Go to full page →

4వ అధ్యాయం - పాపపు ఒప్పుకోలు SCTel 29

“అతిక్రవువులను దాచి పెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ‘’(సామె28:13). SCTel 29.1

దేవుని కనికరము పొందడానికి గల షరతులు సామాన్యమేనైవి., న్యాయమైనవి, హేతుబద్దమైనవి. పాప క్షమాపణ పొందడానికి ఏదో కఠోరకర్మ ఆచరించాల్సిందిగా దేవుడు మనల్ని కోరడంలేదు. ఆయాసకరమైన తీర్ధయాత్రలు లేదా బాధాకరమైన తపస్సులు చేసి మన ఆత్మల్ని దేవునికి సమర్పించుకోవాలనిగాని, మన పాపాలకి ప్రాయశిత్తం చేసుకోవాలని గాని దేవుడు కోరడంలేదు. అయితే తన పాపాల్ని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టే వ్యక్తి కనికరం పొందుతాడు. SCTel 29.2

అపాస్తులుడు ఇలా హితవు పలుకుతున్నాడు: “మీ పాపములను ఒకనినొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు నొకరు ప్రార్ధన చేయుడి” (యాకోబు 5:16). మీ పాపాల్ని దేవునితో ఒప్పుకొనుడి. ఆయన మాత్రమే పాపాలను క్షమించగలడు. మీ పొరపాట్లు ఒకరితో నొకరు ఒప్పుకోండి. మీ SCTel 29.3

స్నేహితుణ్ణిగాని, పొరుగువాణి నొప్పిస్తే, మీరు ఆ పొరపాటు ఒప్పుకోవాలి. ఏ అభ్యంతరమూ లేకుండా ఆ వ్యక్తి మిమ్మల్ని క్షమించటం తన విధ్యుక్త ధర్మం. అప్పుడు మీరు దేవునిని వేడుకోవాలి. ఎందుకంటే, మీరు నొప్పించిన ఆవ్యక్తి దేవుని సొత్తు; అతనిని బాధపెట్టడం వల్ల అతడి రక్షకుడు సృష్టికర్త అయిన దేవునికి వ్యతిరేకముగా మీరు పాపము చేసినవారయ్యారు. ఈ విషయం మన ఏకైక , యదార్ధ మధ్యవర్తి, గొప్ప ప్రధాన యాజకుడు అయిన యేసు ముందుకు వస్తుంది. ‘’సమస్త విషయములలోను మన వలెనే శోధింపబడినను ఆయన పాపములేనివాడిగా ఉండెను” (హెబ్రీ4:15); ఆయనప్రతీ పాపపుడాగునూ శుభ్రపర్చగల సమర్ధడు. SCTel 29.4

తన అపరాధాన్ని దేవునితో ఒప్పుకోవడానికి వినయముగా ఆయన ముందుకు వెళ్ళనివారు దేవునిచే అంగీకారానికి మొదటి షరతును ఇంకా నెరవేర్చలేదు. మనం పశ్చాత్తాపాన్ని పొందకుండా దీని మనస్సుతోను, విరిగి నలిగిన హృదయముతోను, మన దుర్నీతిని ద్వేషించి, మన పాపాలు ఒప్పుకోకపోయినట్లయితే, మనం నిజంగా పాప క్షమాపణను కోరడంలేదు. మనంఅన్వేషించకపోతే దేవుని సమాధానం మనకు లభించదు. గత పాపాలకి మనకు క్షమాపణ లేకపోవడానికి కారణం మన సత్య వాక్యం విధించే షరతుల్ని దీని మనస్సుతో నెరవేర్చడమే. ఈ సందర్భంగా అతి స్పష్టమైన్ల ఉపదేశం మనకుంది. పావపు ఒప్పుకోలు, అది బహిరంగ పాపమైనా, వ్యక్తిగత పాపమైనా హృదయపూర్వకమైనదై ఉండాలి. అది స్వేచ్ఛగా ప్రకటితమవ్వాలంటే, అది విజ్ఞప్తి చేసినందువల్ల పాపి నుంచి వచ్చే ఒప్పుకోలు కాకూడదు. అమర్యాదగా, అజాగ్రత్తగా లేదా పాపం హేయమైందన్న స్పృహలేని వారి ఒత్తిడి ఫలితంగా వచ్చే ఒప్పుకోలు కాకూడదు. అంతరాత్మలోని ఉద్వేగాన్ని వెలిబుచ్చే ఒప్పుకోలు అనంత దయానిధి అయిన దేవుని వద్దకు వెళ్తుంది. “విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును” (కీర్తనలు 34:18) అంటున్నాడు కీర్తనకారుడు. SCTel 30.1

