Go to full page →

అంకిత భావం ChSTel 276

యధార్థ పరిశుద్దత అంటే దేవుని సేవలో సంపూర్ణత. యధార్థ క్రైస్తవ జీవితానికి ఇది షరతు. హృదయపూర్వక సేవ చేసేందుకు క్రీస్తు మినహాయింపు లేని సమర్పణను కోరుతున్నాడు. ఆయన హృదయాన్ని, మనసును, ఆత్మను, శక్తిని కోరుతున్నాడు. స్వార్థప్రేమ ఉండకూడదు. తనకోసం తాను నివసించేవాడు క్రైస్తవుడు కాడు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పులు. 48-49. ChSTel 276.1

ఓ వ్యక్తి అసాధారణ పరిస్థితుల్లో ఆధ్యాత్మిక పారవశ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు గనుక అతడు క్రైస్తవుడనటానికి అది ఆరోగ్యవంతమైన నిదర్శనం కాదు. పరిశుద్దత పరమానందం కాదు. అది దేవుని చిత్తానికి సంపూర్ణ సమర్పణ; అది దేవుని నోటినుంచి వచ్చే ప్రతీ మాట ప్రకారం నివసించటం; అది మన పరలోకపు తండ్రి చిత్రాన్ని నెరవేర్చటం; అది కష్టాల్లో చీకటిలోనూ వెలుగులోనూ దేవున్ని నమ్మటం; అది కంటి చూపును బట్టి కాక విశ్వాసం ద్వారా నడవటం; అది తిరుగులేని నమ్మకంతో దేవుని మీద ఆధారపడి ఆయన ప్రేమలో విశ్రమించటం. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 51. ChSTel 276.2