Go to full page →

యుద్ధ స్వభావంతో నిండిన లోకం ChSTel 59

లోకం యుద్ధ స్వభావంతో ఉరకలువేస్తుంది. దానియేలు గ్రంథం పదకొండో అధ్యాయంలోని ప్రవచనం దాదాపు పూర్తిగా నెరవేరింది. ప్రవచనాలు పేర్కొంటు శ్రమ దృశ్యాలు త్వరలోనే చోటు చేసుకుంటాయి. టెస్టిమొనీస్, సం.9, పు.14. ChSTel 59.2

లోక ప్రజలు గందరగోళంలో ఉన్నట్లు నేను దర్శనంలో చూశాను. దేశంలో యుద్ధం, రక్తపాతం, కష్టం, లేమి, కరవు, వ్యాధి ప్రబలుతున్నాయి.... ఆ దృశ్యంనుంచి నా దృష్టి మరల్చబడింది. స్వల్పకాలం శాంతి ఉన్నట్లు కనిపించింది. మరోసారి లోక ప్రజల్ని నాకు చూపించటం జరిగింది. మళ్లీ సమస్తం అస్తవ్యస్తంగా ఉంది. అశాంతి, యుద్ధం, రక్తపాతం, కరవు, వ్యాధి దేశమంతటా ప్రబలంగా ఉన్నాయి. ఈ యుద్ధంలోను గందరగోళంలోను ఇతర జాతులు నిమగ్నమై ఉన్నాయి. యుద్దం కరవుకి దారి తీసింది. లేమి రక్తపాతం వ్యాధికి దారితీశాయి. “లోకము మీదికి రాబోవుచున్నవాటి విషయమై” భయం కలిగి ఎదురుచూస్తూ మనుషులు ధైర్యంచెడి కూలిపోయారు. టెస్టిమొనీస్, సం.1, పు. 268. ChSTel 59.3