Go to full page →

అధ్యాయము 1 - నీతిమంతుల ప్రతిఫలమును గూర్చిన దర్శనము CChTel 52

(నా ప్రథమ దర్శనము) CChTel 52.1

కుటుంబ ప్రార్థనలో నుండగా నా పైకి పరిశుద్ధాత్మక వచ్చెను. అప్పుడు నేను చీకటి ప్రపంచము విడిచి పైకి లేచుచున్నట్లు గోచరించెను. ఎడ్వెంటు ప్రజల కొరకు నఖముఖాల చూచితిని. నా కెవరును కాన్పించలేదు. అప్పుడు “మరల చూడుము; ఇంక కొంచెము పైకి చూడుము” అని ఒక స్వరము నాకు చెప్పెను. ఆ మీదట నేను కన్నులెత్తి చూడగా ప్రపంచమునకు చాల ఎత్తున ఒక సంకుచితమైన తిన్నని మార్గము కనబడెను. ఈ మార్గము చివర నున్న పట్టణమునకు ఎడ్వెంటు ప్రజలు ఈ మార్గమున ప్రయాణము చేయుచున్నారు. వారి వెనుక మార్గారంభములో ఒక జ్యోతిర్మయమైన వెలుగు కలదు. ఆది నడిరేయి కేక యని దేవదూత నాకు తెల్పెను. వారు తొట్రిల్లకుండునట్లు ఈ వెలుగు వారికి మార్గమంతటియందును ప్రకాశించి వారికి వెలుగు నిచ్చెను. తమను పట్టణమునకు నడుపుచు తమ ముందే నడుచుచున్న యేసుపై వారు తమ దృష్టినుంచినచో సురక్షితముగా నుందురు. అంతకన్న ముందే దానియందు ప్రవేశింపజూచిన కొందరు అలసి పట్టణము చాల దూరమున నున్నదనిరి. అప్పుడు యేసు తన మహిమాన్వితమైన దక్షణ హస్తము నెత్తుట ద్వారా వారిని ప్రోత్సహించెను. ఆయన హస్తము నుండి ఒక వెలుగు వచ్చి ఎడ్వెంటు ప్రజల మీదుగా పోగా వారు “హల్లెలూయా” నినాదములు చేసిరి. తక్కిన వారు తమ వెనుక నున్న వెలుగును మూర్ఖముగా ఉపేక్షించి తమ్మును అంతవరకు నడిపినవాడు దేవుడు కాడనిరి. వారి వెనుక నున్న వెలుగు మటుమాయమయ్యెను. వారి పాదములు కటిక చీకటిలో విడువడినవి. అంతట వారు తొట్రిల్లి తమ లక్ష్యమగు యేసును చూడలేక మార్గము తప్పి దుర్మార్గముతోను చీకటితోను నిండిన క్రింది ప్రపంచములో పడిరి. కొంతసేపటిలో జలఘోషతో సమానమైన దైవస్వరమును మేము వింటిమి. ఈ స్వరము యేసు ఆగమన దినమును ఘటియను మాకు వ్యక్తము చేసెను. జీవించియున్న 1,44,000 మంది నీతి మంతులు ఆయన స్వరమును గుర్తించి గ్రహించిరి. అయితే దుర్మార్గులది ఉరుమనియు, భూకంపమనియు భావించిరి. దేవుడు ఆ ఘడియను తెల్పి మాపై పరిశుద్ధాత్మను క్రుమ్మరించెను. మా ముఖములు వెలుగుతో నిండి సీనాయి పర్వతమునుండి దిగివచ్చినప్పుడు మోషే ముఖమువలె దైవ మహిమతో ప్రకాశించినవి. CChTel 52.2

1,44,000 మంది ముద్రించబడి సంపూర్ణముగా సమైక్య పర్చబడిరి. దేవుడు, నూతన యెరూషలేము, యేసునూత్న నామముగల ఒక మహిమాన్వితమైన నక్షత్రము వారి నుదుళ్ళపై చెక్కబడెను. మా యానంద, పరిశుద్ధ స్థితిని చూచి దుర్మార్గులు కోపోద్రిక్తులై మమ్మును బంధించి చెరసాలలో పడద్రోయుటకు దౌర్జన్యముగా వచ్చుచుండిరి. అప్పుడు ప్రభుని నామమున మేము మా చేతలు చూపగా వారు నేల కూలిరి. ఒకరి పాదముల నొకరు కడుగుకొని పరిశుద్ధముగా ముద్దు పెట్టుకొను మమ్మును దేవుడు ప్రేమించుచున్నాడని సాతాను అనుచర బృందము గుర్తించి మాపాదములకు సాగిలపడి మ్రొక్కెను. CChTel 53.1

