Go to full page →

క్రైస్తవ కుటుంబాలకి పిలుపు ChSTel 213

బంజరు భూముల్లో నివాసాలు ఏర్పర్చుకోటానికి మిషనెరీ కుటుంబాలు కావాలి. వ్యవసాయదార్లు, పెట్టుబడిదార్లు, గృహ నిర్మాతలు, ఆయా కళలు చేతివృత్తుల్లో ప్రావీణ్యమున్న వారు నేలను సారవంతం చేయటానికి, పరిశ్రమలు నెలకొల్పటానికి, సామాన్యమైన గృహాలు నిర్మించటానికి, తమ ఇరుగు పొరుగు వారికి సహాయం చెయ్యటానికి నిర్లక్ష్యానికి గురి అయిన ప్రాంతాలికి వెళ్లాలి. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 194. ChSTel 213.3

చీకటిలోను తప్పిదంలోను ఉన్న సమాజాల్లోకివెళ్లి జ్ఞానయుక్తంగాను పట్టుదలతోను తనకు సేవచెయ్యటానికి దేవుడు క్రైస్తవ కుటుంబాలకి పిలుపునిస్తున్నాడు. ఈ పిలుపుకి సానుకూలంగా స్పందించటానికి ఆత్మత్యాగం అవసరం. ప్రతీ ఆటంకం తొలగి పోటానికి అనే కులు ఎదురుచూస్తుండగా ఆత్మలు నిరీక్షణ లేకుండా దేవుడు లేకుండా మరణిస్తున్నాయి. ఐహికమైన లాభం కోసం, శాస్త్రీయ జ్ఞాన సంపాదన కోసం విపత్కర ప్రాంతాలకు వెళ్లి శ్రమల్ని, లేమిని అనుభవించటానికి సాహసించేవారు అనేకులున్నారు. రక్షకుని గూర్చి ఇతరులికి చెప్పటానికి ఈ త్యాగాలు చెయ్యటానికి సమ్మతంగా ఉన్న వారు ఎక్కడున్నారు? చీకటిలో ఉన్న వారిని రక్షకుని వద్దకు నడిపించటానికి, సువార్త అవసరమైన ప్రాంతాల్లో నివసించటానికి వెళ్లటానికి, సమ్మతంగా ఉండే పురుషులు స్త్రీలు ఎక్కడున్నారు? టెస్టిమొనీస్, సం9, పు. 33. ChSTel 214.1

వ్యక్తిగత సేవలో నిమగ్నమై, తమ చేతులతోను మెదడుతోను ప్రభువుకి పనిచేస్తూ, ఆయన సేవ విజయానికి కొత్త పద్ధతుల్ని రూపొందించు కుంటూ మిషనెరీలుగా పని చెయ్యగల పూర్తి కుటుంబాలున్నాయి. టెస్టిమొనీస్, సం.9, పు. 40. ChSTel 214.2

భూమిపై ఉన్న చీకటి స్థలాల్లో అనగా ఆధ్యాత్మిక అంధకారంతో నిండిన ప్రజలున్న స్థలాల్లో కుటుంబాలు నివాసం ఏర్పర్చుకుని, తమ ద్వారా క్రీస్తు జీవితపు వెలుగును వారికి ప్రకాశింపజేస్తే, గొప్ప సేవ జరుగుతుంది. వారు తమ పనిని సున్నితంగాను నిరాడంబరంగాను ప్రారంభించి, సేవ విస్తరించి కాన్ఫరెన్స్ బోధకుల సహాయంఅవసరమయ్యే వరకు వారి ఆర్థిక సహాయం లేకుండా పని చెయ్యాలి. టెస్టిమొనీస్, సం. 6, పు. 442. ChSTel 214.3