Go to full page →

26 - “ఇదిగోమి దేవుడు!” PKTel 210

యెషయా దినాల్లో దేవుని గూర్చిన భయంవల్ల మానవాళి ఆధ్మాత్మిక అవగాహన చీకటిమయమయ్యింది. తమ సృష్టికర్త పాపానికి బాధకు మరణానికి కారకుడని మానవుల్ని నమ్మించటానికి సాతాను చాలాకాలం ప్రయత్నించాడు. ఇలా అతడివల్ల మోసపోయినవారు దేవుడు కఠినాత్ముడు, కర్కోటకుడు అని భావించారు. తప్పు పట్టటానికి, ఖండించటానికి, న్యాయమైన సాకు ఉన్నంత సేపు పాపిని చేర్చుకోటానికి నిరాకరించేవాడని ఆయన్ని పరిగణించారు. పరలోక పరిపాలన చట్టమైన ఆ ప్రేమ ఆధారిత ధర్మశాస్త్రం మానవుల ఆనందానికి ప్రతిబంధకమని అది వారు తొలగించు కోవాల్సిన భారమైన కాడి అని ఆ అపూర్వ వంచకుడు దానికి అపార్థం చెప్పాడు. ఆ నిబంధన సూత్రాల్ని ఆచరించటం అసాధ్యమని వాటి ఉల్లంఘటనకు శిక్షలు నిరంకుశంగా విధించటం జరుగుతుందని అతడు ప్రచారం చేశాడు. PKTel 210.1

యెహోవా యధార్ధ ప్రవర్తనను మర్చిపోటానికి ఇశ్రాయేలీయులికి ఎట్టి సాకూ లేదు. ఆయన తరచు వారికి “దయా దాక్షిణ్యములుగల దేవుడు ... దీర్ఘశాంతుడు ... కృపాసత్యములతో నిండినవాడు”గా తన్నుతాను కనపర్చు కున్నాడు. (కీర్త.86:15). “ఇశ్రాయేలు బాలుడైయుండగా నేను అతని యెడల ప్రేమగలిగి నా కుమారుని ఐగుప్తు దేశములోనుండి పిలిచితిని.” హోషేయా 11:1. PKTel 210.2

ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దాస్యంనుంచి విడిపించటంలోను, వాగ్దత్త దేశానికి వారి ప్రయాణంలోను ప్రభువు వారితో దయగా వ్యవహరించాడు. “వారి యావద్బాధలో ఆయన బాధనొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమచేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను.” యెష. 63:9. . PKTel 210.3

“నా సన్నిధి నీకు తోడుగా వచ్చును.” అన్నది వారి అరణ్య ప్రయాణ మంతటిలోను ఆయన వాగ్దానం. (నిర్గమ. 33:14). ఈ వాగ్దానం చేసిన తర్వాత యెహోవా తన ప్రవర్తనను వెల్లడి చేశాడు. మోషే దేవుని దయాళుత్వాన్ని, ఇశ్రాయేలీయులికి ప్రకటించటానికి, తమ అదృశ్య రాజు గుణలక్షణాలగురించి వారికి పూర్తిగా ఉపదేశించటానికి ఇది అతడికి సామర్థ్యానిచ్చింది. “అతని యెదట యెహోవా అతని దాటి వెళ్లుచు - యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన వేయి వేలమందికి కృపచూపుచు దోషమును అపరాధమును క్షమించునుగాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచ”డు. నిర్గమ. 34:6,7. PKTel 210.4

వాగ్దత్త దేశం సరిహద్దుల్లో ఉండగా ముందుకు సాగాల్సిందని దేవుడు ఆదేశించగా ఇశ్రాయేలీయులు నిరాకరించినప్పుడు, యెహోవా దీర్ఘశాంతాన్ని గురించి ఆయన అనంత ప్రేమ కృపల్ని గురించిన తన జ్ఞానాన్ని ఆసరాగా తీసుకుని మోషే ఇశ్రాయేలీయుల ప్రాణాలకోసం దేవునితో ఆ అద్భుతమైన విజ్ఞాపన చేశాడు. వారి తిరుగుబాటు తీవ్రరూపం ధరించినప్పుడు ప్రభువు, “నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులుచేత వారిని హతము” చేస్తాను అని, మోషే సంతానాన్ని “యీ జనముకంటే మహా బలముగల గొప్ప జనమును” చేస్తాను అని, చెప్పాడు. సంఖ్యా. 14:12. కాని ప్రవక్త దేవుని సంకల్పాల్ని వాగ్దానాల్ని ఆసరా చేసుకుని వారి పక్షంగా విజ్ఞాపన చేశాడు. ఆ మీదట అన్ని విజ్ఞప్తులకన్నా మిక్కిలి బలమైన విజ్ఞప్తిగా మోషే పడిపోయిన మానవుడిపట్ల ప్రేమ చూపించమంటూ వేడుకున్నాడు. 17-19 వచనాలు చూడండి. PKTel 211.1

