Go to full page →

అధ్యాయము 6 - చిత్తగించుము నేనున్నాను; నన్ను పంపుము CChTel 94

రాత్రి వేళ నిశ్శబ్దముగా వచ్చు దొంగవలె అగోచరముగా అంతము మనలను సమీపించును. ఇతరులవలె నిద్రించక మెళుకువగా నుండి స్థిరబుద్ది కలవారమగునట్లు దేవుడు మనలను కటాక్షించుగాక! త్వరలో సత్యము మహిమాన్వితముగా జయము పొందనున్నది. దేవునితో జతపనివారుగా నుండ నిశ్చయించుకొన్న వారందరు దానితోపాటు జయము పొందెదరు. కాలము తక్కువగా నున్నది, త్వరలో రాత్రి వచ్చును. అప్పుడెవరును పనిచేయలేదు. ప్రస్తుత సత్యజ్యోతియందు ఆనందించుచున్నవారు త్వరపడి యితరుల కాసత్యమును బోధించవలెను.”నేను ఎవరిని పంపెదను” అని ప్రభువు ప్రశ్నించుచున్నాడు. సత్యము కొరకు సమర్పణచేయ నాసించువారిప్పుడు “చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము” అని ప్రత్యుత్తరమీయవలెను. CChTel 94.1

మన పొరుగువారి మధ్య, స్నేహితుల మధ్య మనము సువార్త సేవ చేయవలెనని దేవుడు కోరుచున్నాడు. అట్టి సేవను కొద్దిగా మాత్రమే మనము చేసియున్నాము. మన భూభాగమందలి ప్రతి నగరములోను సత్యము నెరుగనివారున్నారు. సముద్రముల ఆవలనున్న సువిశాల ప్రపంచంలో అనేక నూతన క్షేత్రములున్నవి. మనము ఆ పొలములను దున్ని విత్తనములు విత్తవలసి యున్నాము1An Appeal to Ministers and Church Officers; CChTel 94.2

మనము శ్రమకాలపు ద్వారముకడ నున్నాము. కలలోనైనను తలవంచని చిక్కులు మన ముందున్నవి. దేవునితో యుద్ధము చేయుటకు సాతానుడు మానవులను సమీకరించుచున్నాడు. దైవ ధర్మశాస్త్రమును రద్దుచేయుటకు సాతాను ప్రతినిధి వర్గము మానవులు ఖరారుపడి యున్నారు. జలప్రళయము వలన నాశనము చేయబడిననోవహు కాం ప్రజల వలెను, పరలోక అగ్నితో భస్మీపటలము చేయబడిన సొదోను ప్రజల వలెను నేటి ప్రపంచ ప్రజలు తయారగుచున్నారు. నిత్య వాస్తవముల నుండి మనుజుల మనస్సులను త్రిప్పి వేయుటకు సాతాను శక్తులు పనిచేయుచున్నవి. శత్రువు తన కార్యమున కనువగు రీతిగా విషయములను అమర్చెను. లోక వ్యవహారములు, క్రీడలు, నవీన ఫేషన్లు ` ఇవి స్త్రీ పురుషుల మనస్సుల నాక ర్షించు విషయములు. వినోదములు, వ్యర్థసాహిత్య పఠనము బుద్దిని పాడుచేయును. నిత్య నాశనమునకు నడుపు విశాల మార్గమున జనులు తండోపతండములుగా సాగిపోవుచున్నారు. దౌర్జన్యముతోను, దుర్భాషలతోను, త్రాగుడుతోను నిండిన ప్రపంచం సంఘమును పాడు చేయుచున్నది. దైవ నీతి ప్రమాణమగు ధర్మశాస్త్రము నిరర్థకమైనదని చెప్పుచున్నారు. 29T 42, 43; CChTel 94.3

దీనిని గూర్చి హెచ్చరిక చేయుటకు అంతమును గూర్చిన ప్రవచనములు నెరవేరువరకు మనము ఆగవలెనా? అప్పుడు మన మాటల ప్రయోజనమేమి? దేవుని తీర్పులను తప్పించుకొను మార్గమును గూర్చి పాపికి చెప్పకుండా వానిపై దేవుని తీర్పులు పడువరకు వేచియుందుమా? ఆయన చెప్పినదానిని విశ్వసించకముందే ముందుచెప్పబడిన సంగతులు నెరవేరు వరకు మనము ఆగవలెనా? ప్రభుని మహాదినము చాలా సమీపముగా నున్నదనియు “ద్వారము వద్దనే” యున్నదనియు చూపుచు మనకు విస్పష్టమైన, నిష్కర్షయైన కిరణములతో వెలుగు వచ్చినది. ఎక్కువ ఆలస్యము కాకమునుపే చదివి గ్రహింతుముగాక. 39T 30; CChTel 95.1