Go to full page →

జయించే జీవితం ChSTel 23

సత్యాన్ని ప్రకటించటం పత్రికలు పంచటం ద్వారా మాత్రమే మనం దేవునికి సాక్షులమవ్వం. క్రీస్తు జీవితంవంటి జీవితం క్రైస్తవానికి మద్దతుగా అతిశక్తిమంతమైన వాదన అని, చౌకబారు క్రైస్తవ ప్రవర్తన ప్రపంచంలో లౌకిక వ్యక్తుల ప్రవర్తన కన్నా ఎక్కువ హానికి కారణమౌతుందని మనం గుర్తుంచుకోవాలి. టెస్టిమొనీస్, సం.9, పు. 91. ChSTel 23.2

రచించబడగల పుస్తకాలన్నీ పరిశుద్ధ జీవితాన్ని ఉత్పత్తి చెయ్యలేవు. బోధకుడు బోధించే బోధను కాదు సంఘం జీవించే జీవితాన్ని మనుషులు నమ్ముతారు. సత్యాన్ని నివసిస్తున్నట్లు చెప్పుకునే వారి జీవితాలు ప్రసంగాలు తరచుగా ప్రసంగికుడు ప్రసంగ వేదికపై నుంచి చేసే ప్రసంగ ప్రభావాన్ని నిరర్ధకం చేస్తాయి. టెస్టిమొనీస్, సం.9, పు.21. ChSTel 23.3

క్రీస్తు జీవిత ప్రభావం నిత్యం విశాలమయ్యేది, తీరంలేనిది. ఆ ప్రభావం ఆయన్ని దేవునికీ మానవ కుటుంబానికి బంధిస్తుంది. క్రీస్తు ద్వారా దేవుడు మానవుడికిచ్చిన ప్రభావం అతడు తనకోసం తాను జీవించటాన్ని అసాధ్యపర్చుతుంది. దేవుని పెద్ద సంఖ్యలో భాగంగా, మనం వ్యక్తిగతంగా సాటి మనుషులతో సంబధం కలిగి ఉంటాం. పరస్పర విధులు నిర్వర్తించాల్సిఉంటాం. సాటి మనుషులతో సంబంధంలేకుండా ఎవరూ స్వతంత్రంగా నివసించలేరు. ఎందుకంటే ఒకరి క్షేమం ఇతరుల పై ప్రభావం చూపుతుంది. ప్రతీఒక్కరూ తాము ఇతరుల క్షేమానికి అవసరమని భావిస్తూ వారి సంతోషానికి తోడ్పడాలన్నది దేవుని సంకల్పం. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 339. ChSTel 23.4

బైబిలు బోధించే మతాన్ని పుస్తకం అట్టలమధ్యగాని గుడి గోడల మధ్యగాని బంధించి అప్పుడప్పుడు మన స్వార్థ ప్రయోజనాలకోసం బయటికి తీసుకువచ్చి, అనంతరం అతి జాగ్రత్తగా ప్రక్కన పెట్టటానికి కాదు. అది రోజువారీ జీవితాన్ని పరిశుద్ధపర్చాలి. మన ప్రతీ వ్యాపార వ్యవహారంలోను మన సాంఘిక సంబంధాలన్నీటిలోను మతం కనిపించాలి. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పులు. 306, 307. ChSTel 24.1

తన ప్రజల్లో లోకం ముందు తన్నుతాను మహిమ పర్చుకోవాలన్నది దేవుని ఉద్దేశం. క్రీస్తు నామం ధరించినవారు తలంపు, మాట, క్రియలో ఆయన్ని సూచించాలని ఆయన కోరుతున్నాడు. వారి ఆలోచనలు పవిత్రం వారి మాటలు ఉన్నతం, ఉత్సాహభరితం అయి తమ చుట్టూ ఉన్న వారిని రక్షకునికి ఆకర్షించేలా ఉండాలి. వారు చేసే పనులతో వారు పలికే మాటలతో క్రీస్తు మతం పెనవేసుకుపోవాలి. వారి వ్యాపార లావాదేవీలు దేవుని సముఖంతో పరిమళించాలి. టెస్టిమునీస్, సం.9, పు.21. ChSTel 24.2

తన నిజాయితీనిబట్టి తన ప్రభువును మహిమపర్చే విధంగా వ్యాపారి తన వ్యాపారం చెయ్యాలి. తాను చేసే ప్రతి కార్యంలోనూ తన మతాన్ని కనపర్చి మనుషులికి క్రీస్తు స్పూర్తిని ప్రదర్శించాలి. యూదయ పట్టణాల్లో బడుగు ప్రజల సామాన్య వృత్తిలో శ్రమించిన ఆ ప్రభువుకి నమ్మకమైన ప్రతినిధిగా ఓ మెకానిక్కు శ్రద్దగా పని చెయ్యాలి. మనుషులు అతడి మంచి పనులు చూసి, సృష్టికర్త విమోచకుడు అయిన ప్రభువును మహిమ పర్చే విధంగా క్రీస్తు నామం ధరించిన ప్రతీ వ్యక్తి పనిచెయ్యాలి. బైబిల్ ఎకో, జాన్ 10, 1901. ChSTel 24.3