అచిరకాలములో మా దృష్టి తూర్పు దిశకు పోయినది. ఏలయనగా ఒక నల్లని చిన్న మబ్బు కనబడెను. అది మనుజుని అరచేతిలో సగము పరిమాణముగలదై యుండెను. అది మనుష్య కుమారుని సూచనయని మాకు తెలిసినది. మేమందరము నిశ్శబ్దముగా చూచుచుండగా నది రానురాను సమీపమునకు వచ్చి వెలుగుతోను క్షణక్షణ ప్రవర్ధమానమైన మహిమతోను నిండి తుదకు తెల్లని పెద్ద మేఘమైనది. దానిక్రింది భాగము అగ్నివలె నున్నది. ఆ మేఘముపై ధనస్సున్నది. దాని చుట్టు పదివేలమంది దూతలు అతి మధురమైన పాట పాడుచు నిలిచియుండిరి; దానిపై మనుష్య కుమారుడు ఆసీనుడై యుండెను. ఆన వెంట్రుకలు తెల్లగ నున్నవి. అవి ఉంగరములు తిరిగి ఆన భుజములపై పడుచున్నవి. ఆన శిరముపై అనేక కిరీటములు కలవు. ఆన పాదములు అగ్నివలె నున్నవి; ఆయన కుడి చేతిలో పదునైన కొడవలి యున్నది; ఆయన ఎడమ చేతియందు ఒక వెండి బూర కలదు. ఆన నేత్రములు అగ్నివలె నున్నవి. అవి ఆయన బిడ్డల హృదయాంతరాళములను పరిశోధించును. అప్పుడు అందరు భయకంపితులైరి. దేవుడు విసర్జించిన వారి ముఖములు నల్లబడినవి. అప్పుడు మేమందరము, “దానికి తాళజాలినవాడెవడు? నా వస్త్రము నిందారహితమైనదా?” యని కేకలు వేసితిమి. దూతలు పాటపాడుట మానిరి. కొంతసేపు అంతయు నిశ్శబ్దముగా నుండెను. అప్పుడు యేసు “నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగియుండువారే తాళగలరు; నా కృప మీకు చాలును” అని పల్కెను. ఇది విన్న మీదట మా ముఖసీమలు తేజోవంతములైనవి. మా హృదయములు ఆనందముతో నిండినవి. దూతలు ఎక్కువ శ్రుతిలో పాడ నారంభించిరి. ఆ మేఘము భూమిని క్రమేపి సమీపించెను. CChTel 53.2

నిద్రించుచున్న పరిశుద్ధుల సమాధుల నాయన తిలకించి తన కన్నులను చేతులను ఆకాశమువైపుకు ఎత్తి “మేల్కొనుడి! మేల్కొనుడి! మేల్కొనుడి! మంటిలో నిద్రించు వారలారా లెండి” యని కేకలు వేసెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. సమాధులు తెరువబడినవి. అమర్త్యత్వము ధరించుకొని మృతులు సమాధులలో నుండి బయటికి వచ్చిరి. మరణము వలన విడదీయబడిన తమ స్నేహితులను గుర్తించినప్పుడు 1,44,000 మంది “హల్లెలూయా” ధ్యానము చేసిరి. అదే సమయమున మేము మార్పుచెంది వారితోపాటు ప్రభువును కలిసికొనుటకు మేఘములలో ఎత్తబడితిమి. CChTel 54.1

