Go to full page →

“రండి సనస్కారము చేసి సాగిలపడుదము” CChTel 73

“ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యఉందు” ని క్రీస్తు చెప్పెను. మత్తయి 18:20. ఎక్కడ ఇద్దరు ముగ్గురు విశ్వాసులుందురో వారు ప్రభుని వాగ్దత్త ఫలమును పొందుటకు సబ్బాతు దినమున సమావేశము కావలెను. CChTel 73.3

తన పరిశుద్ధ దినమందు దేవుని నారాధించుటకు కూడు కొనిన చిన్న మందయే యెహోవా దీవెనలు పొందుటకు హక్కు కలిగియుండును. వారి కూటమునకు ప్రభువైన యేసు సందర్శకుడిగా వచ్చునని వారు విశ్వసించవలెను. సబ్బాతును పరిశుద్ధముగదా ఆచరించు ప్రతి వ్యక్తియు “మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే” అను వాగ్దానమును తన పరము చేసికొవలెను. నిర్గమ 31:13. 76T 360,361; CChTel 74.1

లోకసంబంధమగు పనిని విడిచి దేవుని మహిమను సౌజన్యమును గూర్చి మానవుడు ధ్యానించుటకుగాను అతని కొరకు, ఆయనీ వాక్యమందలి సత్యములను గూర్చి చర్చించుకొనుటకు, కొంత సమయమును ప్రార్థనయందు గడుపుటకు, దైవ ప్రజలు ఒక చోట సమావేశమగుట అగత్యము. సబ్బాతుదినమున సహితము ప్రార్థనాపరంపర కూటములు ఆయాసకరములుగను, ఆశక్తి శూన్యములుగను నుండరాదు. 82T 583; CChTel 74.2

సంఘమందు బోధకుడు లేనిచో కూటమునకు నాయకుడొకడు నియమించబడవలెను. అతడు ప్రసంగము చేయటగాని ఎక్కువ కాలమును ఏదోవిధముగ గడుపుట గాని అగత్యముకాదు. తరచు క్లుప్తమైన, ఆశాజనకమైన వేద పథనము ప్రసంగముకన్న ఎక్కువ లాభదాయకముగా నుండును. దీని యనంతరము ప్రార్థనలు చేయుటకు, సాక్షములిచ్చుటకు ఒక కూటము జరుపబడవచ్చును. CChTel 74.3

సబ్బాతు కూటమును ఆశాజనకముగా జేయుటలో తమకు భాగమున్నదని అందరును తలంచవలెను. ఆచారము ననుసరించి ప్రార్థనకు సమావేశము కారాదు. కాని చర్చించుకొనుటకు, మీ యనుదినానుభవములను చెప్పుకొనుటకును, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, ఆయన పంపిన యేసుక్రీస్తును గూర్చియు తెలిసికొనునిమిత్తము దైవ జ్ఞానము కొరకు ప్రార్థన చేసినచో అది జీవిత దురవస్థలను, సంఘర్షణలను ఎదుర్కొనుటకు ఆత్మను బలపర్చును, మీయంతట మీరు నివసించు క్రైస్తవులుగా నుండగలరని యెప్పుడును తలంచవద్దు. మానవకోటియను అల్లికయందు ప్రతి మానవుడు నొక భాగము. ఒక్కొక్కని యనుభవము అతని సహచరుల యనుభవమును బట్టి నిర్ణయించబడును. 96T 361,362; CChTel 74.4