కృపగల ప్రభువు ఇలా స్పందించాడు, “నీ మాట చొప్పున నేను క్షమించు చున్నాను.” ఆ తర్వాత ప్రవచన రూపంలో ఇశ్రాయేలీయుల అంతిమ విజయాన్ని గురించిన శాన్ని ప్రభువు మోషేకి వివరించాడు. “నా జీవితముతోడు, భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని యుండును.” 20,21 వచనాలు. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా మోషే కోరిన దైవ మహిమ, ఆయన ప్రవర్తన, ఆయన దయాళుత్వం, ప్రేమ - ఇవి మానవులందరికి వెల్లడి కావాల్సి ఉన్నాయి. యెహోవా చేసిన ఈ వాగ్దానం ధ్రువీకరించబడింది. ప్రమాణంద్వారా ధ్రువీకరించబడింది. దేవుడు సజీవుడైఉంటూ విశ్వపాలన చెయ్యటం ఎంత నిశ్చితమో అంత నిశ్చితంగా ఆయన మహిమను ... సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములను” ప్రకటించటం జరగాలి. కీర్త. 96:3. PKTel 211.2

“భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని యుండును.” అంటూ సింహాసనం ముందు సెరాపు పాడటం యెషయా విన్న పాట ఈ ప్రవచనం నెరవేర్పును గూర్చిన పాట (యెష 6:3). ఈ మాటల నెరవేర్పు నిశ్చితమని నమ్మిన ప్రవక్త కర్ర, రాతి విగ్రహాలకు మొక్కేవారి గురించి అనంతరం ఇలా నిర్భయంగా ప్రకటించాడు, “అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.” యెష 35:2. PKTel 211.3

ఇప్పుడు ఈ ప్రవచనం వేగంగా నెరవేరుతున్నది. లోకంలోని దేవుని సంఘం మిషనరీ కార్యకలాపాలు ఫలవంతమౌతున్నాయి. త్వరలో సువార్త సందేశం అన్ని జాతులికీ ప్రకటితమవుతుంది. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము” “తాను ఉచితముగా మనకనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు” ప్రతీ జాతినుంచి, భాషనుంచి, ప్రజనుంచి స్త్రీ పురుషుల్ని “తన ప్రియునియందు యోగ్యుల్ని చేస్తున్నాడు. ఎఫె. 1:6, 2:7. “దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక.” కీర్త. 72:18,19. PKTel 212.1

ఆలయ ఆవరణంలో యెషయా పొందిన దర్శనంలో ఇశ్రాయేలు దేవుని ప్రవర్తనను స్పష్టంగా చూశాడు. “మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్దుడును నిత్యనివాసియునైనవాడు” గొప్ప ఠీవితో అతడిముందు నిలిచాడు. అయినా తన ప్రభువు దయాదాక్షిణ్య స్వభావాన్ని ప్రవక్త గ్రహించాడు. “మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించే ఆయన “వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును” ” నివసిస్తున్నాడు. యెష. 57:15. యెషయా పెదవుల్ని స్పృశించటానికి నియుక్తుడైన దేవదూత ఈ వర్తమానం తెచ్చాడు, “నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను.” యెష. 6:7. PKTel 212.2

