Go to full page →

ముందుకి సాగండి ChSTel 126

క్రైస్తవ జీవితంలో తరచు ప్రమాదాలు ఎదురవుతుంటాయి. విధి నిర్వహణ కష్టమనిపిస్తుంది. ముందు నాశనం వెనక దాస్యం మరణం ఉన్నట్లు ఊహ చిత్రీకరిస్తుంది. అయినా, ముందుకి సాగండి అంటూ దైవ స్వరం స్పష్టంగా పలుకుతుంది. మన దృష్టి చీకటిలో నుంచి చొచ్చుకు పోలేనప్పటికీ ఆ ఆదేశానికి విధేయులవ్వుదాం. ఊగిసలాడుతూ సందేహిస్తూ ఉండే మనస్తత్వం ముందు ప్రగతికి అడ్డుకట్టవేసే ప్రతిబంధకాలు ఎన్నడూ తొలగిపోవు. ప్రతీ సందేహం తొలగిపోయి, వైఫల్య లేదా పరాజయ ప్రమాదం మటుమాయమయ్యేవరకు విధేయతను వాయిదా వేసేవారు ఎన్నడూ విధేయులవ్వరు. విశ్వాసం ప్రతీ అత్యవసర పరిస్థితిలోను క్రీస్తు చెయ్యిపట్టుకుంటుంది. గాస్పుల్ వర్కర్స్, పు. 262. ChSTel 126.2

మన అభిప్రాయాలు బహు సంకుచితమైనవి. వెలుగును వెదజల్లే సేవలో నిరంతర వృద్ధికి దేవుడు పిలుపు నిస్తున్నాడు. ప్రజల్ని చేరటంలో మెరుగైన మార్గాల్ని పద్దతుల్ని మనం అధ్యయనం చెయ్యాలి. ముందుకి “సాగిపోవుడి” అంటూ యెహోవా సేనకు అధిపతి మాటలు మనం విశ్వాసపు చెవులతో వినటం అవసరం. మనం చర్య చేపట్టాలి. దేవుడు మనల్ని ఆశాభంగపర్చడు. మనం మన భాగాన్ని విశ్వాసంతో నెరవేర్చినప్పుడు ఆయన తన భాగాన్ని నెరవేర్చుతాడు. సత్యంలో చాలా కాలంగా ఉంటున్న సోదర సోదరీలారా, దేవుడు మిమ్మల్ని కోరుతున్న సేవను మీరు చెయ్యటం లేదు. ఆత్మల పట్ల మీకు ప్రేమ ఎక్కడుంది? హిస్టారికల్ స్కెచ్చేస్, పులు. 289, 290. ChSTel 126.3

ఆత్మల్ని రక్షించటం క్రీస్తుకి ఆనందాన్నిచ్చింది. ఇది మీ సేవ మీ ఆనందం కావాలి. క్రీస్తు నిమిత్తం మీ వీధులన్నీ నెరవేర్చండి. మీ త్యాగాలన్నీ చెయ్యండి. అప్పుడాయన మి నిత్యసహాయకుడుగా ఉంటాడు. విధి నిర్వహణకు పిలుపు ఎక్కడ వస్తుందో అక్కడకు వెళ్లండి. కష్టాలుగా కనిపించే వేవీ మిమ్మల్ని ఆటంకపర్చనివ్వకండి. మీకు దేవుడిచ్చిన బాధ్యతల్ని చేపట్టండి. కొన్ని సార్లు మీరు భారాలు మోస్తున్నప్పుడు ఇలా ప్రశ్నించవద్దు, “నా సోదరుడు ఎందుకు సోమరిగా ఉన్నాడు? అతని మీద కాడి ఎందుకు మోపలేదు?” మీకు దగ్గరలో ఉన్న విధిని నిర్వహించండి. అభినందనను ఆశించకుండా ఆ పనిని పరిపూర్ణంగా చెయ్యండి. మీరు ప్రభువు సొత్తుగనుక ఆయన సేవ చెయ్యండి. సదర్న్ వాచ్ మేన్, ఏప్రి. 2, 1903. ChSTel 127.1

దైవ ప్రజల పయనం పరలోకం దిశగా ముందుకి విజయం సాధించేందుకు సాగాలి. ఇశ్రాయేలు సైన్యాల్ని యెహోషువ కన్నా ఘనుడు నడిపిస్తున్నాడు. మన రక్షణకు అధిపతి మన మధ్య ఉన్నాడు. “ఇదిగో నేను యుగసమూప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను.” “ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను.” ఆయన మనల్ని విజయానికి నడిపిస్తాడు. దేవుడు ఏది వాగ్దానం చేస్తాడో దాన్ని నెరవేర్చటానికి ఆయన ఎల్లప్పుడూ సమర్థుడు. తన ప్రజలకు తాను ఇచ్చే పనిని వారి ద్వారా నెరవేర్చటానికి ఆయన సమర్దుడు. టెస్టిమొనీస్, సం.2, పు. 122. ChSTel 127.2

క్రీస్తు స్పూర్తి మనల్ని ఎందుకు ఉత్సాహపర్చటంలేదు? బాధపడ్తున్న లోకం దయనీయమైన కేకలు మనలో ఎందుకు స్పందన పుట్టించటం లేదు? క్రీస్తు కిరీటంలో ఒక నక్షత్రాన్ని పెట్టే మన గొప్ప ఆధిక్యతను - సాతాను బంధించిన ఒక ఆత్మను విడిపించటం, దేవుని రాజ్యంలోకి ఒక ఆత్మను రక్షించటమన్న ఆధిక్యతను - మనం పరిగణిస్తున్నామా? నేటి సత్యసువార్తను ప్రతీ వ్యక్తికీ అందించాల్సిన తమ విధిని సంఘం గుర్తించాలి. జెకర్యా మూడు నాలుగు అధ్యాయాలు పఠించాల్సిందిగా మిమ్మల్ని బతిమాలుతున్నాను. ఈ అధ్యాయాల్ని అవగాహన చేసుకోటం, వాటిని స్వీకరించటం జరిగితే నీతి కోసం ఆకలిదప్పులు గొంటున్న వారి నిమిత్తం ఒక సేవ జరుగుతుంది, అంటే సంఘం “పరలోకం దిశగా ముందుకి సాగటం అన్నమాట. టెస్టిమొనీస్, సం.6, పు. 296. ChSTel 127.3

భూనివాసుల్లో అధిక సఖ్యాకులు శత్రువు పట్ల భక్తి ప్రదర్శిస్తున్నారు. కాగా మనం మాత్రం వంచితులంకాం. సాతాను విజయం సాధిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, క్రీస్తు పరలోక గుడారంలోను భూమి మీదను తన సేవను కొనసాగిస్తూనే ఉన్నాడు. చివరి దినాల్లో ప్రబలే దుర్మార్గం గురించి దుర్నీతిని భ్రష్టతని దైవ వాక్యం వర్ణిస్తున్నది. ప్రవచనం నెరవేరటం చూస్తున్నప్పుడు క్రీస్తు రాజ్యం అంతిమ విజయం పై మన విశ్వాసం బలీయమవ్వాలి. మనకు నియమితమైన సేవను చెయ్యటానికి మనం నూతనోత్సాహంతో ముందుకి సాగాలి. గాసిపుల్ వర్కర్స్, పులు. 26, 27. ChSTel 128.1