Go to full page →

మన ఆస్తి . దైవసేవ పోషణ CChTel 121

దేవుని యధార్థముగా ప్రేమించుచు ధనము కలిగియున్న వారికి ఇట్లు చెప్పవలెనని ఆదేశించబడితిను. ప్రభువు సేవను షోపించుటలో నీ ధనము పెట్టుబడి పెట్టుటకు ఇదే అనుకూల సమయము. నశించుచున్న ఆత్మలను రక్షించుటయందు ఆత్మోపేక్షకై చేయుమత్నములలో బోధకులకు అండదండగా నుండుటకిదియే సమయము. మీసహాయముద్వారా రక్షించి బడిన ఆత్మలను పరలోకావరణమలో కలిసికొన్నప్పుడు మీకు మహిమాన్వితమగు ఫలము కలుగదా? CChTel 121.2

తమకున్నది స్వల్పమైనను దాని ఇచ్చుటకు ఎవరును వెనుదీయరాదు. ఎక్కువ ఇచ్చువారు పరలోకమునందు తాము దాచుకొన్న ధనము ఎన్నటికిని తరుగదని సంతసించెదరు గాక. దైవసేవ యందు ఉపయోగించబడని ధనము నాశనమగును. పరలోకపు ధననిధి యందు దానికి వడ్డీ యుండదు. CChTel 122.1

ప్రతి ప్రాంతమందలి సేవెంతుడే ఎడ్వెంటిస్టులను దేవుడు తమ్మును తాము ఆయన కు సమర్పించుకొని తమ పరిస్థితుల ప్రకార తమ శక్తి కొలది కృషి చేయుటకును ఆయన సేవయందు తోడ్పడుటకును ఇప్పుడు ఆహ్వానించుచున్నాడు. ఆయన కృప విషయము కృతజ్ఞతను, ఆశీర్వాదముల విషయము తమ అభివాదములను ధారాళ విరాళముల ద్వారాను అర్పణలద్వారాను కనపర్చవలెనని కోరుచున్నాడు. 249T 131, 132; CChTel 122.2

ఆపత్కాలమున మన శారీరకావసరముల నిమిత్తం ఏ యేర్పాటులైనను గావించు కొనుట పరిశుద్ధ గ్రంథమునకు విరుద్ధమని ప్రభువు పదే పదే నాకు కనబరచెను. యుద్ధము క్షామము, జాడ్యము దేశమున వ్యాప్తి జెందినప్పుడు పరిశుద్ధులు నిల్వచేసికొనగా లేక శ్రమ కాలమందు పొలమునందు పంట నుంచుకొనగా వారి పదార్థములను దుష్టులు తీసికొనుట, వారి పొలమును పరదేశులు కోసుకొనుట నేను చూచితిని. మనము దేవుని యందు సంపూర్ణ ముగా విశ్వసించవలసిన కాలమిదే. ఆయన మనలను పోషించును, ఆ సమయమున మనకు ఆహారపానములను గూర్చిన కొదువలుండవు. మనము ఆకలి బాధ నొందము. ఏలననగా అరణ్యమందు సహితము మనకు భోజనము సిద్ధము చేయుటకు దేవుడు సమర్థుడు. ఏలియాను సాకిన విధముగా అవసరమగునో ఆయన మనకు కాకులతో ఆహారము పంపును. లేక ఇశ్రాయేలీయులకువలె ఆకాశమునుండి మన్నాను కురిపించును. CChTel 122.3

శ్రమకాలమున గృహములు, భూములు పరిశుద్ధులకు నిరుపయోగములగును. కారణమేమనగా ఆగ్రహముతో నిండిన జన సమూహముల వద్ద నుండి వారు పలాయితులు కావలిసి వచ్చును. వర్తమాన సత్యమును ప్రచారము చేయు నిమిత్తము తమ ఆస్తులను అప్పుడు విక్రయించవల్లకాదు. శ్రమకాలము రాకముందే పరిశుద్ధులు ప్రతిబంధకములను త్రెంచుకొని సమర్పణ ద్వారా దేవునితో ఒక నిబంధన చేసికొనవలెనని నాకు ప్రత్యక్ష పర్చబడెను. వారు తమ ఆస్తిని దేవుని సేవా బలిపీఠముపై పెట్టి యేమిచేయవలెనో ఆయన నడిగినచో దాని నెప్పుడు విక్రయించవలెనో ఆయన వారికి ఎరుకపర్చును. శ్రమకాలమదు వారు స్వతంత్రత కలిగి యుందురు. వారిని క్రుంగదీయు భారమేమియు నుండవు. 25EW 56, 57; CChTel 122.4