దమస్కు గుమ్మంవద్ద తార్సువాడైన సౌలులాగ దేవున్ని చూడటంలో ప్రవక్త తన అయోగ్యతను చూశాడు. సంపూర్ణమైన ఉచితమైన క్షమాపణ నిశ్చయత దీనమైన అతడి హృదయంలో చోటు చేసుకుంది. అతడు మార్పుచెందిన మనిషిగా లేచాడు. అతడు తన ప్రభువుని చూశాడు. ఆ అనంత ప్రేమామూర్తిని వీక్షించటంద్వారా కలిగిన “పరివర్తనకు అతడు సాక్షిగా నిలిచాడు. దోషులైన ఇశ్రాయేలీయులు తమ పాప భారం నుంచి శిక్షనుంచి విముక్తి పొందాలన్న ఆకాంక్ష అప్పటినుంచి అతణ్ని ఆవేశంతో నింపింది. “మీరేల ఇంకను కొట్టబడుదురు?” “రండి మన వివాదమును తీర్చుకొందము. మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమమువలె తెల్లబడును. కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొట్టె బొచ్చువలె తెల్లనివగును.” “మిమ్మును కడుగుకొనుడి శుద్ది చేసికొనుడి. మా దుష్కియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. కీడు చేయుట మానుడి. మేలు చేయుట నేర్చుకొనుడి.” అన్నాడు ప్రవక్త. యెష. 1:5,18,16,17. PKTel 212.3

తాము ఎవర్ని సేవిస్తున్నట్లు చెప్పుకొంటున్నారో అయినా తాము ఎవరి ప్రవర్తనను అపార్థం చేసుకున్నారో ఆ దేవుణ్ని ఆధ్యాత్మిక వ్యాధిని స్వస్థపర్చే మహామహునిగా వారి ముందుంచాడు. శిరసుమొత్తం వ్యాధిగ్రస్తమైతేనేం? హృదయం మొత్తం బలహీనమైతేనేం? అరికాలు నుంచి తలవరకు స్వస్థతలేకుండా వళ్లంతా దెబ్బలు గాయాలు దుర్వాసనగల పుండ్లు ఉంటేనేం? యెష. 1:6 చూడండి. తన చిత్తానుసారంగా మూర్ఖంగా నడిచేవ్యక్తి ప్రభువు తట్టుకు తిరగటం ద్వారా స్వస్తత పొందవచ్చు. ప్రభువిలా అంటున్నాడు, “నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును. వారిలో దుఃఖించువారిని ఓదార్చుదును.... దూరస్థులకును సమీపస్తులకును సమాధానము సమాధానమని చెప్పి నేను వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.” యెష 57:18,19. PKTel 213.1

ప్రవక్త దేవుణ్ని సర్వసృష్టికర్తగా ఘనపర్చాడు. యూదా పట్టణాలకు అతడందించిన సందేశం “ఇదిగో మా దేవుడు” యెష. 40:9. “ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు; “యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను; “నేను వెలుగును సృజించిన వాడను అంధకారమును కలుగజేసినవాడను”; “భూమిని కలుగ జేసినవాడను నేనే. దాని మిదనున్న నరులను నేనే సృజించితిని. నా చేతులు ఆకాశములను విశాల పరచెను. వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని.” యెష. 42:5; 44:24; 45:7,12. “నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు?” అని పరిశుద్దుడు అడుగుతున్నాడు. “మి కన్నులు పైకెత్తి చూడుడి. వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలు దేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలచువాడే గదా. తన అధికశక్తి చేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు.” యెష. 40:25, 26. PKTel 213.2

తాము తిరిగివస్తే తమను దేవుడు చేర్చుకొనడని భయపడ్డ వారినుద్దేశించి ప్రవక్త ఇలా అన్నాడు : PKTel 213.3

“యాకోబూ - నా మార్గము యెహోవాకు మరుగైయున్నది. నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేల అనుకొనుచున్నావు? ఇశ్రాయేలూ, నీవేల ఈలాగు చెప్పుచున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు. అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే! బాలురు సొమ్మసిల్లుదురు. అలయుదురు. యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజువలే రెక్కలుచాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు.” 27-31 వచనాలు. PKTel 213.4