మేమందరము కలసి మేఘములో ప్రవేశించి స్ఫటికపు సముద్రము కడకు ఏడు దినములు ఆరోహణమైతిమి. ఆ తరి యేసు తన దక్షిణ హస్తముతో కిరీటములను తెచ్చి మా శిరములపై పెట్టెను. మా కాన బంగారుతో చేయబడిన వీణెలను జయ సూచకమైన కజ్జూరపుఉ మట్టలను అనుగ్రహించెను. ఈ స్ఫటికపు సముద్రముపైని 1,44,000 మంది చతురస్రాకారముగా నిలిచిరి. వారిలో కొందరికి ఎక్కువ తేజస్సుగల కిరీటములున్నవి. తక్కిన వారి కిరీటములు అంత తేజోవిరాజితములు కావు. కొందరి కిరీటములు ఎక్కువ నక్షత్రములు కలవియై బరువుగా నున్నట్లు అగపడెను. తక్కిన కిరీటములలో ఎక్కువ నక్షత్రములు లేవు. తమకీయబడిన కిరీటముల విషయము ఎల్లరును సంతృప్తులైరి. వారందరు మహిమాన్వితమైన తెల్లని అంగీలు ధరించిరి. అవి పాదములకు తగులునంత పొడవైనవి. స్ఫటికపు సముద్రము మీదుగా పరిశుద్ధ పట్టణద్వారము వద్దకు మేము వెళ్ళుచుండగా మా చుట్టును దూతలుండిరి. యేసు తన బలమును, మహిమాన్వితమునైన హస్తమును మణిమయ ద్వారముపై వేసి దానిని తెరచి మాతో, “మీరు మీ వస్త్రములను నా రక్తములో ఉదుకుకొని నా సత్యము కొరకు బలముగా నిలువబడిరి కనుక ప్రవేశించుడి” యని పల్కెను. మేమందరము లోనికి ప్రవేశించి, పరిశుద్ధ పట్టణములో మాకు సంపూర్ణమైన హక్కుగలదని భావించితిమి. CChTel 54.2

ఇక్కడ మేము జీవవృక్షమును దైవ సింహాసనమును చూచితిమి. ఆ సింహాసనము నుండి పవిత్ర జలములుగల ఒక నది ప్రవహించుచుండెను. ఆ నదికి ఇరు పార్శ్యముల జీవ వృక్షము కలదు. ఆ నది ఇవతల ప్రక్క ఒక చెట్టు బోదె; అవతల ప్రక్క రెండవ బోదె కలవు. ఈ రెండును స్వచ్ఛమైన బంగారముతో చేయబడినవి. మొదట నవి రెండువృక్షములని నేను భావించితిని. నేను మరల చూడగా అవి పైవి ఒక వృక్షముగా కలిసినట్లుకనుగొంటిని. జీవజలముల నదికి ఇరుపార్శ్వముల నున్న జీవవృక్ష మదియే. దాని కొమ్మలు మేము నిలువబడిన స్థలము వరకు వంగియున్నవి. దాని ఫలములు మహిమాయుతమైనవి; అవి వెండితో కలసిన బంగారమువలె నున్నవి. CChTel 55.1

మేమందరము ఆ చెట్టు క్రిందకు వెళ్ళి ఆ స్థల వైభవమును చూచుచు కూర్చుంటిమి. ఆ తరి ఈ రాజ్య సువార్త చాటి మరణించిన సహోదరులు ఫిచ్చ్‌, స్టాక్‌మేన్‌ గారలు మా వద్దకు వచ్చి వారు మరణించియున్నపుడు మేము పొందిన అనుభవమును గూర్చి మమ్మును అడిగిరి. మాకు కలిగిన మహా శ్రమలను జ్ఞాపకము చేసికొనుటకు మేము యత్నించితిమి. కాని యవి మమ్ము నావరించిన శాశ్వతమైన గొప్ప మహిమముందు కొరగానివిగా అగుపడగా మేము ఆ శ్రమలను గూర్చి మాటలాడలేక, “హల్లెలూయా మోక్షము మనకెంత సులభముగా లభ్యమైనది!” యని కేకలు వేసితిమి. పిదప మేము మా బంగారు వీణెలను మీటి పరలోకమును ప్రతిధ్వనింప జేసితిమి. CChTel 55.2

