Go to full page →

దైవభక్తికి దోహదమిచ్చు వస్త్రములను ధరించుకొనుడి CChTel 168

వస్త్రము విషయములో నెల్లరు శుబ్రముగాను, క్రమముగా నుండుట నేర్చుకొనవలెను. దేవాలయమునకు సమంజసముకాని బాహ్యాలంకరణలలో నిమగ్నులు కారాదు. డాంభీకపు దుస్తులు ధరించరాదు. అవి అమర్యాదను ప్రోత్సహించును. తరుచుగా ప్రజలు ఆడంబరమగు ఆయా దుస్తులను లేక వస్త్రములను కొనవలెనని మోజు పడెదరు ఇట్లు ఆరాధికుల హృదయమున చొరరాని తలంపులు చొరబడును. మన తలంపులన్నియు దేవునిపై నిలుపవలెను. ఆయన పూజనీయుడు; గంభీరమైన పవిత్రమైన ఆరాధన నుండి మనస్సును ఆకర్షించు ఏదైనను ఆయనకు అపరాధమగును. CChTel 168.4

బైబిలు కట్టడ ననుసరించి వస్త్రములను గూర్చిన విషయములన్నింటియందు మనము జాగ్రత్తగా నుండవలెను. ఫేషన్ బాహ్య ప్రపంచమును పాలించు దేవత, తరచు ఆ దేవి సంఘమందు యుక్తి యుతముగా ప్రవేశించును. సంఘము దైవ వాక్యముచే తన ప్రామాణ్యముగా గైకొనవలెను. ఈ యంశముపై తల్లిదండ్రులు వివేకముగా ఆలోచించవలెను. ప్రపంచపు ఫేషనులను తమ బిడ్డ లవలంభించుచున్నట్లు వారు కనుగొనుచో అబ్రహాము వలె వారు పట్టుదల కలిగి తమ గృహమును దైవాజ్ఞల ప్రకారము నడువవలెను. ప్రపంచముతో జతపర్చుటకు బదులు తల్లిదండ్రులు తమ బిడ్డలను దేవునితో జతపర్చవలెను. డాంబిక వస్త్రములతో దైవ మందిరమును ఎవరును అగౌరపరచరాదు. దేవుడును దేవదూతలును అక్కడ నున్నారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు తన అపోస్తలుని ద్వారా ఇట్లు సెలవిచ్చెను. “జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును వెలుపటి యలంకారము మీకు అలంకారముగా నుండక సాధువైనటిట్టయు మృధువైనట్టియునైన గుణమును అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా నుండవలెను? అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది.”(1 పేతురు 3:3,4. )85T199, 500. CChTel 169.1