Go to full page →

ఉత్పత్తిదారులుకారు వినియోగదారులు ChSTel 44

క్రీస్తు అనుచరులమని చెప్పుకునేవారు పరలోక విశ్వం ముందు పరీక్షకు గురి అవుతారు. అయితే చల్లబడ్డ ఉత్సాహం, దేవుని సేవలో వారిదుర్బల ప్రయత్నాలు వారిని అపనమ్మకమైన సేవకులుగా నిర్ధారిస్తాయి. తాము చేస్తున్న పని తాము చెయ్యగలిగిందైతే వారు ఖండనాగులవ్వరు. కాని వారు మనఃపూర్వకంగా పనిచేస్తే వారింకా ఎక్కువ పని చెయ్యగలుగుతారు. తాము ఆత్మత్యాగ స్పూర్తిని, సిలువను మోసే స్వభావాన్ని చాలామట్టుకు కోల్పోయినట్లు వారికి తెలుసు, లోకానికీ తెలుసు. పరలోక గ్రంథాల్లో తమ పేళ్లకు ఎదురుగా ఉత్పాదకులు కారు వినియోగదారులు అని రాయబడటం అనేకుల సందర్భంలో జరుగుతుంది. ఆయన నామం ధరించిన అనేకులు ఆయన మహిమను మసకబార్చుతారు, ఆయన సౌందర్యాన్ని కప్పిపుచ్చుతారు, ఆయన ఘనతను ప్రచురించకుండా నిలుపుతారు. సంఘపుస్తకాల్లో తమ పేర్లు కలిగి క్రీస్తుకు లోబడని వారు అనేకమంది ఉన్నారు. వారు ఆయన ఉపదేశాన్ని అనుసరించటంలేదు, ఆయన సేవచెయ్యటంలేదు. కనుక వారు శత్రువు నియంత్రణ కింద ఉన్నారు. వారు చేసే మంచి లేదు. కాబట్టి వారు అపార హాని చేస్తారు. వారి ప్రభావం జీవార్డమైన జీవపు వాసన కాదు గనుక అది మరణార్ధమైన మరణపు వాసన. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పులు. 303, 304. ChSTel 44.3