Go to full page →

అధ్యాయము 59 - కృత్రిమనిజ్ఞానము . సాతానుని నవీనమైన వెలుగువస్త్రము CChTel 479

కృతిమ విజ్ఞానమును తన సాధనములలో నోకదానినిగా సాతానుడు పరలోకములో నుపయోగించెను. ఈ నాడు కుడా అతడు దీనినే ఉపయోగించు చున్నాడు. దూతల కతడు చెప్పిన చెడ్డ విషయములు అనగా కృతిమ విజ్ఞాన సిద్దంతములు వారిలో ననేకులను ప్రభుభక్తి రహితులుగా చేసినవి. CChTel 479.1

పరలోక మందు తన స్థానము పోగొట్టు కొన్నవాడై సాతానుడు మన ఆది తాళి దండ్రులను శోధించెను. ఆదాము హవ్వలు శత్రువుకు లొంగిరి. వారి అని ధ్యేయర వలన మానవ కోటి దేవునికి దూరమయ్యెను. ఇహపరములు విడదీయ బడినవి. CChTel 479.2

ఆదాము హవ్వలు నిషేధ వృక్షమును ముట్టకయున్నచో పాప శాపములేని ,నిత్యానందమును కూర్చ గల జ్ఞానమును దేవుడు వారి కనుగ్రహించి యుండెడివాడే. తమ అవిధేయత వలన వారు పొందిన లాభమేమనగా ,పాప పరిచయము ,దాని పర్యవసానములు. CChTel 479.3

మన ఆది తల్లి దండ్రులు నడిపిన స్థలామునకే సాతానుడు నేటి మానవులను కూడ నడిపించుచున్నాడు. ఆనందము గొల్పు కట్టు కధలతో నాతాడు లోకమును ముంచుచున్నాడు. దేవుని రక్షణ జ్ఞానమును మానవులు పొందకుండ సాతానుడు తన తంత్రములన్నిటిని వుపయోగించి పనిచేయు చున్నాడు. 18T 290; CChTel 479.4