Go to full page →

అధ్యాయము 54 - రోగుల కొరకు ప్రార్థన CChTel 4511MH 225-233.

“వారు విసుకక నిత్యము ప్రార్థనచేయవలె” నని లేఖనములు చెప్పుచున్నవి. (లూకా 18:1) బలముడిగినప్పుడు ప్రాణము పోవుటకు సిద్దముగా నున్నపుడు మానవులు ప్రార్థన చేయవలసిన ఆవశ్యకతను గుర్తించెదరు. CChTel 4511MH 225-233. .1

ఆరోగ్యముగానున్నవారు దిన దినము, ప్రతి సంవత్సరము తమకు చూపబడు కృపను గూర్చి తరచు విస్మరింతురు. తమకు దేవుడిచ్చిన మేళ్ల నిమిత్తము వారాయనకు స్తుతులు చెల్లించరు. కాని వ్యాధి సంప్రాప్తము కాగానే దేవుని జ్ఞాపకము చేసికొనెదరు. మానవ శక్తి పనికిరానపుడు మానవులు దైవశక్తి యొక్క అగత్యమును గుర్తించెదరు. తన సహాయమును అవ్యాజముగా నర్థించు ఆత్మను కృపగల దేవుడెన్నడును విసర్జింపడు. వ్యాధియందును ఆరోగ్యమందును ఆయన మనకు ఆశ్రయదుర్గము. CChTel 4511MH 225-233. .2

తన యిహలోక సేవలో వలెనే యిప్పుడు కూడ క్రీస్తు దయతో కూడిన వైద్యుడై యున్నాడు. ప్రతి వ్యాధిని కుదుర్చుటకు ఆయన యందు ముందున్నది. ప్రతి బలహీనతను నివారించుటకు ఆయనయందు శక్తియున్నది. పూర్వపు శిష్యులవలె ఇప్పటి శిష్యులు కూడ రోగుల కొరకు ప్రార్థించవలెను. అప్పుడు స్వస్థత కలుగును. ఏలయనగా “విశ్వాససహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును.” మనకు విశ్వాసము యొక్క నిర్మల వాగ్దానమగు పరిశుద్ధాత్మ శక్తి కలదు. దీని ద్వారా మనము దైవ వాగ్దానముల సిద్ధిని పొందవచ్చును. “రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు.” అను దైవ వాగ్దానము (మార్కు 16:18) అపోస్తలుల దినములలో వలె నేడు కూడ నమ్మదగినదియే. ఇది దేవుని బిడ్డల ఆధిక్యతను ఎరుకపరచు చున్నది. దీనియందున్న సమస్తమును మనము విశ్వసింపవలెను. ఆయన కార్య నిర్వహణకు క్రీస్తు సేవకులు సాధనములై యున్నారు. వారి ద్వారా తన స్వస్థత శక్తిని ప్రదర్శించవలెనని ఆయన కోరుచున్నాడు. తన విశ్వాస హస్తములతో రోగులను, బాధితులను, దేవుని కప్పగించుట మన కర్తవ్యము. మహావైద్యుని నమ్ముడని మనము వారికి నేర్పించవలెను. రోగులు నిస్పృహ చెందిన చెందినవారు, బాధితులు, ఆయన శక్తిపై నాధారపడునట్లు వారిని మనము ప్రోత్సహించవలెనని రక్షకుడభిలషించు చున్నాడు. CChTel 4511MH 225-233. .3