Go to full page →

సాక్షులు ChSTel 11

మనం క్రీస్తు సాక్షులం. లౌకికాసక్తులు ప్రణాళికలు మన సమయాన్ని గమనాన్ని ఆక్రమించటానికి చోటివ్వకూడదు. టెస్టిమొనీస్, సం.9, పులు 53,54. ChSTel 11.3

“మీరు నాకు సాక్షులు అంటున్నాడు ప్రభువు... మీ మధ్య అన్యదేవతలు లేనప్పుడు, నేను మీకు ప్రకటించి, మిమ్మల్ని రక్షించి మీకు కనపర్చుకుంటున్నాను. కనుక మీరు నాకు సాక్షలు”. “గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడినవారిని చెరసాలలో నుంచి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీ గృహములోనుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేను నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను.” ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 10. ChSTel 11.4

లోక ప్రజలు అబద్ద దేవుళ్ళను పూజిస్తున్నారు. వారిని తమ తప్పుడు ఆరాధన నుంచి మళ్ళించాలి. ఆ పని వారి దేవుళ్ళను తెగడటం ద్వారా కాదు, వారికి మెరుగైన మార్గాన్ని చూపించటం ద్వారా చెయ్యాలి. దేవుని మంచితనాన్ని వెల్లడించాలి. “నేనే దేవుడను అనటానికి మీరే నాకు సాక్ష్యులు అని ప్రభువంటున్నాడు”. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 299. ChSTel 11.5

దేవుని పరిశుద్ద పట్టణంలో ప్రవేశించేవారందరు తమ ఇహలోక జీవితంలో తమ వ్యవహారాల్లో క్రీస్తుని ముందుంచాలి. వారిని క్రీస్తు దూతలుగా ఆయన సాక్షులుగా చేసేది ఇదే. లోక పాపాల్ని మోసుకుపోయే దేవుని గొర్రెపిల్లను పాపులకు చూపిస్తూ వారు సమస్త దురాచారాలకు వ్యతిరేకంగా స్పష్టమైన సాక్ష్యం ఇవ్వాలి. టెస్టిమొనీస్, సం. 9, పు. 23. ChSTel 12.1

ఆయనను గూర్చి తాము చూసిన వాటిని విన్నవాటిని లోకానికి ప్రకటించటానికి శిష్యులు క్రీస్తు సాక్ష్యులుగా లోకంలోకి వెళ్లాల్సిఉన్నారు. మానవులు ఆక్రమించే స్థానాలన్నిటిలో వారిది అతి ప్రాముఖ్యమైన స్థానం. అది క్రీస్తు స్థానానికి మాత్రమే రెండోది. మానవ రక్షణ సేవలో వారు దేవుని తోటి పనివారు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 19. ChSTel 12.2

బోధించటానికి, పాప చింత పుట్టించటానికి నా ఆత్మ ఒక్కడే సమర్థుడు అంటున్నాడు ఆ దివ్య బోధకుడు. బాహ్య విషయాలు మనసును తాత్కాలికంగా మాత్రమే ఆకట్టుకుంటాయి. సత్యాన్ని నేను మనస్సాక్షిపై ముద్రిస్తాను. అప్పుడు మనుషులు లోకమంతట నాకు సాక్షులుగా ఉండి, మానవుడి సమయం మానవుడి ద్రవ్యం మానవుడి ప్రజ్ఞావివేకాల పై నా హక్కుల్ని గూర్చి నొక్కిపలుకుతారు. టెస్టిమొనీస్, సం. 7, పు. 159. ChSTel 12.3