సాతాను ఉచ్చుల్లోనుంచి విడిపించుకోటానికి శక్తిలేనివారిపట్ల అనంత ప్రేమగల దేవుని హృదయం జాలి పడుతున్నది. వారు తనకోసం నివసించేందుకు వారికి బలం చేకూర్చటానికి ఆయన ముందుకు వస్తున్నాడు. వారితో ఇలా అంటున్నాడు, “భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను. దిగులు పడకుము. నేను నిన్ను బలపరతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును.” “నీ దేవుడనైన యెహోవానగు నేను - భయపడకుము నేను నీకు సహాయము చేసెదని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను. పురుగువంటి యాకోబూ, స్వల్ప జనమగు ఇశ్రాయేలూ, భయపడకుడి. నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే.” యెష 41:10, 13,14. PKTel 214.1

యూదా నివాసులందరూ అయోగ్యులే. అయినా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఆయన నామాన్ని అన్యజనుల మధ్య ఘనపర్చాల్సిన వారు వారే? ఆయన గుణలక్షణాల్ని గురించి బొత్తిగా తెలియని వారిలో అనేకమంది ఆయన పరిశుద్ద ప్రవర్తన మహిమను వీక్షించాల్సి ఉన్నారు. కృపతోనిండిన తన సంకల్పాన్ని విస్పష్టం చేసేందుకే ఆయన ఈ వర్తమానంతో తన సేవకులైన ప్రవక్తల్ని పంపుతూ వచ్చాడు, “మీరందరు మా చెడ్డ మార్గమును మా దుష్టక్రియలను విడిచిపెట్టి తిరుగుడి” యిర్మీ. 25:5. యెషయా ద్వారా ఆయన ఇలా అన్నాడు, “నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టుకొనుచున్నాను.” “నా నిమిత్తము నా నిమిత్తమే ఆలాగు చేసెదను, నా నామము అపవిత్రపరచబడనేల? నా మహిమను మరి ఎవరికిని నేనిచ్చువాడను కాను.” యెష. 48:9,11. PKTel 214.2

పశ్చాత్తాపానికి స్పష్టమైన పిలుపు ఇవ్వటం జరిగింది. తిరిగి రావటానికి అందరికీ ఆహ్వానం ఇవ్వటం జరిగింది. ప్రవక్త ఇలా విజ్ఞప్తి చేశాడు, “యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెదకుడి. ఆయన సమీపములో ఉండగానే ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారియందు జాలిపడును. వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును.” యెష. 55:6, 7. PKTel 215.1

పాఠక మహాశయులారా, మీరు మీ మార్గాన్ని ఎన్నుకున్నారా? మీరు దేవుని విడిచి పెట్టి దూరంగా వెళ్లిపోయి సంచరిస్తున్నారా? అతిక్రమ ఫలాలు భుజించటానికి ప్రయత్నించి అవి మి నోటిలో బూడిదగా మారినట్లు కనుగొంటున్నారా? ఇప్పుడు మా ప్రణాళికలు తారుమారవ్వటంతో, మి నిరీక్షణలు కుప్పకూలటంతో, మీరు మనుషులు లేని స్థలంలో ఏకాంతంగా కూర్చుంటారా? ఎంతోకాలంగా మి హృదయంతో మాట్లాడ్తున్న ఆ స్వరం, మిరు పెడచెవిన పెట్టిన ఆ స్వరం ఇలా మాకు స్పష్టంగా వస్తున్నది, “ఈ దేశము మా విశ్రాంతి స్థలముకాదు; మిరు లేచి వెళ్లిపోవుడి. మీకు నాశనము నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించితిరి.” మికా. 2:10. మి తండ్రి ఇంటికి తిరిగి రండి. ఆయన మిమ్మల్ని ఇలా ఆహ్వానిస్తున్నాడు, “నేను నిన్ను విమోచించియున్నాను, నాయొద్దకు మళ్లుకొనుము.” “చెవి యొగ్గి నాయొద్దకు రండి. మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసెదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును.” యెష. 44:22; 53:3. PKTel 215.2

