Go to full page →

ప్రత్యేక శిక్షణ ChSTel 65

ఆరోగ్య సంస్కరణ సూత్రాల పై ప్రజల్ని చైతన్యవంతం చెయ్యటానికి ఎక్కువ కృషి జరగాల్సిన అవసరం ఉంది. వంట చెయ్యటం నేర్పే పాఠశాలలు స్థాపించి ఆరోగ్యకరమైన ఆహారం వండటం పై ఇంటింటికి ఉపదేవం ఇవ్వటం జరగాలి. ఎక్కువ సాధారణంగా ఎలా వండాలో పెద్దవారు చిన్నవారు నేర్చుకోవాలి. మనం సత్యాన్ని ఎక్కడ అందిస్తామో అక్కడి ప్రజలకు ఆహారాన్ని సమాన్యంగాను రుచికరంగాను వండటం నేర్పాలి. మాంసంలేకుండా బలవర్ధకమైన ఆహారం ఎలా తయారు చేసుకోవచ్చునో వారికి చూపించాలి. టెస్టిమొనీస్, సం. 9. పు. 161. ChSTel 65.1

ఆరోగ్య సూత్రాల ప్రకారం నివసించగోరేవారి నిమిత్తం, సంఘం ఉన్న ప్రతీ స్థలంలోను సామాన్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం తయారు చెయ్యటంలో ఉపదేశం ఇవ్వటం జరగాలి. ఈ అంశంపై తాము పొందే వెలుగును సంఘ సభ్యులు తమ పరిసరాల్లో నివసించే ప్రజలకు అందించాలి. గాస్పుల్ వర్క్స్, పు. 362. ChSTel 65.2