క్రీస్తును లోకానికి వెల్లడించటానికి దేవుడు ఎంచుకున్న సాధనం ఆయన విశ్వసనీయతను గూర్చిన మన సాక్ష్యమే. పూర్వం పరిశుద్దుల ద్వారా వెల్లడైన ఆయన కృపను మనం గుర్తించాల్సి ఉంది. అయినా మిక్కిలి శక్తిమంతం ప్రభావాన్వితం అయినది మన సొంత అనుభవసాక్ష్యమే. మనలో పనిచేసే దైవశక్తిని కనపర్చినప్పుడు మనం దేవునికి సాక్షులం. ప్రతీ వ్యక్తి జీవితం ఇతరులందరి జీవితం కన్నా వేరుగా ఉంటుంది. అతడి అనుభవం ఇతరుల అనుభవంకన్నా వేరుగా ఉంటుంది. మన స్తుతి మన సొంత వ్యక్తిత్వంతో తనను చేరాలని ఆయన కోరుతున్నాడు. ఆయన కృపా మహిమస్తుతికి ఈ ప్రశస్త గుర్తింపులు, క్రీస్తును పోలిన జీవితం మద్దత్తు ఉన్నప్పుడు, అవి ప్రతిఘటించలేని శక్తిగా మారి ఆత్మల రక్షణకు కృషికి తోడ్పడతాయి. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 347. ChSTel 12.4

తనకు సాక్షులు లోకమంతా చెదరి ఉండకపోతే, తన చిత్రాన్ని గూర్చిన జ్ఞానాన్ని, తనను విశ్వసించని లోకం నడుమ తన కృపను గూర్చిన వింతలు ఆశ్చర్యకార్యాల్ని దేవుడు ప్రదర్శించలేడు. యేసు క్రీస్తు ద్వారా ఈగొప్ప రక్షణలో పాలుపంపులు గలవారు మిషనెరీలుగా, ప్రపంచమంతా వెలిగే జ్యోతులుగా, ప్రజలకు సూచనలుగా, మనుషులు చదివి తెలుసుకునేందుకు పత్రికలుగా ఉండాలని, రక్షకునిరాక సమీపంగా ఉన్నదని, వారు పొందిన దైవ కృప వ్యర్దం కాలేదని వారి విశ్వాసం క్రియలు సూచించాలని ఆయన సంకల్పం. వస్తున్న తీర్పుకు సిద్దంగా ఉండాలని ప్రజల్ని హెచ్చరించాల్సి ఉంది. టెస్టిమొనీస్, సం.2, పులు. 631, 632. ChSTel 12.5

వారు (శిష్యులు) ఆయన పవిత్ర, పరిశుద్ధ జీవితాన్ని ధ్యానించినప్పుడు, ఆయన ప్రవర్తన సౌందర్యాన్ని తమ జీవితాల్లో చూపిస్తూ సాక్ష్యమివ్వగలిగితే, తాము చేసే ఏ శ్రమా గొప్ప శ్రమ కాబోదని తాము చేసే ఏ త్యాగం గొప్ప త్యాగం కాబోదని భావించారు. తమ గత మూడు సంవత్సరాలు తిరిగి నివసించగలిగి ఉంటే ఎంత వ్యత్యాసంగా నడుచు కుందుము! అని తలపోసుకున్నారు. తాము ప్రభువుని మళ్లీ చూడగలిగి ఉంటే, ఆయన్ని ఎంతగాఢంగా ప్రేమించారో చూపించటానికి వారు ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తారు! ఒక్క అపనమ్మకపు మాట, ఒక్క అపనమ్మకపు చర్య ద్వారా ఆయనకు దుఃఖం కలిగినందుకు ఎంత యదార్ధంగా పశ్చాత్తాపపడతారు! అయితే ప్రభువు తమను క్షమించాడన్న తలంపుతో వారు ఓదార్పు పొందారు. లోకం ముందు ఆయన్ని తమ రక్షకుడుగా ఒప్పుకుంటూ సాక్ష్యమివ్వటం ద్వారా తమ అపనమ్మకానికి సాధ్యమైనంత మేరకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని కృతనిశ్చయులయ్యారు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 36. ChSTel 13.1

