స్త్రీ పురుషులై యుండవలెనని దేవుని సంకల్పము. దీనిని సాధించుటకు వారు తమ మానసిక ,ఆధ్యాత్మిక ,బౌతిక శక్తులన్నింటిని సమ్యద్విధముగ నుపయోగించవలెను. మానసిక బలము గాని శరీరక బలము గాని వారు వ్యర్ధము చేయ వల్లపడదు. CChTel 425.3

ఆరోగ్యము నేతలు కాపాడవలేనను సమస్య ప్రాముఖ్యమైనది. ఈ సమస్యను గూర్చి మనము దైవ భీతితో ఆలోచించినచో ఆహరమునందు సామాన్యత కలిగి యుండుట మన బౌతికాభ్యుదయమునకు ఆధాయత్మికభ్యుదయమునకు తోడ్పడునని గ్రహించెదము. ఓర్పుతొ యీ విషయమును అలోచింతుము. ఈ విషయమందు వివేకముగా వర్తించుటకు మనకు జ్ఞానము ,వివేచన అవసరము. ప్రక్రుతి శాసనములను అనుసరించవలెను గాని ప్రతిఘటించరాదు. CChTel 425.4

మాంసాహారము ,టి ,కాఫీ ,అనారోగ్యదాయకమగు వంటకముల యందలి చెడుగును గూర్చి ఉపదేశము పొందినవారు వానిని విసర్జించుట ద్వారా దేవునితో నిబంధన చేసికోనగోరు వారు అనారోగ్యము కలిగించునని తమకు తోచిన పదార్దములను కాంక్షించరు. భోజనాసక్తిని అదుపు చేయవలెననియు ,మంచివి కాని పదార్దములు విషయము ఆత్మోపేక్ష విధానము నను సరించవలెననియు దేవుడు కోరుమన్నాడు. తన ప్రజలు ఆయన ముందు పవిత్రీకరించబడిన జనాంగముగ నిలువ బడక పూర్వము ఈ కార్యము సాధించబడవలెను. CChTel 425.5

దేవుని శేషించిన ప్రజలు మార్పు చెందిన ప్రజ కావలెను. ఈ వర్తమాన పర్యవసానముగా ఆత్మలు మారు మనసు పొంది పరిశుద్ద పర్చబడవలెను. ఈ ఉద్యమములో దేవుని ఆత్మ ఉన్నదిని మనము గ్రహించవలెను. ఇది అద్బుతకరమైన కచ్చితమైన వర్తమానము. అందుకొనువారికి ఇది సర్వమునై యుండవలెను. ఇది గొప్ప శబ్దముతో ప్రకటించబడవలెను. ఈ వర్తమానము కాల సమాప్తి పర్యంతము అధిక ప్రాముఖ్యతతో ప్రకటించబడునని మనము వాస్తవమయిన నిశ్చలితమయిన విశ్వాసము కలిగి యుండవలెను. CChTel 426.1

సాక్ష్యములలో కొన్ని భాగములను దైవదత్తములుగా అంగీకరించి తమకు మిక్కిలి ప్రియమైన కార్యములను గర్హించు భాగములను తృణీకరించును శేషించిన సంఘస్థులమని చెప్పుకొనువారు కొందరున్నారు. అట్టివారు తమ శ్రేయస్సుకు, సంఘశ్రేయస్సుకు విరుద్దముగా పనిచేయు చున్నారు. వెలుగు ఉన్నపుడే మనము వెలుగులో నడచుట ప్రాముఖ్యము. ఆరోగ్య సంస్కరణమును నమ్ముచున్నామని చెప్పుచు తమ దైనందిన చర్యలలో దాని సూత్రములకు విరుద్ధముగా పని చేయువారు తమ స్వకీయాత్మలకు హాని చేసికొనుటయేగాక విశ్వాసులకు అవిశ్వాసులకు వారు దురభిప్రాయములు కలిగించుచున్నారు. CChTel 426.2