Go to full page →

విశ్వాసం ChSTel 277

ఉదాసీనతను విశ్వాస ఘాతుకతను దేవుడు ద్వేషిస్తాడు. మంచికి చెడుకి మధ్య జరుగుతున్న సంఘర్షణ చివరి దృశ్యాన్ని విశ్వమంతా అమితాసక్తితో పరిశీలిస్తున్నది. దైవ ప్రజలు నిత్య ప్రపంచ పొలిమేరల్ని సమీపిస్తున్నారు. తాము పరలోక దేవునికి విశ్వసనీయులుగా ఉండాలనటం కన్నా ప్రాముఖ్యమైన విషయం ఇంకేమి ఉంటుంది? యుగాల పొడుగునా దేవునికి నైతిక వీరులు ఉంటూ వచ్చారు. ఆయనకు ఇప్పుడు సయితం నైతిక వీరులున్నారు. యోసేపు, ఏలీయా, దానియేలులా వారు ఆయన స్వకీయ జనంగా గుర్తింపు పొందటానికి సిగ్గుపడరు. క్రియాశూరులైన ఈ మనుషుల సేవ పై దేవుని ప్రత్యేక దీవెన ఉంటుంది. వారు విధి నిర్వణ నుంచి మళ్లించ శక్యం కాని మనుషులు. “ప్రభువు పక్క ఉన్నవారెవరు”? అని దేవుని శక్తితో విచారణ చేసే మనుషులు; దైవ ప్రజల్లోని వారుగా తమను తాము ఎంచుకునే వారిని ముందుకు వచ్చి, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు పట్ల తమ ప్రభు భక్తిని స్పష్టంగా వెల్లడి చెయ్యాల్సిందిగా డిమాండు చేసే మనుషులు. అలాంటి మనుషులు తమ చిత్రాల్ని ప్రణాళికల్ని దేవుని ధర్మశాస్త్రానికి లోబర్చుతారు. దేవుని ప్రేమ నిమిత్తం వారు తమ ప్రాణాల్ని ప్రియమైనవిగా ఎంచరు. వారి పని దైవ వాక్యం నుంచి వెలుగును స్వీకరించి, దాన్ని స్పష్టమైన, స్థిరమైన కిరణాలతో లోకానికి ప్రకాశింపజెయ్యటం. ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పు. 148. ChSTel 277.4