దురాత్మల పీడ నుంచి తాను పునరుద్దరించిన ఇద్దరినీ సువార్త ప్రకటించటానికి మొట్టమొదటి మిషనెరీలుగా క్రీస్తు దెకపొలికి పంపాడు. కొద్ది క్షణాలు మాత్రమే క్రీస్తు బోధను వినేభాగ్యం ఈ మనుషులికి కలిగింది. ఆయన పెదాలనుంచి వెలువడ్డ ఒక్క ప్రసంగాన్ని కూడా వినే తరుణం వారికి దొరకలేదు. ప్రతి దినం క్రీస్తుతో ఉన్న శిష్యుల్లాగ వారు ప్రజలకు బోధించలేకపోయారు. కాని యేసే మెస్సీయా అని చాటిచెప్పే నిదర్శనాల్ని తమ శరీరాల్లో ధరించారు. క్రీస్తు శక్తిని గూర్చి తమకు ఏది తెలుసో, ఏది తాము చూశారో, ఏది విన్నారో, ఏది అనుభవించారో దాన్ని వారు చెప్పగలిగారు. దేవుని కృపా స్పర్శను అనుభవించిన ప్రతీవారు చెయ్యగలిగింది చెయ్యాల్సింది ఇదే. క్రీస్తు అనుంగు శిష్యుడు యోహాను ఇలా అంటున్నాడు, “జీవవాక్యమును గూర్చినది, ఆది నుంచి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిధానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము.” క్రీస్తుకి సాక్షులుగా మనకు ఏది తెలుసో, ఏది మనం చూశామో ఏది విన్నామో ఏది అనుభవించామో దాన్ని మనం ఇతరులికి చెప్పాలి. ప్రతీ అడుగున మనం క్రీస్తుని వెంబడిస్తుంటే, ఆయన మనల్ని నడిపిస్తున్న రీతిని గురించి ఖచ్చితంగా వివరంగా చెప్పటానికి మనకు ఎంతో ఉంటుంది. ఆయన వాగ్దానాల్ని పరీక్షించామని అవి వాస్తవంగా ఉన్నట్లు కనుగొన్నామని మనం చెప్పవచ్చు. క్రీస్తు కృపను గురించి మనకు తెలిసిన దాన్ని గురించి సాక్ష్యమివ్వవచ్చు. మన ప్రభువు మననుంచి కోరుతున్నది ఈ సాక్ష్యమే. ఇలాంటి సాక్ష్యం లేనందువల్ల లోకం నశించిపోతున్నది. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 340. ChSTel 13.2

వెలుగుకు దీవెనలకు మార్గాలు ChSTel 14

పరలోక జీవితం మన ద్వారా ఇతరులకి ప్రవహించటానికి మనం ప్రతిష్ఠిత మార్గాలుగా ఉండాలి. పరిశుద్దాత్మ హృదయాల్ని శుద్దీకరించి, పటిష్టం చేసి, సర్వసంఘాన్ని చైతన్యంవంతం చేసి, విస్తరింపజేయ్యాల్సి ఉంది. టెస్టిమొనీస్, సం. 9, పు. 20. ChSTel 14.1

యేసు అనుచరుడైన ప్రతీవ్యక్తి కుటుంబంలో, ఇరుగుపొరుగు కుటుంబాల్లో, తాను నివసించే పట్టణం లేక నగరంలో క్రీస్తు మిషనెరీగా చేయాల్సిన పని ఉంది. దేవునికి ప్రతిష్టించుకున్న వారందరు వెలుగును ప్రసరించే సాధనాలు. సత్యపు వెలుగును ఇతరులికి ప్రకాశింపజేయ్యటానికి దేవుడు వారిని నీతి సాధనాలుగా చేస్తాడు. టెస్టిమొనీస్, సం. 2, పు. 632. ChSTel 14.2

అలసిపోయి ఆకలిగా ఆ బావివద్ద ఉన్నయేసు చేసిన సేవ ఫలితంగా కలిగిన ఆశీర్వాదం ఆ ప్రాంతమంతటా వ్యాపించింది. ఆయన సహాయం చెయ్యటానికి ప్రయత్నించిన ఆ ఒక్క వ్యక్తి ఇతరుల్ని చేరటానికి వారిని రక్షకుని వద్దకు తేవటానికి సాధనమయ్యింది. లోకంలో దేవుని సేవ పురోగమించే మార్గం ఎల్లప్పుడూ ఇదే. మా వెలుగు ప్రకాశింపనివ్వండి. అది ఇతరుల దీపాల్ని వెలిగిస్తుంది. గాస్పుల్ వర్కర్స్ పు. 195. ChSTel 14.3

