Go to full page →

ఏకత్వము, ఐక్యము మన ప్రబల సాక్ష్యము CChTel 127

మనకు ఎక్కువ అపాయము కలుగజేయునది లోకము చూపు ప్రాతికూల్యము కాదు గాని విశ్వాసులమని చెప్పుకొను వారి హృదయములలో దోబూచులాడుచున్న పాపమే. ఇది మనకు గొప్ప నాశనమును, దైవసేవాభివృద్ధికి గొప్ప ఆటంకమును కలిగించుచున్నది. దురాలోచనలు చేయుట, తప్పులు వెదుకుట, ఒకరినొకరు శంకించుట, ఈర్ష్యాళువు ప్రదర్శించుట ` ఇవియే మన ఆధ్యాత్మికతను బలహీనము చేయుచున్నవి. ఇది చాలా హానికరమైన స్థితి. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూసంబంధమైనదియు, ప్రకృతి సంబంధమైనదియు, దయ్యముల (జ్ఞానము) వంటిదియునై యున్నది. ఏలయనగా మత్సరమును, వివాదమును, ఎక్కడ వుండునో అక్కడ అల్లరిఉ ప్రతి నీచకార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొదట పవిత్రమైనది. మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను, మంచి ఫలముతోను నిండుకొనునది, పక్షపాతమైనను, వేషధారణjైునను లేనిదై యున్నది. యాకోబు 3. 15`18 CChTel 127.3

వేర్వేరు మనస్తత్వములుగల మనుష్యులలో కాననగు ఐక్యతయు ఎకిభావమును ,పాపులను రక్షించుటకు దేవుడు తన కుమారుని లోకము లోనికి పంపెను సత్యమును ప్రబల సాక్ష్యములు కాగలవు. ఇట్టి సాక్ష్యము నిచ్చుట మనకొక విశిష్ట తరుణము. కాని దీనిని చేయుటకుగాను మనము క్రీస్తునాజ్ఞను లోబడవలెను. మనము శిలము ఆయన శీలమువలే రూపొందువలెను. మన చిత్తము ఆయన చిత్తమును లొంగియుండవలెను. అప్పుడు మనము భావసంఘర్షణలేక కలిసి కట్టుగా పనిచెయగలము. CChTel 128.1

స్వల్పాల్పభేదముపై పట్టింపు మన క్రైస్తవ సహవాసమును చేయు ఘటక చర్యలకు దారితియిను. ఈ విధముగా అపవాదిని మనపై జయము పొందనీయకుందుముగాక. మనము దేవునికి సమీపముగా నుండి ఒకరితోనొకరు సన్నిహితముగా నుందము. అప్పుడు మనము ప్రభువుచే నాటబడి ,జీవజలముచే తడుపబడుచున్న నీతి వృక్షములవలె నుందుము. మనము బహుగా ఫలించెదము. క్రిస్తిట్లు చెప్పలేద ?మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమ పరచబడును. ”యేహను 15:8 CChTel 128.2

క్రీస్తు ప్రార్ధనను సంపూర్ణముగా విశ్వసించినచొ తమ దైనందిన జీవితములో దైవ ప్రజలు దాని ఉపదేశములను అనుసరించినచొ మనము చేయు కార్యములలో సంఘీభావము గోచరించును. క్రీస్తు ప్రేమా సువర్ణపాశముతో ఒక సహోదరుడు మరియొక సహోదరునితో అనుబంధపర్చబడి యుండును. ఈ ఏకత్వమును దేవుని ఆత్మమాత్రమే సాధ్యపరచును. తన్నుతాను పరిశుద్ద పరచుకొన్న క్రీస్తు తన శిష్యులనుకుడా పరిశుద్ద పరచ సమర్ధుడు. ఆయనతో వారు అతి పవిత్ర విశ్వసమునందు ఒకరితోనొకరు ఏకము కాగలరు. దేవుడభిలషించు విధముగా మనమీ ఐక్యత కొరకు ప్రయత్నించినచో అది మనకు సాధ్యమగును. 38T 242, 243; CChTel 128.3

దేవుడు కోరునది ఎక్కువ సంస్థలుగాని ,గొప్ప భవనములుగాని ,బాహ్య వైభవములుగాని కాదు. దేవుని యందు క్రీస్తుతో తమ జీవితమును దాచుకున్న వారై ఒకరితో నొకరు ఐక్యత కలిగి దేవుని వలన ఎన్నుకొనబడిన ప్రశస్త జానంగమైన ,దేవుని సోత్తయిన ప్రజల సమష్టి కార్యమూ నాయన కోరుచున్నాడు. ప్రతివాడు తన స్థానమందు నిలిచి,తలంపునందును ,మాటయందును,క్రియయందును ,సరియైన మాదిరి చూపవలెను. దేవుని పనివారు దీనిని చేసినప్పుడు ఆయన పని సర్వ సంపూర్ణత నొందును. అప్పటి వరకు 48T 143; CChTel 128.4

సత్యాసత్యములను విచేచింపగలిగి యథార్ద విశ్వాసము, మంచి మనసు కల పురుషులను ప్రభువు ఆహ్వానించుచున్నాడు. యోహావా 17 వ ఆధ్యాయమునందీయబడిన పాఠములను చదివి ఆచరణలో పెట్టుచు ప్రస్తుతకాల సత్యమునందు సజీవ విశ్వాసము కలిగి ప్రతి వ్యక్తి జాగరూకుడై యుండవలెను. క్రీస్తు ప్రార్థనతో మన అనుదిన జీవితము ఎకీభవించుటకు సాయపడు ఆత్మ నిగ్రహము మన కవసరము. 58T 239; CChTel 129.1

దేవుని ఉద్దేశమును సంపూర్ణముగా నెరవేర్చు నిమత్తము, రక్షకుని హృదయము తన అనుచరులపై కేంద్రీకృతమైయున్నది. ప్రపంచమందు చెల్లాచెదురైయున్నను, వారాయనయందు నిలువవలెను. ఆయన మార్గమునవలంభించుటకుగాను తన మార్గములను విడిచి పెట్టుటకు వారు ఇష్టపడకున్నచో దేవుడు వారిని క్రీస్తుతో ఏకము చేయలేడు. 68T 243; CChTel 129.2