Go to full page →

సంస్ధలు స్ధాపించబడవలెను CChTel 459

వైద్యసువార్త సేవ నిర్వహించ బడవలసిన స్థలములనేకములున్నవి. ఆ స్థలములలో చిన్న కేంద్రములు స్థాపించబడవలెను. మన వైద్యశాలలు గొప్ప వారిని, కొద్దివారిని, ధనికులను, దరిద్రులను చేరుటకు సాధనములై యుండవలెనని దైవసంకల్పము. ఇవి చేయుచున్న పని ద్వారా దేవుడు లోకమునకు పంపిన వర్తమానముపైకి ప్రజల దృష్టి తిరుగునట్లని వ్యవహరించవలెను. 2CH 501; CChTel 459.2

భౌతిక సేవ, ఆధ్యాత్మిక సేవ రెండును మిళితమయి రోగులు పరమవైద్యుని శక్తిని నమ్ముటకు వారిని నడిపించవలెను. సరియై న చికిత్స చేయుచు క్రీస్తు యొక్క స్వస్థతా కృప కొరకు కూడా ప్రార్థించువారు రోగులకు విశ్వాసము పుట్టిచెదరు. లాభము లేదని వారికి కూడా వారవలంబించు మార్గము ఆవేశమును పుట్టించును. CChTel 459.3

ఇందు నిమిత్తమే మన వైద్యశాలలు స్థాపితములైనవి. సరియై న చికిత్సలతో పాటు విశ్వాస ప్రార్థనలు చేసి, శారీరక, ఆధ్యాత్మిక సంక్రమ జీవిత విధానము నుపదేశించుట ద్వారా నిస్పృహ చెందిన వారికి ధైర్యమునిచ్చుటకే యని నెలకొల్పబడినవి. ఇట్టి సేవ ద్వారా అనేకులు మారుమనస్సు పొందవలెను. మన వైద్యశాలలలోని వైద్యులు ఆత్మస్వస్థత విషయమును స్పష్టముగా సువార్త నందించవలెను. 3MM 248; CChTel 459.4