లోకంలో ఆయన అనుచరులుగా గుర్తింపు ఉన్న వారితో సంబంధం లేకుండా తమ వెలుగుకి తామే క్రీస్తుకి బాధ్యులమన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. యేసు పాపులకు మిత్రుడు. వారి దు:ఖబాధలు ఆయన హృదయాన్ని చలింపజేస్తాయి. ఇహపరలోకాల్లో ఆయన సర్వశక్తి మంతుడు అయినా మానవ వికాసానికి రక్షణకు తాను నియమించిన ప్రతినిధుల్ని మన్నిస్తాడు. లోకానికి వెలుగు ప్రసరింపజెయ్యటానికి తాను ఏర్పర్చిన సాధనమైన సంఘం వద్దకు పాపుల్ని నడిపిస్తాడుది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 122. ChSTel 15.1

తొలినాళ్ల సంఘానికి నిత్యం విస్తరిస్తున్న సేవను ఆయన అప్పగించాడు. అది వెలుగు కేంద్రాల్ని స్థాపించి, క్రీస్తు సేవకు తమను తాము ప్రతిష్టించుకోటానికి ఎవరు సమ్మతంగా ఉంటారో వారికి ఆశీర్వాదంగా ఉండటమన్న సేవ. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 90. ChSTel 15.2

సూర్యకిరణాలు భూగోళం మారు మూలల్లోకి ఎలా చొచ్చుకు పోతాయో అలాగే లోకంలోని ప్రతీ ఆత్మకూ సువార్త వెలుగు అందాలన్నది దేవుని సంకల్పం. క్రీస్తు సంఘం మన ప్రభువు సంకల్పాల్ని నెరవేర్చగోరుతుంటే, చీకటిలో మరణ ఛాయ ముసిరే భూభాగంలో కూర్చున్న వారందరిపై వెలుగు ప్రకాశింపజేస్తుంది. తాట్స్ ఫ్రమ్ ది మౌంట్ ఆఫ్ బ్లెస్సింగ్, పు. 42. ChSTel 15.3

తన కృపా సంపదను, శోధింప శక్యంకాని క్రీస్తు ఐశ్వర్యాన్ని దేవుడు తన ద్వారా లోకానికి ప్రసరింపజెయ్యటానికి ఓ సజీవ సాధనంగా నివసించడం ప్రతి ఆత్మకూ ఉన్న ఆధిక్యత. తన ఆత్మను ప్రవర్తనను లోకానికి సూచించే ప్రతినిధుల్ని ఆకాంక్షిస్తున్నంతగా మరి దేనిని క్రీస్తు ఆకాంక్షిచటం లేదు. మానవుల ద్వారా రక్షకుని (ప్రేమ ప్రదర్శన అవసరమైనంతగా లోకానికి అవసరమయ్యింది వేరొకటి లేదు. మానవ హృదయాలకి ఆనందాన్ని ఆశీర్వాదాన్ని కలిగించే పరిశుద్ధ తైలం ప్రవహించేందుకు మానవ సాధనాలకోసం పరలోకమంతా ఎదురుచూస్తున్నది. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 419. ChSTel 15.4

దైవ సంఘ మహిమ దాని సభ్యుల భక్తి ప్రపత్తుల్లో ఉంటుంది. ఎందుకంటే క్రీస్తు శక్తి అందులోనే దాగి ఉంటుంది. నిజాయితీ గల దేవుని బిడ్డల పలుకుబడి ఏమంత విలువగలదిగా పరిగణన పొందకపోవచ్చును. కాని కాలం పొడుగునా దాని ప్రభావం ప్రజల మీద పడుతూనే ఉంటుంది. ప్రతిఫలం కలిగే దినాన అది సరిగా వెల్లడవుతుంది. స్థిరమైన దైవభక్తిలో అచంచలమైన విశ్వాసంలో ప్రకాశించే యధార్థ క్రైస్తవవుడి వెలుగు జీవంగల రక్షకుని శక్తిని లోకానికి నిరూపిస్తుంది. తన అనుచరుల్లో క్రీస్తు నిత్య జీవపు ఊటగల బావిలా వెల్లడవుతాడు. లోకం వారిని ఎరుగకపోయినా వారు దేవుని ప్రతిష్టిత జనంగా, రక్షణకు ఎంపికైన పాత్రలుగా, లోకానికి ఆయన వెలుగు ప్రసారసాధనాలుగా గుర్తింపు పొందుతారు. రివ్యూ అండ్ హెరాల్డ్, మార్చి 24,1891. ChSTel 16.1

