Go to full page →

నిజాయితీ ChSTel 266

ఇంత పవిత్రమైన, గంభీరమైన వర్తమానాన్ని చాటించటానికి పిలుపు పొందిన వారి జీవితాల్లో దొంగాటకం ఉండకూదు. లోకం సెవెంతుడే ఎడ్వెంటిస్టుల్ని గమనిస్తున్నది. ఎందుకంటే వారి విశ్వాసం గురించి వారి ఉన్నత ప్రమాణం గురించి లోకానికి కొంత తెలుసు. తమ విశ్వాసం ప్రకారం నివసించని వారిని లోకం చూసినప్పుడు, వారిని ద్వేషంతో వేలెత్తి చూపిస్తుంది. టెస్టిమొనీస్, సం.9, పు. 23. ChSTel 266.3

మనుషులికి గొప్పవరాలు, మంచి సమర్థతలు, అద్భుతమైన అర్హతలు ఉండవచ్చు. కాని ఒక్కలోపం, ఒక్క రహస్య పాపం పురుగు తినేసిన చెక్క ఓడకి ఏమి చేస్తుందో - ప్రమాదం, నాశనం - అది ప్రవర్తనకి చేస్తుంది. టెస్టిమొనీస్, సం.4, పు. 90. ChSTel 266.4

పౌలు పరలోక వాతావరణాన్ని తనతో తీసుకువెళ్లేవాడు. అతడితో సహవాసం చేసినవారందరూ అతడు క్రీస్తుతో ఉన్నవాడని గుర్తించేవారు. తాను బోధించిన సత్యానికి తన జీవితమే ఉదాహరణ అవ్వటం అతడి బోధకు శక్తినిచ్చింది. సత్యం శక్తి ఇక్కడే ఉంది. ఓ పరిశుద్ధ జీవితపు అనాలోచిత ప్రభావం క్రైస్తవ మతానికి అనుకూలంగా చెయ్యగల మిక్కిలి శక్తిమంతమైన ప్రసంగం. వాదం, అది తిరుగులేనిదైనప్పటికీ వ్యతిరేకతను రెచ్చగొట్టవచ్చు. కాని ఓ పరిశుద్ధ జీవితంలోని శక్తి ప్రతిఘటించలేనిది. గాసిపుల్ వర్కర్స్, పు. 59. ChSTel 266.5

యధార్థ ప్రవర్తన బయట నుంచి రూపుదిద్దుకుని ధరించేది కాదు. అది లోపలనుంచి ప్రకాశించేది. ఇతరుల్ని నీతిమార్గంలో నడిపంచాలని మనం ఆకాంక్షిస్తే మన సొంత హృదయాల్లో నీతి నియమాలు గూడుకట్టుకుని నివసించాలి. మన విశ్వాస అంగీకారం మత సిద్దాంతాన్ని ప్రకటించవచ్చు. కాని సత్యానికి శక్తినిచ్చేవి మన ఆచణాత్మక భక్తి నిలకడగల జీవితం, పరిశుద్ద సంభాషణ, అచంచల విశ్వసనీయత, క్రియాశీలమైన, ఉదారమైన స్వభావం, భక్తిజీవితం. ఇవి మాధ్యమాలు. వీటి ద్వారా లోకానికి వెలుగు ప్రసారమౌతుంది. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 307. ప్రార్ధన, ఉద్బోధ, మాటలాడటం చౌక ఫలాలు. తరచు వీటిని కట్టుకుని తిరుగుతుంటారు. కాని సత్కియల్లోను, పేదవారిని, తండ్రిలేని వారిని, విధవరాండ్రను ఆదుకోటంలోను ప్రదర్శితమయ్యేవి యధార్థ ఫలాలు. అవి స్వాభావికంగా మంచి చెట్టు ఫలించే ఫలాలు. టెస్టిమొనీస్, సం.2, పు. 24. ChSTel 267.1