Go to full page →

పరిశుద్ధీకరణ యొక్క వాస్తవిక నిదర్శనములు CChTel 139

మన రక్షకుడు ప్రపంచమునకు వెలుగై యుండెను. కాని ప్రపంచమాయనను తెలిసి కొనలేదు. ఆయన ఎల్లప్పుడు కృపా కార్యములనే చేసి మార్గమును వెలుగుతో నింపెను. అయినను తన అపరూప సుగుణమును, ఆత్మోపేక్షను, ఆత్మార్పణను, ధాతృత్వమును చూడవలసినదిగా తనతో కలిసి మెలసి యున్నవారిని కోరలేదు. అట్టి జీవితమును యూదులు అభినందించరైరి. ఆయన మతము వారి భక్తి ప్రమాణములకు అనుకూలంగా లేనందున దానిని మీరు వ్యర్థ మతముగా నెంచిరి. స్వభావమందుగాని, శీలమందుగాని క్రీస్తు మత వైరాగ్యము లేనివాడని వారు నిర్వచించిరి. ఏలయనగా వారి మతము డంభమునకు బహిరంగ ప్రార్థనకు, మెచ్చుకోలు కొరకు డాంభికదానములు చేయుటకు స్థానమై యుండెను. CChTel 139.1

సాత్వికమను సద్గుణము పరిశుద్ధత ఫలించు అతి ప్రశస్తఫలమై యున్నది. ఈ సద్గుణము ఆత్మలో నున్నచో దాని ప్రభావమున స్వభావము మార్పు చెందును. ఆత్మ నిత్యము దైవసేవకై వేచియుండును. చిత్తము ఆయన చిత్తమునకు లొంగియుండును. CChTel 139.2

నిజముగా దేవునితో జతపర్చబడినవారు దిన దినము ఫలించు ఫలములు ఆత్మోపేక్ష, ఆత్మార్పణ, దాతృత్వము, కనికరము, ప్రేమ, ఓరిమి, ధైర్యము, క్రైస్తవ నమ్మకము. వారి క్రియలు ప్రపంచమునకు వెల్లడి కాకపోవచ్చును. కాని వారు మాత్రము దిన దినము అవినీతితో పోరాడి శోధన, దుర్మార్గతలపై గొప్ప విజయములు సాధింతురు. నిత్యము మెళుకువగా నుండి శుద్ధ హృదయముతో ప్రార్థించుట వలన చేకూరిన బలము ద్వారా పవిత్ర ప్రమాణములు నూత్న పర్చబడి సిద్ది పొందును. ఈ నిశ్శబ్ద సేవకుల బాధకసాధకములను పైకి భక్తి కలిగిన అత్యుత్సాహి గ్రహింపజాలడు. హృదయ రహస్యముల నెరిగిన ఆయన నేత్రము దీనత్వముతోను సాత్వికముతోను, సల్పు యత్నమును గమనించి ప్రతిఫలమిచ్చును. ప్రవర్తనయందలిని నిర్మల ప్రేమను, విశ్వాస సువర్ణమును, పరీక్ష కాలమే బయలు పరచును. సంఘమును కష్టములు, క్లిష్ట సమస్యలు ఆవరించినప్పుడు క్రీస్తుని వాస్తవిక అనుచరుల ఉద్రేకము, ప్రేమ వృద్ది చెందును. CChTel 139.3

అతనితో సావాసము చేయువారందరు అతని క్రైస్తవ జీవిత సౌందర్యమును, పరిమళము గ్రహించెదరు. కాని దీనిని గూర్చి యతడెరుగడు. ఏలనగా అట్టి జీవితము అతనికి స్వాభావికమైన అలవాటు అయ్యెను. దేవుని వెలుగు కొరకతడు ప్రార్థించును. ఆ వెలు గులో నడుచుటకతడు ఆకాంక్షించును. తన పరలోక జనకుని చిత్తము నెరవేర్చుట యాతనికి అన్నపానములగును. క్రీస్తుతో దేవునియందతని జీవితము దాచబడెను. అయినను దీనిని గూర్చి యాతడు అతిశయించడు. తనయందీ మంచితనమున్నదని కూడా నాతడెరుగడు. ప్రభుని అడుగుజాడలను అనుసరించు సాత్వీకులను చూచి దేవుడు ఆనందించును. వారిచే ఆకర్షించబడి వారితో ఎక్కువ సేపు నడచుటకు దూతలు తహతహలాడెదరు. గొప్ప కార్యములను సాధించి తమ సుకృతములను ప్రజారంజకములు చేయుట యందాసక్తులై యున్న వారు వీరిని కొరగాని వారని దాటిపోవచ్చును. కాని వారిపై పరలోక దూతలు ప్రేమాపురస్సరముగ వంగి వారి చుట్టు అగ్నితో కట్టబడిన ఒకగోడ వలె నుందురు. 7SL 11-15; CChTel 139.4