Go to full page →

చిన్ననాటి సంవత్సరాల్లో ChSTel 29

వాక్యసేవకుడి దయ మర్యాదలు అతడు చిన్నపిల్లల పట్ల వ్యవహరించే తీరులో వ్యక్తమౌతాయి. వారు చిన్నపురుషులు చిన్న స్త్రీలు అని, దేవుని కుటుంబంలోని చిన్నారి సభ్యులని అతడు నిత్యం గుర్తుంచుకోవాలి. వారు ప్రభువుకి సన్నిహితులు ప్రియులుకావచ్చు. సరియైన ఉపదేశం క్రమశిక్షణ ఇస్తేవారు చిన్న వయసులో సయితం ప్రభువుకి సేవ చెయ్యగలుగుతారు. టెస్టిమొనీస్, సం.4, పులు. 397, 398. ChSTel 29.2

యువతని అలక్ష్యం చెయ్యకూడదు. పనిలోను బాధ్యతలను వారిని పాలు పంచుకోనివ్వండి. ఇతరులికి సహాయం చెయ్యటంలోను మేలు చెయ్యటంలోను తమకో భాగమున్నదని వారు భావించేటట్లు చెయ్యండి. తమకన్నా ఎక్కువ దయనీయ పరిస్థితిలో ఉన్నవారికోసం చిన్నచిన్న దయ ప్రేమ కార్యాలు చెయ్యటం చిన్నపిల్లలకి సయితం నేర్పించాలి. టెస్టిమొనీస్, సం.6, పు. 435. ChSTel 29.3

సమయం విలువను దాన్నిసరియైన రీతిగా ఉపయోగించటాన్ని తల్లిదండ్రులు తమ బిడ్డలకు నేర్పించాలి. దేవుని మహిమపర్చటానికి, మానవాళికి మేలు చెయ్యటానికి ఎంతో కొంత చెయ్యటం విలువైన సేవ అని వారికి నేర్పించండి. చిన్న వయసులో సయితం వారు దేవునికి మిషనెరీలుగా సేవచెయ్యవచ్చు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 345. ChSTel 29.4