యేసును వెంబడిరచి మేమందరము ఆ పట్టణమునుండి ఈ భూమిపై ఒక గొప్ప పర్వతముమీద దిగితిమి. ఆ పర్వతము యేసును మోయలేక వ్రక్కలైనది. అప్పుడొక విస్తారమైన మైదానము ఏర్పడినది. మేము పైకి చూడగా పరిశుద్ధ పట్టణము కాన్పించెను. దానికి పన్నెండు పునాదులు, ఒక్కొక్క ప్రక్క మూడు చొప్పున పన్నెండు ద్వారములుగలవు. ప్రతి ద్వారమువద్ద ఒక దేవదూత ఉండెను. మేమందరము “ఆ మహా పట్టణము వచ్చుచున్నది; అద దేవుని వద్ద నుండి పరలోకము విడిచి వచ్చు చున్నది” అని కేకలు వేసితిమి. ఆది మేమున్న స్థలమునకు వచ్చి నిలిచినది. ఆ పట్టణము వెలపలనున్న మహిమాయుతమైన విషయములను చూచితిమి. నేను అక్కడ మహిమతో నిండిన గృహములను చూచితిని. అవి వెండివలె నున్నవి. ఆ గృహములు ముత్యములతో పొదగబడిన నాలుగు స్థంబములపై నిలిచి నేత్రపర్వముగ నున్నవి. ఇవి పరిశుద్ధుల నివాసములు. ప్రతి గృహమునందును బంగారముతో చేయబడిన ఒక బీరువాకలదు. పరిశుద్ధులనేకులు ఈ గృహమునందు ప్రవేశించి నిగనిగ లాడు తమ కిరీటములను తీసి యీ బీరువాలలో పెట్టి పని చేయుటకు ఇండ్ల ప్రక్కనున్న పొలములలోనికి వెళ్ళుట నేను చూసితిని. అక్కడ పని ఈ లోకములో మనము చేయు పని వంటిదికానేకాదు. వారి శిరములపై మహిమా సంకలితమైన వెలుగు ప్రకాశించెను. వారు నిరంతరాయముగా దేవునికి స్తుతులనర్పించుచు కేకలు వేయుచుండిరి. CChTel 55.3

నేను మరియొక పొలము చూచితిని. అది నానావిధ పుష్పములతో విరాజిల్లుచుండెను. వానిని కోయుచు “ఇవి ఎన్నటికిని ఎండిపోవు” అని కేకరించితిని. పిపద నేను మరియొక పొలమును చూచితిని. దానియందు గడ్డి ఏపుగాపెరిగి చూచుటకు మనోహరముగానుండెను. అది నిత్యము పచ్చగా నుండి యేసు రాజు మహిమార్థము ఊగినపుడు రజిత సువర్ణఛాయలను ప్రతిఫలించుచుండెను. పిదప మేము నానావిధ జంతువులుండు పొలమును ప్రవేశించితిమి. అక్కడ సింహములు, గొర్రెపిల్లలు, చిరుతపులులు, తోడేళ్ళు సంపూర్ణ ఐకమత్మము కలిగిఉండెను. మేము ఆ జంతువుల మధ్యనుండి వెళ్ళితిమి. అవి మా వెనుక శాంతముగా వచ్చినవి. ఆ మీదట మేమొక అడవియందు ప్రవేశించితిమి. అవి ఇక్కడ ఉండు చీకటి కోనల వంటివికావు. అవి వెలుగుతో నిండి ఎక్కడ చూచినను మహిమ కలిగియుండెను. చెట్ల కొమ్మలు ఇటునటు ఊగినవి. మేమందరము “మేము అడవులలో సురక్షితముగా వసించి నిద్రించెదము” అని కేకలు వేసితిమి. మేము అడవులు దాటితిమి. ఏలయనగా మేము సియోను పర్వతమునకు పోవుచుంటిమి. CChTel 56.1

మేము సాగిపోవుచుండగా ఒక జట్టును కలిసికొంటిమి. వారుకూడ ఆ స్థల వైభవములను తిలకించుచున్నారు. వారి వస్త్రములపై ఎరుపు అంచు ఉన్నట్లు నేను చూచితిని. వారి కిరీటములు ప్రకాశవంతములుగా నున్నవి. వారి వస్త్రములు తెల్లగా నున్నవి. మేము వారిని కలిసికొన్నప్పుడు వారెవరని నేను యేసునడిగితిని. వారు తన నిమిత్తము చిత్రవధచేయబడిన హతసాక్షులని ఆన నుడివెను. వారితో లెక్కకు మించిన చిన్న పిల్లల సమూహమున్నది. వారి వస్త్రములపై కూడ ఎరుపు అంచు కలదు. సియోను పర్వతము మా ముందే యున్నది. ఆ పర్వతముపై ఒక మహిమాన్వితమైన ఆలయము కలదు. దానిచుట్టు మరి ఏడు పర్వతములున్నవి. వానిపై గులాబీలు, లిల్లీ పుష్పములు పెరుగుచున్నవి. ఈ చిన్న పిల్లలు ఎక్కి, లేక తమ చిన్న రెక్కలతో ఆ పర్వతముపైకి ఎగిరి వెళ్ళి నిత్యము కళకళలాడు ఈ పుష్పములను కోయుట నేను చూచితిని. ఆ స్థలమునకు శోభ కూర్చుటకు దేవాలయము చుట్టు వివిధ వృక్షములు కలవు-సీమ, అనాస, దేవదారు, తైలవృక్షము, గొంజి, దానిమ్మ, పండ్లతో వంగియున్న అత్తి, మేము ఆలమందు ప్రవేశించబోయినప్పుడు తన మనోహర కంఠమెత్తి యేసు ”ఈ స్థలమందు 1,44,000 మంది మాత్రమే ప్రవేశింపవలెను” అనగా, మేమందరము “హల్లెలూయా” ని కేకలు వేసితిమి. CChTel 56.2