యధార్ధమైన ఒప్పుకోలు ఖచ్చితముగా ఉంటుంది. పాపాల్ని నిర్దేశించి ఒప్పుకొంటుంది. అవి దేవుని ముందుకు మాత్రమే తేదగిన పాపాలు కావచ్చు; అవి తమవల్ల బాధకు గురయిన వ్యక్తులతో ఒప్పుకోలు దోషాలు కావచ్చు. ఏది ఏమైనా ఒప్పుకోలు ఖచ్చితముగా, నిర్దిష్టంగా ఉండి మీరు ఏ పాపాలైతే చేసారో, వాటిని ఒప్పుకోవాలి. SCTel 30.2

సముయేలు దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచిపెట్టి తిరిగారు. పాప పర్యవసానాన్ని అనుభవిస్తున్నారు. ఎందుకంటే వారు దేవునియందు విశ్వాసాన్ని కోల్పోయారు. ఆయన శక్తిని, తమ రాజ్యాన్ని పాలించడానికి ఆయన వివేకాన్ని గూర్చిన అవగాహన శక్తిని వారు కోల్పోయారు. తన త్యాగాన్ని రుజువు పర్చి, దాన్ని పరిరక్షించేందుకు ఆయన శక్తిపై విశ్వాసాన్ని కోల్పోయారు. విశ్వపరిపాలకుడైన ఆయనను ప్రక్కకుపెట్టి తమ చుట్టూ ఉన్న రాజ్యాలవలే పరిపాలించబడాలని వారు తహతహలాడారు. వారికి శాంతి చేకూరకముందు ఖచ్చితమైన ఈ ఒప్పుకోలును ఆ ప్రజలు చేసారు. ‘’రాజును నియమించమని మేము అడుగుట చేత పాపములన్నిటిని మించినకీడుమేముచేసితిమి” (1సమూ12:19). ఏ పాపము నిమిత్తము దోషులయ్యారో దాన్ని వారు ఒప్పుకోవలసి ఉన్నారు. వారికృతజ్ఞత తమను వేధించి దేవునినుంచి వారిని వేరు చేసింది. SCTel 30.3

యధార్ధ పశ్చాత్తాపము, దిద్దుబాటులేని పాపపు ఒప్పుకోలు దేవునికి సమ్మతం కదు. జీవితములో ఖచ్చితమైన మార్పులు కలగటం అవసరం. దేవునికి హేయమెన్ల సమస్తాన్ని త్యజించాలి. పావంపట్ల నిజమైన సంతాప పర్యవసానమిదీ మన భాగంగా మనం చేయాల్సిందేమిటో మనముందు ఉంచబడింది: “మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి. మేలు చేయుట నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసింప బడినవారిని విడిపించుడి. తండ్రిలేనివారికి న్యాయము తీర్చుడి., విధవరాలి పక్షముగా వాదించుడి “(యెషయ 1:16, 17). “కుదువ సొమ్మును మరలా అప్పగించుచు, తాను దొంగిలించిన దానిని మరల ఇచ్చవేసి పాపము జరిగింపకయుండి, జీవాధారములగు కట్టడలను అనుసరించిన యెడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును” (యెషయ33:15). పశ్చాత్తాపం గురించి ప్రస్తావిస్తూ పాలు ఇలా అంటున్నాడు, “మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఖ:ము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకెన్లో ప్రతి వాదమును ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను, మీలో పుట్టించెనో చూడుడి. ఆకార్యమునుగూర్చి సమస్తవిషయములలోను మీరు నిర్దోషులైవున్నారని ఋజువు పరుచుకొంటిరి” (2కొరింథి 7:11). SCTel 31.1

పాపం నెత్తిక గ్రహణ శక్తిని మొద్దుబారినప్పుడు అపరాధి తన ప్రవర్తనలోని లోపాల్ని గ్రహించలేడు. తాను చేసి దుష్క్రియ నీచత్వాన్ని గుర్తించలేడు. చెత్తన్య పర్చే పరిశుద్దాత్మ శక్తికి తావిస్తేనే తప్ప అతడు తన పాపం పట్ల పాక్షికంగా అంధుడవుతాడు. తన ఒప్పుకోల్ళు యధార్ధమైనవి కావు. ప్రతీ ఒప్పుకోలుతో సమర్ధన ఒకటి జోడిస్తాడు. కొన్ని పరిస్థితులను బట్టి తాను అలా వ్యవహరించాల్సి వచ్చిందని, లేకపోతే అలా వ్యవహరించి ఉండేవాణ్ణి కాదని అంటాడు. SCTel 31.2