సంవు సభ్యులారా, మా వెలుగు ప్రకాశింపజెయ్యండి. అమితానుభవానికి, ఈలోక వినోదాల బుద్దిహీనతకు వ్యతిరేకంగా, ఈ కాలానికి దేవుడు ఉద్దేశించిన సత్యాన్ని ప్రకటించటంలో వినయప్రార్థనలో, మీ స్వరాల్ని వినిపించండి. మీ స్వరాలు, మీ ప్రభావం, మా సమయం - ఇవన్నీ దేవుడు మాకిచ్చిన వరాలు. క్రీస్తుకు ఆత్మల్ని రక్షించటానికి వాటిని ఉపయోగించాలి. టెస్టిమొనీస్, సం.9, పు. 38.. ChSTel 16.2

ఈ లోకంలో క్రీస్తు శిష్యులు ఆయన ప్రతినిధులని, ఈ లోకంలోని నైతిక చీకటిలోని పట్టణాలు గ్రామాలు నగరాల్లో, దేశంలో అన్ని చోట్ల, వారు వెలుగు విరజిమ్మే దీపాలుగాను “లోకమునకును దేవతలకును మనుష్యులకును వేడుకగా (దృశ్యముగా)” ఉండాలన్నది దేవుని ఉద్దేశమని దర్శనంలో చూశాను. టెస్టిమొనీస్, సం. 2, 631. ChSTel 16.3

క్రీస్తు అనుచరులు లోకానికి వెలుగై ఉండాలి. అయితే ప్రకాశించటానికి ప్రయత్నించమని వారిని దేవుడు ఆదేశించటం లేదు. అతిమంచితనాన్ని ప్రదర్శించుకునేందుకు ఎలాంటి స్వార్ధప్రయత్నం ఆయనకు ఆమోదం కాదు. వారి ఆత్మలు పరలోక నియమాలతో నిండి ఉండాలి. అప్పుడు వారు తమలో ఉన్న వెలుగును లోకంతో తమ సంబంధాల్లో ప్రదర్శిస్తారు. జీవిత ప్రతిచర్యలో వారి విశ్వసనీయత చైతన్య పర్చే సాధనమౌతుంది. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 36. ChSTel 16.4

గుడ్డి వాడై అపరాధం దురభిమానంతో ఉన్న సౌలుకి తాను హింసిస్తున్న క్రీస్తు ప్రత్యక్షత కలిగినప్పుడు అతడు లోకానికి వెలుగైన సంఘంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండటానికి ఏర్పాటయ్యింది. ఈ సందర్భంలో అననీయ క్రీస్తుని క్రీస్తు స్థానంలో వ్యవహరించటానికి నియుక్తులైన వాక్య సేవకుల్ని సూచిస్తున్నాడు. సౌలుకు దృష్టికలిగేందుకు అననీయ సౌలు కళ్లని క్రీస్తు స్థానంలో స్పృశించాడు. క్రీస్తు స్థానంలో సౌలు పై చేతులుంచాడు. అతడు క్రీస్తు నామంలో ప్రార్థన చేసినప్పుడు సౌలు పరిశుద్దాత్మను పొందాడు. ఇదంతా క్రీస్తు నామంలో క్రీస్తు అధికారంవల్ల జరిగింది. క్రీస్తు పునాది. సంఘం సంప్రదింపుల సాధనం. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 122. ChSTel 17.1

