Go to full page →

ప్రాణాంతకమైన తప్పిదం ChSTel 77

ఆత్మల రక్షణ కార్యం కేవలం సువార్త సేవ పైనే ఆధారపడి ఉంటుందని భావించటం ప్రాణ ఘాతుకమైన పొరపాటు. ప్రభువు ఎవరి పై విస్తృత బాధ్యతలు మోపాడో ఆ నాయకులు ద్రాక్షతోట యజమాని ఎవరి హృదయంపై ఆత్మల రక్షణ భారం పెట్టాడో ఆ దీన, ఆత్మ సమర్పణ పూరిత విశ్వాసుల్ని ప్రోత్సహించాలి. దేవుని సంఘంలో నాయకత్వ బాధ్యతలు నిర్వహించేవారు రక్షకుని ఆదేశం ఆయన నామాన్ని విశ్వసించేవారందరికీ ఇవ్వబడిందని గుర్తించాలి. హస్త నిక్షేపం ద్వారా పరిచర్యకు ప్రతిష్ఠితులు కాని అనేకుల్ని దేవుడు తన ద్రాక్ష తోటలోకి పంపుతాడు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 110. ChSTel 77.1

వాక్యపరిచారకుడే బరువులన్నీ మోస్తూ పని అంతటినీ, చెయ్యాలన్నది పెద్ద పొరపాటు. ప్రభువు ఉద్దేశించినట్లు భారాన్ని పంచుకోటం జరిగి ఉంటే ఇంకా బతికి ఉండాల్సిన అతడు పెనుభారం కింద తీవ్రంగా దెబ్బతిన్న ఆరోగ్యంతో అకాలంగా సమాధిలోకి వెళ్లవచ్చు. క్రీస్తుని అనుసరించటానికి, ఆయన పని చేసినట్లు పనిచెయ్యటానికి పనివారికి బోధించగలవారు, భారాన్ని పంచుకునే విషయంలో సంఘానికి శిక్షణనివ్వాలి. టెస్టిమొనీస్, సం.6, పు. 435. ChSTel 77.2

మాట్లాడటం, సేవచెయ్యటం, ప్రార్థించటం అంతా తన బాధ్యత అని వాక్యపరిచారకుడు భావించకూడదు. ప్రతీ సంఘంలోను సహాయకుల్ని తర్బీతు చెయ్యాలి. వర్తమానాల్ని, వేద పఠనాల్ని వేర్వేరు వ్యక్తులకివ్వాలి. అలా చెయ్యటంలో వారు దేవుడు తమకిచ్చిన వరాన్ని వినియోగిస్తారు. అదే సమయంలో పనివారిగా శిక్షణ పొందుతారు. గాస్పుల్ వర్కర్స్, పు. 197. ChSTel 77.3

మన విశ్వాసాన్ని అవిశ్వాసులకు సమర్పించటానికి ప్రయత్నం జరిగేటప్పుడు తమకేమీ ఆసక్తిలేనట్లు, భారమంతా వాక్యపరిచారకుడి మీద పడనిస్తున్నట్లు సంఘసభ్యులు వెనకకు ఉండి పోటం తరచుగా జరుగుతుంటుంది. ఈ కారణం వల్ల మన వాక్యపరిచారకుల్లో అతి సమర్థుల పరిచర్య కొన్నిసార్లు మంచి ఫలితాల్ని ఇవ్వటంలేదు. గాస్పుల్ వర్కర్స్, పు. 196. ChSTel 77.4