మీరు మంచివారయ్యేవరకు, దేవుని వద్దకు రావటానికి తగినంత మంచివారయ్యే వరకు క్రీస్తువద్దకు రాకుండా నిలిచిపోవాలన్న శత్రువు సలహాను వినకండి. అప్పటివరకు ఆగితే మీరు ఆయన వద్దకు ఎప్పుడూరారు. మావి మురికి వస్త్రాలని సాతాను అంటే రక్షకుని ఈ వాగ్దానాన్ని వల్లించండి, “నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను.” యోహా. 6:37. యేసు క్రీస్తు రక్తం పాపాన్ని శుద్ధి చేస్తుందని సాతానుతో చెప్పండి. దావీదు చేసిన ఈ ప్రార్థన మా ప్రార్థన కావాలి, “నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమముకంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము.” కీర్త. 51:7. PKTel 215.3

జీవంగల దేవునివంక చూడమంటూ ఆయన కృపా దీవెనలను అంగీకరించమంటూ ప్రవక్త యూదాకు ఉద్బోధ చేశాడు. కాని అది నిరర్థకమయ్యింది. కొందరు ఈ ఉద్బోధను శ్రద్దగా పాటించి విగ్రహారాధనను విడిచి పెట్టి యెహోవాను ఆరాధించటం మొదలు పెట్టారు. వారు తమ సృష్టికర్తలో ప్రేమ, కృప, దయాళుత్వాన్ని చూడటం నేర్చుకున్నారు. దేశంలో శేషించిన కొద్దిమందే ఉండనున్న యూదా చరిత్రలోని చీకటి దినాల్లో ప్రవక్త చెప్పిన మాటలు సత్ఫలాలు ఫలిస్తూ దిద్దుబాటు కలిగించనున్నాయి. యెషయా ఇలా అన్నాడు, “ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు. దేవతా స్తంభములైనను సూర్యదేవతా ప్రతిమనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు. మానవులు తమ్మును సృష్టించినవానివైపు చూతురు వారి కన్నులు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును.” యెష 17:7,8. PKTel 215.4

అతికాంక్షణీయుడు పదివేలమందిలో గుర్తించగలిగిన ఆయనను అనేకమంది వీక్షించాల్సి ఉంది. “రాజును నీవు కన్నులార చూచెదవు” యెష 33:17. వారి పాపాలకు క్షమాపణ లభిస్తుంది. వారు తమ దేవునియందు మాత్రమే అతిశయిస్తారు. విగ్రహారాధనుంచి విమోచన కలిగిన ఆ ఆనందకరమైన దినాన వారు ఇలా అంటారు, “యెహోవా ప్రభావము గలవాడై మన పక్షమున నుండును అది విశాలమైన నదులును కాలువలును ఉన్న స్థలముగా ఉండును .... యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షించును.” 21,22 వచనాలు. PKTel 216.1

తమ చెడు మార్గాలనుంచి మళ్లటానికి ఎంపిక చేసుకున్నవారికి యెషయా వర్తమానాలు ఓదార్పుతోను, ప్రోత్సాహంతోను నిండిన వర్తమానాలు. తన ప్రవక్తద్వారా ప్రభువు వర్తమానం ఇది : PKTel 216.2

‘యాకోబూ, ఇశ్రాయేలూ, వీటిని జ్ఞాపకము చేసి
కొనుము
నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించితిని
ఇశ్రాయేలూ, నీవు నాకు సేవకుడవై యున్నావు
నేను నిన్ను మరచిపోజాలను
మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములను
మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి
యున్నాను
నేను నిన్ను విమోచించియున్నాను, నాయొద్దకు PKTel 216.3

మళ్లుకొనుము.” యెష 44:21,22

“ఆ దినమున మిరీలాగందురు
- యెహోవా, నీవు నామీద కోపపడితివి
నీ కోపము చల్లారేను
నిన్ను స్తుతించుచున్నాను. నీవు నన్ను ఆదరించి యున్నావు”

“ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు
నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను
యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే
నా కీర్తనకాస్పదము
ఆయన నాకు రక్షణాధారమాయెను ....”

“యెహోవాను గూర్చి కీర్తన పాడుడి
ఆయన తన మహాత్మ్యమును వెల్లడించెను
భూమి యందంతటను ఇది తెలియబడును
సీయోను నివాసీ, ఉత్సాహ ధ్వని బిగ్గరగా చేయుము
నీ మధ్యనున్న ఇశ్రాయేలుయొక్క పరిశుద్ద దేవుడు
ఘనుడై యున్నాడు.” PKTel 217.1

యెష 12.