Go to full page →

అబ్రాహాము ఆదర్శం విలువైంది ChSTel 212

అబ్రాహాముకి వచ్చింది చిన్న పరీక్షకాదు. అతడు చేయాల్సి వచ్చింది చిన్న త్యాగం కాదు. తన దేశానికి తన బంధువులికి తన గృహానికి తనను బంధించే బంధాలు బలమైనవి. అయినా పిలుపును అంగీకరించటానికి అతడు సందేహించలేదు. వాగ్దత్త దేశం గురించి ఆ దేశం నేల సారవంతమైందా? శీతోష్ణస్థితి ఆరోగ్యదాయకమయ్యిందా? ఆ దేశ పరిసరప్రాంతాలు మంచివేనా? ధన సంపాదకు అవి అనుకూలమైనవేనా? అన్న విషయాల గురించి అతడికి ప్రశ్నలు లేవు. దేవుడు చెప్పాడు, ఆయన సేవకుడు దానికి విధేయుడయ్యాడు. తాను ఎక్కడ నివసించాలని దేవుడు కోరతాడో అదే అతడికి లోకమంతటిలోను సంతుష్టిని సంతోషాన్ని ఇచ్చే స్థలం. ChSTel 212.1

అనేకులు అబ్రాహాములా పరీక్షించబడుతున్నారు. వారు దేవుడు పరలోకం నుంచి ప్రత్యక్షంగా మాట్లాడటం వినరు. కాని తన వాక్యంలోని బోధనల ద్వారా, తన కృపనుబట్టి సంభవించే ఘటనల ద్వారా ఆయన వారిని పిలుస్తాడు. ధనం ప్రతిష్ఠ సమకూర్చే ఉద్యోగాన్ని, ఆనందకరమైన, లాభదాయకమైన స్నేహబంధాల్ని విడిచి పెట్టి, బంధుజనుల నుంచి వేరై, ఆత్మోపేక్ష, శ్రమలు, త్యాగాల మార్గాన్ని వారు అవలంబించాల్సిరావచ్చు. దేవుడు వారికోపని నియమించాడు. సుఖ జీవితం, స్నేహితులు, బంధువుల ప్రభావం ఆ కార్యసాధనకు అవసరమైన గుణగణాల అభివృద్దికి అడ్డుబండలవుతాయి. మానవ ప్రభావాల నుంచి. మానవ సహాయం నుంచి వేరై రమ్మని పిలిచి, వారికి తన్నుతాను వెల్లడిపర్చుకునేందుకు, తన సహాయం అర్థించటానికి, తనపై మాత్రమే ఆధారపడి ఉండటానికి ఆయన వారిని నడిపిస్తాడు. ChSTel 212.2

ఎవరు ప్రియమైన ప్రణాళికల్ని స్నేహాల్ని విడిచి పెట్టి దేవుడిచ్చే పిలుపును అంగీకరించటానికి సిద్దంగా ఉంటారు? ఎవరు నూతన విధుల్ని నిర్వహించటానికి నూతన స్థలాల్లో ప్రవేశించి, సిద్దమనసుతో దేవుని సేవ చేస్తూ క్రీస్తు నిమిత్తం నష్టాన్ని లాభంగా ఎంచటానికి సిద్దంగా ఉంటారు? ఇది ఏ వ్యక్తి చేస్తాడో అతడు అబ్రాహాము విశ్వాసం కలవాడు. అతడు అబ్రాహాముతో ” అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము” పంచుకుంటాడు. “క్షణమాత్రముండు... చులకన శ్రమ” వాటితో పోల్చతగింది కాదు. పేట్రియార్క్స్ అండ్ ప్రోఫెట్స్, పులు. 126, 127. ChSTel 212.3