Go to full page →

క్రీస్తు నీతి వస్త్రముతో కప్పబడుట CChTel 524

దైవ ప్రజలు హృదయశుద్ధి కొరకు వేడుకొనుచు దేవుని ముందు తమ ఆత్మలను దు:పరచుకొనగా “వారి మైల బట్టలు తీసివేయుడి” అవి ఆజ్ఞ ఇయ్యబడును. నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను” అని ప్రోత్సాహకర మాటలు పలుకబడెను. క్రీస్తు నిష్కళంకమైన నీతి వస్త్రము పరీక్షించబడి, శోధించబడిన దేవుని నమ్మకమైన బిడ్డలపై కప్పబడెను. తృణీకరించబడిన శేషించిన ప్రజలు మహిమకరమైన వస్త్రములతో అలంకరించబడెదరు. లోక మాలిన్యము. మరెన్నడును వారి నంటదు. సర్వ యుగములందు నివసించిన వారి పేళ్ల మధ్య వారి పేళ్లు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు నిలచి యుండును. వంచకుని మోసములకు వారు లొంగకుండిరి. ఘట సర్పము యొక్క గర్జనకు భయపడి వారు తమ ప్రభుభక్తిని వీడలేదు. ఇప్పుడు వారు శోధకుని పన్నాగములకు అతీతులైరి. వారి పాపములు పాపోత్పత్తి దారునిపై మోపబడినవి. CChTel 524.2

శేషించిన ప్రజలు క్షమించబడి అంగీకరించబడుటయేగాక గౌరవించబడెదరు. వారి తలలపై “తెల్లని పాగా” పెట్టబడును. దేవుని దృష్టిలో వీరు రాజులను, యాజకులును. సాతానుడు నిందలు మోపుచు ఈ సమూహమును నాశనము చేయు జూచుచుండగా దేవదూతలు అదృశ్యులై అటు నిటు తిరుగుచు వారిపై సజీవ దేవుని ముద్ర వేయుచున్నారు. తండ్రి పేరు తమ నుదుళ్లపై నిడుకొని గొర్రెపిల్లతో కలిసి సియోను పర్వతముపై నిలచు వారు వీరే. సింహాసనము ముందు వారు క్రొత్త పాట పాడెదరు. భూమిపై CChTel 524.3

నుండి రక్షించ బడిన 144000మంది తప్ప మరెవరును ఈ పాటను నేర్చుకొనలేరు.” గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రధమ ఫలముగా వుండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. వీరి నోట అబద్దమును కనబడలేదు. వీరు అనింధ్యులు. ”ప్రక 14:4,5. 15T 467-476. CChTel 525.1