Go to full page →

సమయానికి తగిన హెచ్చరిక ChSTel 85

పద్ధతి ప్రకారం పని చెయ్యటం అవసరం. అయితే మీలో కొందరు ఆలోచిస్తూ, ప్రణాళికలు తయారు చేసుకుంటూ, దీర్ఘకాలం సిద్దపడ్తుండగా సాతాను చక్కని కట్టుకథలతో స్థలాన్ని ఆక్రమించుకుంటాడు. మనుషుల మనసులు ఆ అపూర్వవంచకుడి మోసాల పై నిలిచి ఉంటాయి. రివ్యూ అండ్ హెరాల్డ్ మార్చి 13, 1888. ChSTel 85.1

ఈ ప్రజల మధ్యచేరి గట్టి వ్యవస్థీకరణ అవసరమైన సమయంలో, నకిలీ తిరుగుబాటులను అణచివేసే, దైవవాక్యం సమర్థించని సంగతులను ఖండించే గొప్ప శక్తిగా నిలవాల్సిన సమయంలో విజయం సాధించగలిగితే సాతాను ఎంత ఆనందిసాతడు! జ్ఞానంతో జాగ్రత్తగా కృషిచెయ్యటం ద్వారా మనం నిర్మించుకున్న వ్యవస్థ, క్రమం కూలిపోకుండేందుకు మనం మన విధానాల్ని. న్యాయంగా నిష్పాక్షికంగా కొనసాగించు కోవాలి. ఈ సమయంలో సేవను నియంత్రించటానికి ప్రయత్నించే అక్రమ శక్తులకు అధికారం ఇవ్వకూడదు. గాసిపుల్ వర్కర్స్, పు. 187. ChSTel 85.2