Go to full page →

ప్రతిఫలం కోసం ఓర్పుతో నిరీక్షించండి ChSTel 323

మనం మన విమోచకుని రాకకు కని పెడుతున్న సమయం దీర్ఘంగా ఉన్నట్టు కనిపిస్తే; శ్రమల భారం కింద కుంగిపోయి, శారీరక శ్రమ వల్ల కృషించి, ప్రభు ఆజ్ఞ సమాప్తికి, బాధ్యత నుంచి విముక్తికి అసహనంతో వేచి ఉంటే, తుఫానుల్ని, సంఘర్షణల్ని ఎదుర్కోటానికి, క్రైస్తవ ప్రవర్తనను పరిపూర్ణం చేసుకోటానికి, దేవునితోను, మన పెద్దన్న క్రీస్తుతోను మరింత పరిచయం సాన్నిహిత్యం కలిగి ఉండటానికి, “భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీ జయమానుని సంతోషములో పాలు పొందుము’ అన్న ఉత్సాహభరిత వాక్యాలు వినగలిగేందుకు క్రీస్తుకి అనేక ఆత్మల్ని సంపాదించటానికి పని చెయ్యటానికి మనల్ని దేవుడు ఈ లోకంలోనే విడిచి పెడతాడని జ్ఞాపకముంచుకుందాం. ఈ జ్ఞాపకం ప్రతీ సణుగుడుని అణచి వెయ్యాలి. రివ్యూ అండ్ హెరాల్డ్, అకో. 25, 1881. ChSTel 323.1

క్రైస్తవ యోధుడా, సహనం వహించు. ఇక కొద్ది కాలమే. రావాల్సి ఉన్న ఆయన తప్పక వస్తాడు. ఆయాసకరమైన జాగరణ రాత్రి — ఏడుస్తూ ఎదురు చూడటం - దాదాపు గతించింది. త్వరలో ప్రతిఫలం దొరుకుతుంది. నిత్యవాసరం తెల్లవారుతుంది. నిద్రపోవటానికి ఇప్పుడు సమయంలేదు. అనవసర సంతాపాలకి సమయం లేదు. ఇప్పుడు నిద్రపోయే వ్యక్తి మేలు చేసేందుకు విలువైన అవకాశాల్ని పోగొట్టుకుంటాడు. ఆ గొప్ప కోత సమయంలో పనలు కూర్చే ఆధిక్యత మనకు లభిస్తుంది. రక్షించబడ్డ ప్రతీ ఆత్మ మన విమోచకుని కిరీటంలో ఓ అదనపు నక్షత్రమౌతుంది. పోరాటాన్ని ఇంకొంతసేపు సాగిస్తే విజయం సాధించి నిత్య జీవానికి నూతన ట్రోఫీలు సంపాదించగలినప్పుడు ఏ వ్యక్తి తన యుద్ధ కవచాన్ని తీసి పకక్కన పెట్టటానికి ఆతురతగా ఉంటాడు? రివ్యూ అండ్ హెరాల్డ్, అకో. 25, 1881. ChSTel 323.2