Go to full page →

అధ్యాయము 61 - రానైయున్న క్లిష్ట పరిస్థితులు CChTel 494

దైవ ధర్మశాస్త్రము పట్ల అలక్ష్యభావము అధికమగు కొలది ధర్మశాస్త్రావలంబకులకును, లోకస్థులకును మధ్యగల వ్యత్యాసము స్పష్టముగా బయలుపడును. ఒక వర్గమునందు దైవాజ్ఞలయందు ప్రేమ అధికరించును. మరియొక వర్గమందు వానిపట్ల ఏహ్యభావము సమధికమగును. CChTel 494.1

ఈ క్లిష్ట సమయమున వేగముగా దాపురించు చున్నది. వేగముగ అధికమగుచున్న వాని సంఖ్యలు దైవాగమన కాలము దాదాపు వచ్చినదని చూపించుచున్నవి. దండిరచుట ఆయనకు ఇష్టము లేకున్నను దండిరచును. ఆ దండన త్వరితముగా జరుగును. CChTel 494.2

దేవుని ఉగ్రతా దినము చాల సమీపముగా నున్నది. లోకములో జరుగుచున్న నీచకార్యముల విషయము దు:ఖించు వారి నొసళ్ల మీదనే దేవుని ముద్ర వేయబడును. CChTel 494.3

లోకముతో సానుభూతి ద్వారా సంబంధము ఏర్పరచుకొనువారు త్రాగుబోతులతో కలిసి తినుచు త్రాగుచునుండు వారగుదురు. వారు దుర్మార్గులతో కలిసి నిశ్చయముగా నాశనమయ్యెదరు. “ప్రభువు కన్నులు నీతిమంతులమీదను, ఆయన చెవులు CChTel 494.4

వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది.” 1 పేతురు 3:12. CChTel 494.5

సజీవుడైన దేవుని ముద్రను పొందెదమో లేక మారణాయుధములతో సంహరించబడెదమో మన కార్య విధానమే నిర్ణయించును. దైవ కోపాగ్నికణములు భూమి పైకి రానే వచ్చినవి. కాని చివరి ఏడు తెగుళ్లు ఏమియు కలపబడకుండ ఆయన ఉగ్రతా పాత్రలో పోయబడినపుడు పశ్చాత్తాపపడి ఆయనను ఆశ్రయించుటకు వీలుండదు. అప్పుడిక పాసపుడాగులను ప్రాయశ్చిత్తార్థమై చిందించబడిన రక్తము శుభ్రపరచజాలదు. CChTel 494.6

సబ్బాతు నాచరించుచున్నామని చెప్పుకొను వారందరును ముద్రించబడరు. ఇతరులకు సత్యమును బోధించువారిలో సయితము అనేకులు దేవుని ముద్రను తమ నొసళ్లపై కలిగి యుందురు. వారికి సత్యసంబంధమైన వెలుగున్నది. తమ ప్రభువు చిత్తమును వారెరిగినవారే. విశ్వాసము నందలి ప్రతి విషయము వారెరిగినదే. అయితే వారు తమ విశ్వాసము నకు తగిన క్రియలు చేయలేదు. ప్రవచనములను, దైవజ్ఞాన సంపత్తిని బాగుగ నెసిగిన వారు తమ విశ్వాసము ప్రకారము ప్రవర్తించి యుండవలసినది. తమ యింట వారు యెహోవా మార్గమును గైకొనుటకు ఆజ్ఞాపించుట ద్వారా వారు మానవ హృదయముపై సత్యప్రభావము ఎట్టిదో లోకమునకు ప్రదర్శించి యుండవలెను. CChTel 494.7

తమ భక్తిహీనత వలనను, ఉన్నత మత ప్రమాణము నందజాలక పోవుట వలనను ఇతరాత్మలు తమ అధికారమును ధిక్కరించుటకు ప్రోత్సహించబడెదరు. తమకు తరచుగా దైవ వాక్యమును బోధించు ఈ మనుష్యుల ననుసరించుట ద్వారా తాము అపాయమందున్నామని పరిమితమైన వివేచనగల మనుజులు గ్రహించరు. క్రీస్తే యేకైకమయిన యదార్థమైన ఆదర్శము. తానేమి చేయవలెనని దేవుడు కోరుచున్నాడో తెలిసికొనుటకు పసిపిల్ల వాని విధేయత కలిగి వినయముగా దేవుని ముందు మోకరిల్లి ప్రార్థించి ప్రతి వ్యక్తి తనకై తాను పరిశుద్ధ గ్రంథమును పరిశోధించవలెను. దైవాదరమందు ఏ బోధకుడైనను ఎంత ఉన్నతముగా నున్నను, దేవుడిచ్చిన వెలుగును అతడు అనుసరించకున్నచో చిన్న పిల్లవానివలె విధేయత కలిగి నేర్చుకొనకున్నచో అతడు చీకటిలో పడి సాతాను వంచనలకు లొంగి యితరులను కూడా అదే మార్గమున నడిపించును. CChTel 495.1