దోషం అన్ని చోట్ల ప్రబలుతున్నది. అపవాది తన శక్తుల్ని సంఘటిత పర్చుకుంటున్నాడు. న్యాయంగా కనిపించే అపరాధాలతో మనుషుల మనసుల్ని గలిబిలి పర్చి వారి ఆత్మల్ని నాశనం చెయ్యటానికి ప్రతీ ఉపాయాన్ని ఆచరణలో పెడాడు. దేవుడు తన సత్యసిరులని ఎవరికి అప్పగించాడో వారు తమ వెలుగును నైతిక అంధకారంలో ప్రకాశింపజెయ్యాలి. హిస్టాలికల్ స్కెచ్చేస్, పు. 290. ChSTel 17.2

తన ప్రజలు లోకంలో జ్యోతుల్లా ప్రకాశించాలని దేవుడు కోరుతున్నాడు. ఇది వాక్యపరిచారకులే కాదు క్రీస్తు ప్రతీ శిష్యుడూ చెయ్యాలి. వారి సంభాషణ పరిశుద్దం పారలౌకికం అయి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉంటూ, తమ హృదయాల్ని చైతన్యపర్చే దేవుని ప్రేమను తమ మాటలు కార్యాల ద్వారా వ్యక్తం చెయ్యటానికి వారు తమ తోటి మనుష్యులతో సంబంధం కలిగి ఉంటారు. ఈ విధంగా వారు లోకంలో జ్యోతులై ఉంటారు. వారి ద్వారా ప్రసారమయ్యే వెలుగు ఆరిపోదు. దాన్ని ఎవరూ తీసివెయ్యలేరు. టెస్టిమొనీస్, సం. 2, పులు. 122, 123. ChSTel 17.3

ప్రభువు తన సంఘాన్ని పరిశుద్ద ప్రభావ కోశాగారంగా నియమించాడు. సంఘ సభ్యులు తమ ద్వారా లోకానికి జీవవిద్యుత్తు ప్రవహించే సాధనాలవ్వటానికి, వారి ద్వారా అనేకులు క్రీస్తు విశ్వాసులుగా మారటానికి, ప్రభువు ద్రాక్షతోటలోని ఎడారిభాగాలికి క్రీస్తు కృప ప్రవహించేందుకు వీరు తిరిగి సాధనాలవ్వటానికి పరలోక విశ్వం కని పెడుతున్నది. బైబిల్ ఎకో, ఆగ. 12, 1901. ChSTel 17.4

దేవునితో సంబంధమున్న ప్రతీవారు ఇతరులకి వెలుగు అందిస్తారు. ఇచ్చేందుకు ఎవరికైనా వెలుగులేకపోతే దానికి కారణం వెలుగు మూలంతో వారికి సంబంధం లేకపోటమే. హిస్టారికల్ స్కెచ్చేస్, పు. 291. ChSTel 18.1

దేవుడు ఇతరులకి వెలుగు నివ్వటానికి తన బిడ్డల్ని నియమించాడు. వారు విఫలులై పరిశుద్దాత్మ శక్తివల్ల తాము చెయ్యగలిగి ఉండే పనిని చెయ్యలేకపోయినందువల్ల ఆ ఆత్మలు అపరాధ అంధకారంలో మిగిలిపోతే, వారు ఆ ఆత్మల నిమిత్తం దేవునికి జవాబుదారులు. మనం క్రీస్తు గుణాతిశయాల్ని ప్రచారం చెయ్యటానికి చీకటిలో నుంచి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలవబడ్డాం. రివ్యూ అండ్ హెరాల్డ్, డిసె. 12, 1893. ChSTel 18.2

దేవునికి ప్రతిష్ఠితమైన వారందరూ వెలుగు సాధనాలుగా ఉంటారు. తన కృ పైశ్వర్యాన్ని ఇతరులకి అందించటానికి దేవుడు వారిని తన ప్రతినిధులుగా నియమిస్తాడు.... ఇతరుల పై మనం చూపే ప్రభావం మనం చెప్పే మాటల పై గాక మనం ఎలాంటి వారమో దాని పై ఆధారపడి ఉంటుంది. మనుషులు మన తర్కాన్ని ప్రతిఘటించి తోసిపుచ్చవచ్చు. మన విజ్ఞప్తుల్ని తోసిరాజనవచ్చు. కాని ప్రతిఫలం ఆశించని ప్రేమా జీవితం వారు కాదనలేని తర్కం. క్రీస్తు సాత్వీకాన్ని సంతరించుకున్న, నిలకడగల జీవితం లోకంలో ప్రబల శక్తి అవుతుంది. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పులు. 141, 142. ChSTel 18.3

