Go to full page →

ప్రజలకు నేర్పించుడి CChTel 430

ఆరోగ్య సంస్కరణ సూత్రములలో ప్రజలకు శిక్షణ నిచ్చుటకు అధిక కృషి సల్పవలెను. వంటబడులను స్థాపించవలెను. ఆరోగ్యదాయకమగు ఆహారమును తయారుచేయు విధానమును ఇంటింట బోధించవలెను. అతిసామాన్యముగా వంట చేయుటయందు యువజనులు వృద్ధులు శిక్షణ పొందవలెను. సత్యము ప్రకటించబడు ప్రతి స్థలమునందును ఆరోగ్యదాయకమగు ఆహారము సామాన్యముగ రుచికరముగ ఎట్లు తయారు చేయవలెనో నేర్పించవలెను. మాంసము లేకుండగనే బలవర్ధకాహారమును తయారుచేయవచ్చునని వారికి చూపవలెను. CChTel 430.4

రోగ నివారణోపాయమును తెలిసికొనుటకన్న ఆరోగ్యముగా నెట్లుండవలెనో నేర్చుకోనుట ఉత్తమమని ప్రజలకు నేర్పించుడి. మన వైద్యులు విజ్ఞత గల అధ్యాపకులు కావలెను. శరార మానసముల క్షీణతను అరికట్టుటకు దేవుడు నిషేధించిన పదార్థములను తినకుండుటయే శరణ్యమని చూపుచు ప్రజలకు వారు దురాశలను గూర్చి హెచ్చరిక చేయవలెను. CChTel 430.5

ఆరోగ్య సంస్కర్తలుగా నుండ నేర్చుకొనుచున్న వరాఇ పూర్వపు ఆహారము స్థానే బలవర్థకనుగు ఆహారమును తయారు చేయుటలో యుక్తిజ్ఞానములు అవసరము. దేవుని యందు విశ్వాసము, కార్యదీక్ష, ఒకనికొకరు సాయము చేసికొనులకు ఇష్టపడుట ఇదా అవశ్యకములు. బలవర్థక పదార్థములు నిండియుండని ఆహారము ఆరోగ్య సంస్కరణ లక్ష్యమునకు విరుద్ధము. మనము మానవ మాతృలము. కనుక శరీరమునకు సరియగు పోషణ నిచ్చు ఆహారమునే మనము భుజింపవలెను. CChTel 431.1