దేవుడు తినకూడదన్న పండును ఆదామవ్వలు తిన్న తరువాత వారిలో సిగ్గు, భయాందోళనలు చోటుచేసుకున్నాయి. వారి మొదటి తలంపు తమ పాపాల్ని సమర్థించుకుని వెన్నులో చలి పుట్టించే మరణ శాసనాన్ని ఎలా తప్పించుకోవల్నదే. తమ పాపం గురించి దేవుడు ఆరాతీసినప్పుడు ఆ అపరాధానికి పాక్షికంగా దేవునిని తన జీవిత భాగస్వామిని నిందిస్తూ ఆదాము సమాధానం చెప్పాడు.” నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిని” ఆమె సర్పంపై నిందమోపుతూ ఇంకను ఇలాఅన్నది “సర్పము నన్ను మోసపుచ్చినందున నేను ఆంటిని’‘ SCTel 31.3

(ఆది 3:12),13). నీవు సర్పాన్ని ఎందుకు చేసావు? ఆ సర్పాన్ని ఏదేనులోనికి ఎందుకు రానిచ్చావు? ఆమె సమాధానంలో ధ్వనించే ప్రశ్నలివి. ఇలా తమ పాపానికి బాధ్యుడు దేవుడే అని పరోక్షంగా అవ్వనిందించింది. స్వయంకృత అపరాధాల్ని సమర్ధించుకునే స్వభావం అబద్దాలకు జనకుడితో ఆరంభమై ఆదాము కుమారులు కుమార్తెల్లో పునరావృత్తమౌతూవుంది. ఈ రకమైన ఒప్పుకోళ్ళు దైవాత్వ ప్రేరణవల్ల కలిగేవికావు. దేవుడు వీటిని అంగీకరించడు. అసలు సిసలు పశ్చాత్తాపము. దోషి తన దోషానికి బాధ్యతను తానే వహించి మోసంగాని, వేషధారణగాని లేకుండా ఆ దోషాన్ని ఒప్పుకునేటట్లు చేస్తుంది. ఆకాశం వైపుకు కన్నులు ఎత్తడానికికూడ ధైర్యం చాలక సుంకరివలే అతడు “దేవా, పాపినైన నన్ను కరుణించుము” అని విలపిస్తాడు. తమ దోషాల్ని ఒప్పుకునే వారు నీతి మంతులుగా తీర్పు పొందుతారు. కారణమేంటంటే, పశ్చాత్తాపపడిన వ్యక్తి పక్షంగా యేసు తన రక్త సాక్షిగా విజ్ఞాపన చేస్తాడు. SCTel 32.1

నిజమైన పశ్చాత్తాపానికి, దీన స్వభావానికి దైవ వాక్యంలో ఉన్న ఉదాహరణలు, పాపం చేయడానికి గాని స్వీయ దోష సమర్ధన ప్రయత్నానికి గాని సాకుకు తావులే నీ ఒప్పుకోలు మనస్తాత్వాన్ని బయలు పర్చుతున్నాయి. పౌలు తన్నుతాను కాపాడు కోవడానికి ప్రయత్నించలేదు; తనకుతాను అతి నగ్నంగా చిత్రీకరించు కొన్నాడు. తన దోషం స్వల్పమైందిగా చూపించుకునే ప్రయత్ననం అసలు లేదు. నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది, పరిశుద్ధులను, అనేకులను చెరసాలలో వేసి, వారిని చంపి నప్పుడు SCTel 32.2

సమ్మతించితిని; అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవ దూషణ చేయునట్లు బలవంత పెట్ట జూచితిని. మరియు వారిమీద మిక్కిలి క్రోధముగల వాడనే ఇతర పట్టణములకును వెళ్ళి వారిని హింసించుచుంటిని. “(అ.కా. 26:10,11)” పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అట్టివారిలో నేను ప్రధముడను. “(1తిమోతి 1:15) అని చాటుకోవడానికి పౌలు వెనుకాడలేదు. SCTel 32.3

వాస్తవిక పశ్చాత్తాపం మూలంగా విరిగి నలిగిన దీనమైన హృదయం దేవుని ప్రేమను కల్వరి చెల్లించిన మూల్యాన్ని కొంతమేరకు అభినంధించగలుగుతుంది. ప్రేమానురాగాలు గల తండ్రితో ఒక కుమారుడు ఎలా ఒప్పుకుంటాడో, అలాగే నిజమైన పశ్చాత్తాపం పొందిన పాపి తన పాపాలన్నిటిని దేవుని ముందుపెడతాడు. వాక్యం ఇలా చెబుతుంది,” వున పాపాలను మునము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును, నీతిమంతుడను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. (1యోహాను 1:9). SCTel 32.4