లోకానికి వెలుగై ఉండవలసినవారు బలహీనమైన వెలుగును మాత్రమే ఇస్తున్నారు. వెలుగంటే ఏమిటి? వెలుగంటే దైవభక్తి, మంచితనం, సత్యం, దయ, ప్రేమ, ప్రవర్తనలోను జీవితంలోను సత్యాన్ని ప్రదర్శించటం. సువార్త తన పోరాటశక్తికి విశ్వాసుల వ్యక్తిగత భక్తి మీద ఆధారపడి ఉంటుంది. తన కుమారుని మరణం ద్వారా ప్రతీ వ్యక్తి సత్రియలు చేస్తూ పరిశుద్ధ జీవితం జీవించటానికి దేవుడు మార్గం ఏర్పర్చాడు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడ్డ ప్రతీ ఆత్మ ఆయన గుణాతిశయాల్ని ప్రచురపర్చుతూ ప్రకాశవంతమైన వెలుగై నివసించాలి. “మేము దేవుని జత పనివారము”. ఔను, పనివారం; అనగా ప్రభువు ద్రాక్షతోటలో నమ్మకంగా పని చేసేవారం. మనం రక్షించటానికి ఆత్మలున్నాయి. అవి మన సంఘాల్లో, మన సబ్బాతు బడుల్లో మన ఇరుగు పొరుగునున్న ఆత్మలు. రివ్యూ అండ్ హెరాల్డ్, మార్చి 24, 1891. ChSTel 18.4

వారు ఇతరుల కోసం పనిచెయ్యటంలో తమ సొంత ఆత్మల్ని సజీవంగా ఉంచుకుంటారు. వారు యేసు జతపనివారవ్వటానికి సంసిద్ధంగా ఉంటే, మన సంఘాల వెలుగు క్రమ క్రమంగా ప్రకాశవంతమై, తమ హద్దుల వెలుపల ఉన్న చీకటిలోకి చొచ్చుకు పోయేందుకు కిరణాల్ని విస్తరిస్తుంది. హిస్టారికల్ స్కెచ్చేస్, పు. 291. ChSTel 19.1

“మీరు లోకమునకు వెలుగైయున్నారు.” రక్షణ భాగ్యాన్ని తమ జాతికే పరిమితం చేసుకోవాలని యూదులు భావించారు. అయితే రక్షణ సూర్యకాంతివంటిదని అది లోకమంతటికీ చెందుతుందని క్రీస్తు వారికి చూపించాడు. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 306. ChSTel 19.2

పరిశుద్దాత్మ ప్రభావానికి స్పందించే హృదయాలు తమ గుండా దేవుని ఆశీర్వాదాలు ప్రవహించటానికి సాధనాలు. దేవుని సేవించేవారూ దేవుని ఆత్మ మనుషుల మధ్యనుంచి తొలగించబడితే, ఈ లోకం నిర్మానుష్యమై నాశనానికి సాతాను ఆధిపత్యానికి మిగిలి ఉంటుంది. దుష్టులు తాము ఎరుగకపోయినప్పటికీ, ఈ జీవితంలో తామనుభవించే దీవెనలు ఈ లోకంలో తాము ద్వేషించి హింసించే దైవ ప్రజల ఉనికి కారణంగానే అన్నది నిజం. కాగా క్రైస్తవులు నామమాత్రపు క్రైస్తవులే అయితే వారు సారం కోల్పోయిన ఉప్పువంటివారు. లోకంలో వారి ప్రభావం మంచికి తోడ్పడదు. దేవునిగూర్చి తప్పుడు అభిప్రాయం కలిగించటం ద్వారా వారు అవిశ్వాసులకన్నా చెడ్డవారవుతారు. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 306. ChSTel 19.3