మన శీలములపై ఒక్క కళంకమైనను, మచ్చయై నను ఉన్నచో మనలో నొకరు కూడా దేవుని ముద్ర పొందజాలము. మన శీలముల యందలి లోపములను సంస్కరించి ఆత్మాలయమును ప్రతి విధమయిన పాపము నుండి శుద్ధి చేయు పని మనకే విడిచిపెట్టబడినది. అప్పుడు పెంతుకోస్తు దినమున శిష్యులపై తొలకరి వర్షము పడినరీతిగా మనపై కడవరి వర్షము కురియును. CChTel 495.2

తమకీ కార్యసుసాధ్యమనియు, తాము క్రైస్తవ జీవితము జీవించలేమనియు నెవరును చెప్పనవసరము లేదు. క్రీస్తు మరణము ద్వారా ప్రతి ఆత్మ కొరకు చాలినంత ఏర్పాటు కావించబడినది. మన అవసరతయందు ఆయన నమ్మదగిన సహాయకుడు. విశ్వాసముతో ఆయనకు మొరపెట్టుడి. మీ విజ్ఞాపలను విని మీకు సమాధానమిత్తునని ఆయన వాగ్దానము చేసెను. CChTel 495.3

ఆ సజీవ విశ్వాసము మనకుండిన ఎంత మేలు. మనకిది అవసరము. అది మనము పొంది తీరవలెను. పొందకున్నచో పరీక్ష సమయమున మనము సొమ్మసిల్లి అపజయము పొందెదము. కాగా మన మార్గమందుండు చీకటి, మనలను, ఆధైర్యపర్చరాదు లేక వం తకు లోను చేయరాదు. దేవుడు గొప్ప దీవెనలీయవచ్చు నపుడు తన మహిమను దీనితో కప్పుకొనును. గతానుభవము ద్వారా మనము వీనిని తెలిసి కొనవలెను. తన ప్రజలతో దేవుడు తన వివాదమును తీర్చుకొను దినమున ఈ యనుభూతి, ఆదరణ, నిరీక్షణలను కూర్చును. CChTel 495.4

లోక మాలిన్యము మనకు మన పిల్లలకు అంటకుండ జాగ్రత్తగా నుండవలసిన సమయము ఇదే. మన ప్రవర్తనా వస్త్రములను గొర్రెపిల్ల రకత్మఉనదు తెల్లగా ఉదుకుకొనవలసిన సమయమిదే. మనము గర్వమును, దురాశలను ఆధ్యాత్మికమైన సోమరి తనమును జయించవలసిన సమయమిదే. మనము మేల్కొని సమగ్రశీలమును సాధించు కొనుటకు బలముగా కృషి చేయవలసిన సమయమిదే. “నేడు మీరాయన శబ్దమును వినిన యెడల.. . మీ హృదయములను కఠిన పరచుకొనకుడి.” హెబ్రీ 3:7,8,15. CChTel 496.1

సిద్ధపడుటకు ఇదే సమయము. అపవిత్ర పురుషుని లేక స్త్రీ నొసటిమీద దేవుని ముద్ర వేయబడదు. పేరాశ, లోక ప్రీతి గల స్త్రీ పురుషుల నుదుళ్లపై అది వేయబడదు. ఆ ముద్ర పొందు వారందరు దేవుని ముందు నిందారహితులై పరలోకమునకు అభ్యర్ధులుగా నుండవలెను. సహోదరులారా, సహోదరీలారా, ముందుకు సాగిపోవుడి. సిద్ధపడుట అవసరమని మీ గమనమునకు తెచ్చుచు ఈ సమయమందీ విషయములపై సంగ్రహముగా మాత్రమే వ్రాయగలను. ప్రస్తుత కాల భయానక గంభీరతను గ్రహించుటకు గాను మీకైమీరే లేఖనములను పరిశోధించుడి. 15T 209,212-216; CChTel 496.2