Go to full page →

అనాలోచితముగా మాటలాడుట యందలి అపాయము CChTel 471

దైవ ధర్మశాస్త్రమునకు ప్రభుత్వ శాసనమలు విరుద్దముగా నుండు విషయములను మన99T 238; CChTel 471.1

సహోదరులలో కొందరు పలికినట్లు, వ్రాసినట్లు వ్యాఖ్యానించబడినవి. ఇట్లు అపోహకు తావిచ్చుట తప్పు. ప్రభుత్వాధికారలు చేయు పనులను నిత్యమ విమర్శించుట విజ్ఞతకాదు. వ్యక్తులను గాని సంస్థలన గాని విమర్శించుట మన పని కాదు. ప్రభుత్వమునకు విరోధముగా నున్నామను అభిప్రాయము కలిగించకుండ మనమ జాగ్రత్తగా నుండవలెను. మన పోరాటము భయంకరమైన దన్నమాట వాస్తవమే. అయినను “ప్రభువిట్లు సెలవిచ్చుచున్నాడు” అనునదియే మన ఆయుధము. దేవుని మహా దినమున నిలువ బడుట కొక ప్రజాళిని సిద్ధము చేయుటయే మన పని. మన విశ్వాసమునకు చెందని వారి యందు వివాదమ వైరుధ్యమును ప్రోత్సహించు వ్రాతలను మనము వ్రాయలేదు. CChTel 471.2

మన సహోదరులు జాగ్రత్తగా విమర్శ దృష్టితో పలికిన పలుకులను వ్రాసిన వ్రాతలన మన శత్రువులు మనలన విమర్శించుటకు ఉపయోగించు కాలము వచ్చుచున్నది. ఇవి ఆ విధముగా పలికిన వ్యక్తులనను విమర్శించుటకు మాత్రమే ఉపయోగించబడవు గాని ఎడ్వెంటిస్ట వారందరిని విమర్శించుటకుపయోగించబడును. ఫలానా దినమున మీ నాయకులలో నొక వ్యక్తి ఇట్లు చెప్పెననియు ప్రభుత్వశాసనములకు విరుద్ధముగా మాటలాడెననియు మన విమర్శకులనెదరు. మన విరోధుల వాదనకు ఆధారము నిచ్చు ఇన్ని సంగతులు ప్రస్తావించబడినవా యని అనేకులు ఆశ్చర్యపడెదరు. తాము పలికిన మాటలకు తాముద్ధేశింపని అర్థముల నంటగట్టుట చూచి అనేకులు వెరగుపడెదరు. కనుక అన్ని వేళలయందును అన్ని పరిస్థితులలోను తాము పలుకు మాట విషయము మన పని వారు జాగ్రత్తగానుండవలెను. మానవులను పరీక్షించు క్లిష్టి సమయము మనముందే యున్నది. అజాగ్రత్తగా పలుకు మాటల ద్వారా శ్రమను తెచ్చుకొనకుడునట్లు అందరును జాగ్రత్తగా నుండవలెను. CChTel 471.3

మన వైఖరినిబట్టి మన విషయమైన అభిప్రాయము లేర్పడును. క్రీస్తు రాయబారులుగా నుండదలంచువారు తమ విశ్వాసమునకు విరుద్ధముగా జీవించకుందురుగాక, మనము బహిరంగ స్థలమునకు రాక పూర్వము పై నుండి పరిశుద్ధాత్మ కుమ్మరించబడునట్లు పాటుపడవలెను. ఇది మనకు సాధ్యమయినపుడు మనము నిష్కర్షయై న వర్తమానము నీయగలమ. కాని ఆ వర్తమానము ఇతరులిచ్చు సందేశమువలె విమర్శికముగా నుండరాదు. నమ్ము వారందరును మన విరోధులను రక్షించుటకు పట్టుదలతో కృషి చేయవలెను. అధికారులను విమర్శించు పని ప్రభువుకి విడిచిపెట్టుడి. నమ్మకమైన కావలి వాండ్రవలె సాత్వికముతోను ప్రేమతోను క్రీస్తునందున్నట్లు సత్యసూత్రములను గైకొనెదము. 10QT 394-397; CChTel 472.1