Go to full page →

ఆధ్యాత్మికంగా బలహీన స్థితి ChSTel 39

పోగుపడ్డ వెలుగు దైవప్రజల పై ప్రకాశిస్తున్నది కాని దాన్ని అనుసరించి నవసించటం అనేకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ కారణంవల్ల వారు ఆధ్యాత్మికంగా బలహీన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు దైవప్రజలు జ్ఞానం లేనందువల్ల నశించిపోటంలేదు. మార్గం సత్యం జీవం తెలియనందువల్ల వారు శిక్షపొందరు. తాము అవగాహన చేసుకున్న సత్యాల్ని, తమ ఆత్మలో ప్రకాశించిన వెలుగును వారు నిర్లక్ష్యం చేయటం లేక నిరాకరించటం వారిని శిక్షార్హుల్ని చేస్తుంది. నిరాకరించటానికి అసలు వెలుగేలేనివారు శిక్షార్హులు కారు. తన ద్రాక్షాతోటకు దేవుడు చేసినదానికిమించి ఏమి చెయ్యగలడు? అమూల్యమైన వెలుగు దేవుని ప్రజల పై ప్రకాశిస్తున్నది. కాని దాని ద్వారా రక్షించబడటానికి వారు అంగీకరించి, దాని ప్రకారం నివసిస్తూ, చీకటిలో ఉన్నవారికి దాన్ని ప్రకాశింపజేస్తే తప్ప అది వారిని రక్షించలేదు. టెస్టిమొనీస్, సం.2, పు. 123. ChSTel 39.2