ఈ ఆలయము ఏడు స్తంభములపై నిర్మితమైనది. ఈ స్తంభములు స్వచ్ఛమైన బంగారముతో చేయబడినవి. వీనియందు ధగధగ మెరయు ముత్యములు పొదిగించబడినవి. ఇక్కడ నేను చూచిన అపురూప విషయములు వర్ణనాతీతములు. కనాను భాషలో నేను మాటలాడ గలిగినెంత బాగుండును! అప్పుడు ఆ ఉత్కృష్ట ప్రపంచ మహిమను కొంత వరకు చెప్పగల్గి యుండెడిదానను. అక్కడ నేను రాతి పలకలను చూచితిని. ఆ పలకలపై 1,44,000 మంది పేర్లు సువర్ణాక్షరములలో చెక్కబడెను. దేవాల వైభవమును తిలకించిన పిదప మేము వెలపలకు వెళ్ళితిమి. యేసు మమ్మును విడిచి పరిశుద్ధపట్టణమునకు వెళ్లెను. కొంతసేపటిలో ఆయన తన మధుర స్వరము నెత్తి,”నా ప్రజలారా రండి; గొప్ప శ్రమలనుభవించి మీరు నా చిత్తమును నెరవేర్చినారు. నా కొరకు బాధలనుభవించినారు. భోజనము చేయుటకు రండి. నేను నడుము కట్టుకొని మీకు వడ్డించెదను” అనెను. “హల్లెలూయ, మహిమ,” యని కకలు వేసి మేము పట్టణమందు ప్రవేశించితిమి. స్వచ్ఛమైన వెండితో చేయబడిన ఒక బల్లను నేను చూచితిని. అది చాల మైళ్లు పొడవుగా నుండెను. అయినను మా నేత్రములు దానిని సాంతముగా చూడగలిగెను. జీవ వృక్ష ఫలములను, మన్నాను, బాదము కాయలను అంజూరపు పండ్లను, దానిమ్మ పండ్లను, ద్రాక్షా పండ్లను ఇంక అనేక యితర ఫలములను నేను చూచితిని. ఆ పండ్లను భుజింపనిమ్మని యేసు నడిగితిని. “ఇప్పుడు కాదు. ఈ ఫలములను భూజించువారు తిరిగి భూమికి వెళ్లజాలరు. విశ్వాసముగా నున్నచో స్వల్పకాలములోనే నీవు జీవ వృక్షఫలములను భుజించి జీవజాలములను త్రాగెదవు” అని ఆయన చెప్పెను. “నేను నీకు ప్రత్యక్షపరచిన సంగతులు తెల్పుటకు నీవు భూలోకమునకు తిరిగి వెళ్ళవలెను” అని ఆయన చెప్పెను. అప్పుడొక దేవదూత నన్ను ఈ చీకటి ప్రపంచమునకు నెమ్మదిగా తీసికొని వచ్చెను. ఇక్కడ ఉండజాలనని నేను కొన్ని మారులు అనుకొందును. లోక విషయములన్నియు విసుగు కలిగించుచున్నట్లు గోచరించును. ఇక్కడ నేను ఏకాంతముగా నున్నట్లు తోచును. ఏలయనగా నేను ఉత్తమ ప్రపంచమును చూచితిని. నాకు పావురము వలె రెక్కలుండిన ఎంత బాగుండును! అప్పుడు దూరముగా ఎగిరిపోయి విశ్రాంతి గొందును ` “ఎర్లీ రైటింగ్స్‌” పుట CChTel 57.1